కొడుకుల్ని కాపాడి తండ్రి దుర్మరణం | Father dead after protect of Sons | Sakshi
Sakshi News home page

కొడుకుల్ని కాపాడి తండ్రి దుర్మరణం

Published Sun, Feb 21 2016 2:32 AM | Last Updated on Wed, Sep 5 2018 2:25 PM

కొడుకుల్ని కాపాడి తండ్రి దుర్మరణం - Sakshi

కొడుకుల్ని కాపాడి తండ్రి దుర్మరణం

రైలు ఢీకొని విద్యుత్ ఏఈ మృతి
 
తెనాలి రూరల్: మృత్యువు ఎదురుగా దూసుకురావడంతో ఆ తండ్రి చివరి క్షణంలో బిడ్డల్ని కాపాడుకుని తాను ప్రాణాలొదిలాడు. ఈ సంఘటన శనివారం గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగం జాగర్లమూడిలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన రెడ్డి రాంబాబు (37) విద్యుత్ శాఖలో తెనాలి రూరల్ ఏఈగా పనిచేస్తున్నారు.

శనివారం తన ఇద్దరు బిడ్డలతో కలసి గ్రామ శివారులో ఉన్న పొలం వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేందుకు కొమ్మమూరు కాల్వపై ఉన్న వంతెనపై వస్తూ ఎదురుగా వస్తున్న రైలును చివరి క్షణంలో గమనించిన రాంబాబు మృత్యువు తప్పదనుకున్నాడు.  బిడ్డలనైనా కాపాడాలనుకున్నాడు. ఒకరిని  కాల్వలోకి నెట్టేసి, మరొకరిని పట్టాల పక్కకు తోసేశాడు. ఈ లోగా రైలు వచ్చి రాంబాబును ఢీకొట్టింది. ఈ సంఘటనలో అతను ప్రాణాలు వదిలాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement