ఎరువుల దుకాణాలపై దాడులు | Fertilizers stores attacks | Sakshi
Sakshi News home page

ఎరువుల దుకాణాలపై దాడులు

Published Tue, Jun 24 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 AM

ఎరువుల దుకాణాలపై దాడులు

ఎరువుల దుకాణాలపై దాడులు

విజయనగరం : జిల్లాలో విజిలెన్స్ అధికారులు ఎరువులు, విత్తనాల వ్యాపారులను బెంబేలెత్తించారు. శని,ఆదివారాల్లో పలు మండలాల్లో దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వఉంచిన రూ. 3.16 కోట్ల విలువ చేసే విత్తనాలు, ఎరువులను సీజ్ చేశారు. విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి, నెల్లిమర్ల మండలాల్లో ఈ దాడులు నిర్వహించారు. విజయనగరంలో అత్యధికంగా రూ. 2.17 కోట్లు, బొబ్బిలిలో రూ. 75 లక్షలు,  చీపురుపల్లిలో రూ.13 లక్షలు, నెల్లిమర్లలో రూ.11 లక్షల స్టాక్ సీజ్ చేశారు. నలుగురు డీలర్లపై కలెక్టర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేశామని వ్యవసాయశాఖ జేడీ ప్రమీల తెలిపారు. కాగా జిల్లాలో చాలా ప్రాంతాల్లో సోమవారం ఎరువుల దుకాణాలు మూతపడ్డాయి.
 
 గోప్యమెందుకో...
 బొబ్బిలి: బొబ్బిలి పట్టణంలో శనివారం రాత్రంతా సోదాలు జరిపిన విజిలెన్స్ అధికారులు మూడు గోదాంల్లో రూ.75 లక్షల ఎరువుల ను సీజ్ చేశారు. ఇంత పెద్ద మొత్తం ఎరువులు సీజ్ అయినా, అన్ని గంటలు పాటు విజిలెన్స్, రెవెన్యూ అధికారులు స్థానిక వ్యవసాయ ఆధికారుల సహకారంతో తనిఖీలు నిర్వహించినా ఆ విషయం బయటకు పొక్కకుండా వ్యవసా య శాఖ సిబ్బంది జాగ్రత్త పడడంపై విమర్శ లు వస్తున్నాయి. మెయిన్ రోడ్డులో ఉండే బొడ్డు గున్నేశ్వరరావుకు చెందిన ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. శ్రీకాకుళం విజిలెన్స్ డీఎస్పీ కుమార్ ఆధ్వర్యంలో వచ్చిన ముగ్గురు సీఐలు గున్నేశ్వరరావు ఎరువుల దుకాణంతో పాటు దిబ్బవీధిలో ఉండే మూడు దుకాణాలను తనిఖీలు చేశారు. మండల వ్యవసాయాధికారితో పాటు ముగ్గురు విస్తరణాధికారులు, ఇద్దరు వీఆర్వోలతో కలిసి అర్ధరాత్రి ఒంటి గంట వరకూ సోదాలు నిర్వహించారు.
 
 రికార్డులకు, ప్రత్యక్షంగా ఉండే సరుకుకు తేడాలు ఉండడంతో వాటిని సీజ్ చేశారు. శనివారం అర్ధరాత్రి వరకూ సోదాలు జరుగుతున్నా దాన్ని మీడియాకు తెలియనివ్వకుండా వ్యవసాయాధికారులు జాగ్రత్త పడ్డారు. ఎలాగైతేనేం సోమవా రం ఉదయానికి ఈ విషయం బయటకు పొక్కింది. ఒక దుకాణం, మూడు గోదాంలను సీజ్ చేశారు. రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. 28:28 రకం ఎరువుల బస్తాలు 340 ఉన్నట్టు రికార్డుల్లో నమోదుకాగా, దుకాణంలో 217 బస్తాలు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. అలాగే పొటాష్ బస్తాలను రికార్డుల్లో 290 చూపించిగా దుకాణంలో 316 ఉన్నట్లు విజిలె న్స్ తనిఖీల్లో బయట పడింది. అయితే విజిలె న్స్ దాడుల సమాచారాన్ని వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గోప్యంగా ఎందుకు ఉంచారో అంతుపట్టడం లేదు.
 
 చీపురుపల్లిలో రూ.13 లక్షల ఎరువుల సీజ్
 చీపురుపల్లి : పట్టణంలోని గాంధీబొమ్మ సెంట ర్ వద్ద ఉన్న మహలక్ష్మి ట్రేడర్స్‌లో ఆదివారం సాయంత్రం విజిలెన్స్ డీఎస్‌పీ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో స్టాకు రిజిస్టర్లుకు, గోడౌన్లలో ఉన్న నిల్వలకు తేడా ఉండడంతో రూ.13 లక్షలు విలువ గల ఎరువులను సీజ్ చేశారు. దాడుల సమయానికి ట్రేడర్సులో యూరియా 853 బస్తాలు ఉండాల్సి ఉండగా 889 బస్తాలు, ఎస్‌ఎస్‌పీ 60 బస్తాలకు గాను 61, పౌడర్ 92కి 89, డీఏపీ ఆరు బస్తాలకు ఒక బస్తా, కోరమాండల్ ఎరువు 215 బస్తాలకు 190 బస్తాలు, 2828 రకం 183 బస్తాలకు 176 బస్తాలున్నాయి. ఇలా రికార్డుల్లో ఒక రకంగాను, గొడౌన్లులో వేరే రకంగాను ఉండడంతో మొత్తం స్టాకును సీజ్ చేశారు. గోడౌన్ల లో ఉన్న స్టాకు విలువ రూ.13 లక్షలు ఉంటుం దని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.  
 
 నెల్లిమర్లలో 11.33 లక్షల స్టాక్ సీజ్
 నెల్లిమర్ల: మండల కేంద్రంలోని ఎరువులు, విత్తనాల షాపుపై విజిలెన్స్ అధికారులు ఆది వారం రాత్రి దాడి చేశారు. ఆరు ప్యాకెట్ల విత్తనాలు, 15 బస్తాల ఎరువులు అక్రమంగా నిల్వ ఉంచినట్లు తేలడంతో రూ.11.33 లక్షల విలువైన సరుకును సీజ్  చేశారు. విజిలెన్స్ అధికారులు ఏఓ సూరినాయుడుతో కలిసి ఆదివారం రాత్రి తొమ్మిదిగంటల ప్రాంతంలో స్థానిక శ్రీనివాస ట్రేడర్స్ షాపుమీద దాడిచేశారు. షాపులోనున్న విత్తనాలు, ఎరువుల స్టాకును రికార్డులతో సరిచూశారు. ఆ సమయంలో రికార్డుల్లో లేని ఒక వరివిత్తనాల ప్యాకెట్, ఆరు మొక్కజొన్న విత్తనాల ప్యాకెట్లు, 15 ఎరువుల బస్తాలు అధికారులకు లభించాయి. షాపు యజమానిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఓ సూరినాయుడు తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement