Fiber grid project
-
చంద్రబాబు కనుసన్నల్లోనే ‘ఫైబర్ గ్రిడ్’ అక్రమాలు
సాక్షి, అమరావతి : ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో అక్రమాలన్నీ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కనుసన్నల్లోనే జరిగాయని హైకోర్టుకు సీఐడీ నివేదించింది. ప్రాజెక్టు రూపకల్పన మొదలు అమలు వరకు ప్రతి దశలో చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వివరించారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే ప్రాజెక్టు వ్యయాన్ని రూ.333 కోట్లకు పెంచారని చెప్పారు. ఈ విషయాన్ని పలువురు వాంగ్మూలాల్లో స్పష్టంగా చెప్పారన్నారు. ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టులో అక్రమాలపై సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి గురువారం మరోసారి విచారణ జరిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇరుపక్షాలు పోటాపోటీగా వాదనలు వినిపించాయి. వాదనలు పూర్తవడంతో తీర్పును రిజర్వ్ చేస్తూ జస్టిస్ సురేష్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. టెండర్ నిబంధనలు, ఒప్పందంలో నిర్దేశించిన ప్రమాణాలకు భిన్నంగా కాంట్రాక్టు సంస్థ నాసిరకం సామగ్రిని ఉపయోగించిందని, దీనివల్ల ఖజానాకు రూ.115 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. ఈ మొత్తాన్ని టెరాసాఫ్ట్ అధినేత, చంద్రబాబుకు సన్నిహితుడైన వేమూరి హరిప్రసాద్ తొలుత తన కుటుంబ సభ్యుల ఖాతాలకు, అక్కడి నుంచి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించారన్నారు. ఈ విషయంలో మరిన్ని వివరాలను రాబట్టేందుకు చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అసలు వేమూరి హరిప్రసాద్ చంద్రబాబు సిఫారసుతోనే గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడు అయ్యారన్నారు. టెరాసాఫ్ట్‌కు లబ్ధి చేకూర్చేందుకే ఎలాంటి కారణం లేకుండా టెండర్ గడువును పొడిగించారని తెలిపారు. చంద్రబాబు కార్యాలయం మౌఖిక ఆదేశాలతో టెండర్ గడువు చివరి తేదీకి ముందు రోజు టెరాసాఫ్ట్‌ను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారని కోర్టుకు నివేదించారు. సంబంధిత శాఖకు ఇన్చార్జ్గా ఉన్న ఓ ఉన్నతాధికారి టెరాసాఫ్ట్‌కు ప్రాజెక్టు అప్పగించడంపై అభ్యంతరం తెలిపారని, దీంతో ఆయన్ని బదిలీ చేసి, నామమాత్రపు పోస్టు ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు పాత్రకు సంబంధించి ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలు లభించలేదని, ఆ తరువాత సీఐడీ పలువురు వాంగ్మూలాలను నమోదు చేసి, లోతైన దర్యాప్తు చేసిందన్నారు. దీంతో చంద్రబాబు పాత్రపై పలు ఆధారాలు లభించాయని, ఆయన్ని నిందితునిగా చేర్చామని అన్నారు. చంద్రబాబు కుమారుడు రెడ్ బుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు చాలా పలుకుబడి కలిగిన వ్యక్తే కాక, బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసి, సాక్ష్యాలను తారుమారు చేయగల సమర్థత ఉన్న వ్యక్తి కూడానని కోర్టుకు వివరించారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందువల్ల ఈ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు. చంద్రబాబుపై కేసు నమోదు వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవన్నారు. చంద్రబాబు లబ్ధి పొందినట్లు ఒక్క ఆధారం చూపలేదు చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ.. సీఐడీ ఈ కేసు నమోదు చేసి రెండేళ్లయిందని, ఇప్పటివరకు దర్యాప్తు పూర్తి చేయలేదని, చార్జిషీట్ దాఖలు చేయలేదని తెలిపారు. ప్రాజెక్టు వ్యయం పెంపు పూర్తిగా సంబంధిత శాఖ అంతర్గత విషయమన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా చంద్రబాబు లబ్ధి పొందినట్లు సీఐడీ ఒక్క ఆధారం కూడా చూపడంలేదన్నారు. ఈ రెండేళ్లు చంద్రబాబు బయటే ఉన్నారని, ఒక్క సాక్షిని కూడా ప్రభావితం చేయలేదని చెప్పారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వ ప్రోద్బలంతో సీఐడీ ఈ కేసు నమోదు చేసిందన్నారు. ప్రతి కేసులో చంద్రబాబును జైలులోనే ఉంచాలన్నది ప్రభుత్వ ఎత్తుగడగా కనిపిస్తోందన్నారు. -
పీటీ వారెంట్‌పై విచారణను నిరోధించలేం
సాక్షి, అమరావతి: ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో జరిగిన ఆర్థిక అక్రమాలపై నమోదు చేసిన కేసులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌పై విచారణ జరపకుండా ఏసీబీ కోర్టును నిరోధించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇలాంటి ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు ఇప్పటికే నిరాకరించిన విషయాన్ని సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌తో పాటు సీఐడీ దాఖలు చేసిన పోలీసు కస్టడీ పిటిషన్‌పై కూడా వాదనలు కొనసాగుతున్నాయని ఏజీ వివరించారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ ఇవ్వొద్దని అభ్యర్థించారు. దీనికి హైకోర్టు స్పందిస్తూ.. గురువారం ఉదయం నుంచే చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటామని తెలిపింది. ఇరుపక్షాలూ ఆరోజే వాదనలు పూర్తి చేయాలని స్పష్టం చేస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో అక్రమాలపై నమోదు చేసిన కేసులో సీఐడీ చంద్రబాబును 25వ నిందితునిగా చేర్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ సురేష్ రెడ్డి బుధవారం మరోసారి విచారణ జరిపారు. ఈ కేసులో ఫిర్యాదుదారు అయిన ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఎండీ తరఫున తాను న్యాయవాదిగా ఉన్నప్పుడు వాదనలు వినిపించానని, అందువల్ల ఈ కేసును విచారించడంపై ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పాలని ఇరుపక్షాల న్యాయవాదులను కోరారు. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చంద్రబాబు న్యాయవాదులు స్పష్టంగా చెప్పడంతో విచారణ కొనసాగించారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలకు, వాటిలో లోటుపాట్లకు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును బాధ్యుడిగా చేయడానికి వీల్లేదన్నారు. టెరాసాఫ్ట్ సంస్థకు టెండర్ ఖరారు చేసిన కమిటీలో, పనులు అప్పగించిన కమిటీలో చంద్రబాబు సభ్యుడు కాదన్నారు. సీఐడీ 2021లో కేసు నమోదు చేసి, ఇన్నాళ్లూ మౌనంగా ఉందన్నారు. ఏనాడూ చంద్రబాబుకు నోటీసు ఇవ్వలేదని, మొన్నటి వరకు నిందితునిగా కూడా చేర్చలేదని తెలిపారు. అకస్మాత్తుగా ఆయన్ని 25వ నిందితునిగా చేర్చారని తెలిపారు. తమ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం వెలువరించేంత వరకు పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు విచారణ జరపకుండా ఉత్తర్వులివ్వాలని కోరారు. అగర్వాల్ అభ్యర్థనపై ఏజీ శ్రీరామ్ అభ్యంతరం తెలిపారు. సుప్రీంకోర్టును సైతం ఇదే రకమైన కోరిక కోరారని, అందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందని ఏజీ చెప్పారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరారు. ఏసీబీ కోర్టులో బెయిల్, పోలీసు కస్టడీ పిటిషన్లపై విచారణ ముగిసిందా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. లేదని శ్రీరామ్ తెలిపారు. ఏజీ చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పీటీ వారెంట్ విషయంలో ఏసీబీ కోర్టును నిరోధిస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించారు. -
Oct 2nd 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu In Rajamaundry Central Prison, Cases Scams And Ground updates 07:59PM ►మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్ ►సీఎం జగన్, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారు ►బండారు వ్యాఖ్యలపై గుంటూరు జిల్లా ఆరండల్ పేట్, నగర పాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు.. ►400/2023, 41 (A), 41(B),153, 294, 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు. ►బండారుకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేసేందుకు గుంటూరు నుండి వచ్చిన పోలీసులు ►చాలా సేపు నోటీసులు తీసుకోకుండా తలుపు గడియ పెట్టుకున్న బండారు ►బండారును గుంటూరు తీసుకెళ్తున్న పోలీసులు 7:01PM ►టిడిపి నేత బండారు సత్యనారాయణ.. మంత్రి రోజాపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణ వైఎస్సార్సీపీ నాయకుల నిరసన ►పుత్తూరు పట్టణం అంబేద్కర్ సర్కిల్ నందు బండారి సత్యనారాయణ దిష్టిబొమ్మ దగ్ధం ►పెద్ద ఎత్తున నినాదాలతో బండారు సత్యనారాయణను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ ►బండారు సత్యనారాయణ దిష్టిబొమ్మను చెప్పులతో సన్మానించారు వైసీపీ మహిళా నేతలు ►గాంధీ జయంతి సందర్భంగా పుత్తూరు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లతో నివాళులు 6:33PM ►మాజీ మంత్రి బండారు సత్యనారాయణ పై మరో కేసు నమోదు ►అరండల్‌పేట పీఎస్ లో 153A , 294, 504, 505 ఐపీసీ, సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద కేసు ►బండారుకు 41బి, 41ఏ కింద నోటీసులివ్వనున్న పోలీసులు ►బండారు సత్యనారాయణ నివాసానికి చేరుకున్న గుంటూరు పోలీసులు ►తలుపులు వేసుకుని పోలీసులకు సహకరించని బండారు సత్యనారాయణ 5:54 PM, అక్టోబర్ 02, 2023 అనకాపల్లిలో బండారు ఇంటి వద్ద ఉద్రిక్తత ► పోలీసులను అడ్డుకునేందుకు భారీగా కార్యకర్తలను తరలించిన టిడిపి నేతలు ► నోటీసులు ఇచ్చేందుకు లోపలికి వెళ్లాలనుకున్న పోలీసులను అడ్డగించిన టిడిపి నేతలు 5:50 PM, అక్టోబర్ 02, 2023 త్వరలో భువనేశ్వరి ఓదార్పు యాత్ర ► ప్రజల కోసం మా నాన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు ► మా కుటుంబ సభ్యులు నలుగురూ.. నాలుగు దిక్కులు అయిపోయాం ► చంద్రబాబు అరెస్ట్ తర్వాత 105 మంది హఠాన్మరణం పాలయ్యారు ► చంద్రబాబును బాగా అభిమానించే వారంతా ప్రాణాలు కోల్పోయారు ► మరణించిన 