బిల్ చెల్లించలేదని ప్రసారాలు నిలిపివేస్తున్నట్లు డిస్‌ప్లే
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): సీఎం చంద్రబాబు ఏ వేదిక మీద నుంచి ప్రసంగించినా రాష్ట్రంలో 2 కోట్ల కేబుల్ కనెక్షన్లు ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతీ ఇంటికీ ఇవ్వనున్నట్లు ఆర్భాటంగా చెబుతున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో కోటి ఇళ్లకు కేబుల్ ఆపరేటర్ల ద్వారా, 30లక్షల ఇâళ్లకు డీటీహెచ్‌ల ద్వారా సేవలు అందుతున్నాయి. కానీ సీఎం 2 కోట్ల మందికి కనెక్షన్‌లు ఇస్తామని చెప్పినట్లు ఇటీవల ఓ పత్రికలో ప్రచురించారు. 25 లక్షల ఇళ్లకు ఫైబర్ సేవలు అందిస్తున్నామని చెబుతున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు కేవలం 2 లక్షల ఇళ్లకు మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా కొందరు వినియోగదారులకు వేలల్లో టెలిఫోన్ బిల్లులు రావడం చూసి బెంబేలెత్తుతున్నారు.
ఈ ఫైబర్ గ్రిడ్ సదుపాయాన్ని మిగిలిన రాష్ట్రాల్లో విద్యార్థులకోసం, ఈ గవర్నెర్స్ కోసం వినియోగిస్తే మన రాష్ట్రంలో మాత్రం చానెళ్ల నియంత్రణకు వినియోగిస్తున్నారు. అంతేకాదు ఫైబర్ కనెక్షన్‌కు కేవలం రూ.149 మాత్రమే చెల్లించాలని అధికారులు తెలియజేస్తున్నా ఆపరేటర్లు మాత్రం రూ.234 వసూలు చేస్తున్నారు. ఇంకా మార్కెట్లో రూ.700లకు దొరికే ఐపీ టీపీ బాక్స్‌కు వీరు రూ.4వేల వరకూ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మరోపక్క ఇటీవల కేబుల్ ప్రసారాలు వీక్షిస్తున్న వీక్షకులకు బిల్లులు చెల్లించలేని కారణంగా కనెక్షన్ నిలిపివేస్తున్నట్లు డిస్‌ప్లేలో ప్రదర్శితమవుతుంది. వాస్తవానికి చాలామంది వినియోగదారులు ఎప్పుడో బిల్లులు చెల్లించేసినా, వారికి కూడా ప్రసారాలు అందడం లేదు. ఈ విధంగా డిస్‌ప్లే చూపించడం వల్ల వినియెగదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని కేబుల్ ఆపరేటర్లను కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment