మహబూబాబాద్, న్యూస్‌లైన్: వరంగల్ జిల్లా మహబూబాబాద్-గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టా విరగడంతో పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పట్టా విరిగిన విషయాన్ని పెట్రోల్ మెన్ చూడడంతో పెనుప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది కథనం ప్రకారం మహబూబాబాద్ మండలం అనంతారం గ్రామ శివారు రైల్వే గేటు-1,2 మధ్య 442/5-3 మైలు రాయి వద్ద అప్‌లైన్‌లో రైలు పట్టా విరిగింది. రాత్రి పూట విధులు నిర్వర్తించే పెట్రోల్ మెన్ విషయాన్ని గమనించి, సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఆ సమయంలో అప్‌లైన్‌లో వస్తున్న చార్మినార్ ఎక్‌సప్రెస్ డ్రైవర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో రైలును నిలిపివేశారు. ఈ క్రమంలో పలు స్టేషన్లల్లో జీటీ, గరీబ్థ్,్ర స్పెషల్ ట్రైన్, కాకతీయ ఫాస్‌ట ప్యాసింజర్ ఎక్కడికక్కడే నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం రైళ్లను పునరుద్ధరించారు. దాదాపు గంటకు పైగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.