105 కుటుంబాలను నేను త్వరలోనే పరామర్శిస్తాను 3:50PM, అక్టోబర్ 02, 2023 భువనేశ్వరిపై లక్ష్మీ పార్వతి ధ్వజం ►ఇన్నేళ్లకు భువనేశ్వరికి తండ్రి గుర్తుకురావడం ఆశ్చర్య మేస్తోంది ►భువనేశ్వరి నీకు నిజంగా తండ్రి,తల్లి మీద గౌరవం ఉంటే నీ భర్త లక్షల కోట్ల అవినీతి బయటపెట్టు ►నీతండి, నీ తల్లి నిజంగా పుణ్యదంపతులు ►ఆ పుణ్యదంపతుల కడుపున పనికిమాలిన సంతానం పుట్టారు ►నువ్వు,నీ అక్క దోపిడీవర్గానికి చెందిన పచ్చి అవకాశవాదులు ►లక్షల కోట్లు నీ భర్త స్వయంగా సంపాదించాడా? ►నిజాయితీపరుడైన నీ తండ్రికి సేవ చేసిన నేను అదృష్టవంతురాలిని ►ఇద్దరు అవినీతి అనకొండలకు కొమ్ముకాయడానికి బస్సు యాత్ర మొదలు పెట్టావా? ►బస్సుయాత్ర ద్వారా ఏం చెప్తావ్ నువ్వు ? ►నీ భర్త,కొడుకు మీద చూపించిన జాలి...నీ తండ్రి పై చూపించి ఉంటే ఆయన ఎంతో సంతోషపడేవారు 1:35 PM, అక్టోబర్ 02, 2023 రేపు, ఎల్లుండి సుప్రీంకోర్టు ముందుకు ఓటుకు కోట్లు కేసు ► ఢిల్లీ: రేపు సుప్రీంకోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ ► నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ కు డబ్బులిస్తూ పట్టుబడిన కేసు ► రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేయనున్న సుప్రీంకోర్టు ► విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం ► ఐటెం నెం.42 గా లిస్ట్ అయిన కేసు ► లంచం ఇచ్చాం కానీ, కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని, కేసు కొట్టేయాలని అంటున్న రేవంత్ రెడ్డి ► ఈ కేసులో ప్రాథమిక సాక్షాధారాలు ఉన్నాయని, అన్ని విషయాలు ట్రయల్ కోర్టుకు ఇచ్చామంటున్న తెలంగాణ ప్రభుత్వం ► అక్టోబర్ 4న ఇదే కేసుకు సంబంధించి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ► మన వాళ్లు బ్రీఫ్డ్ మీ అన్న వాయిస్ చంద్రబాబుదేనని ఇప్పటికే నిర్దారించిన ఫోరెన్సిక్ లాబ్ 1:30 PM, అక్టోబర్ 02, 2023 ఎట్టకేలకు బాబు జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు : సజ్జల ► ఒక అవినీతిపరుడు అడ్డంగా బుక్కయ్యాడు : సజ్జల ► ఆధారాలు ఉన్నాయి కాబట్టే కోర్టు విశ్వసించి జైలుకు పంపింది ► అటువంటి వ్యక్తికి కొందరు జోకర్లు మద్దతిస్తున్నారు ► దీక్షలు చేయడం బరితెగింపు ► జగన్ తనకు తానే పరీక్ష పెట్టుకున్నారు ► తన పాలనలో మేలు జరిగితేనే మద్దతివ్వాలని జగన్ ధైర్యంగా చెబుతున్నారు ► మా చేతుల్లో అధికారాలు లేవు... జగన్ ప్రజలకు ఇచ్చేశారు ► గ్రామ/వార్డు సచివాలయాల్లో పాలన ఎలా సాగుతుందో చూస్తున్నాం ► జగనన్న సురక్ష ద్వారా 90 లక్షల సర్టిఫికెట్లు, సేవలు అందాయి ► ఇప్పుడు జగనన్న సురక్షా క్యాంపెయిన్ జరుగుతోంది ► ఇవన్నీ గ్రామ/వార్డు సచివాలయాల వల్లే సాధ్యమవుతోంది 1:25 PM, అక్టోబర్ 02, 2023 తెలుగుదేశంలో తీవ్ర అంతర్మథనం ► ఇటీవల వరుసగా జరుగుతున్న టిడిపి భేటీల్లో పార్టీ దుస్థితిపై చర్చ ► టిడిపి సీనియర్ నేత సమాచారం ప్రకారం కార్యకర్తల్లో సడలిన విశ్వాసం ► పవన్‌కళ్యాణ్ తప్ప చంద్రబాబుకు ఇంకో దిక్కు లేదా? ► చంద్రబాబు తర్వాత తెలుగుదేశంలో మరో పెద్ద తలకాయ లేదా? ► ఇప్పటికిప్పుడు ఇంత అర్జంటుగా జైల్లో పొత్తు పెట్టుకోవాలా? ► జనసేన మద్ధతు లేకపోతే మనం ఏమి చేయలేమా? ► ఎల్లో మీడియాలో ఎందుకు బ్రాహ్మణి జపం చేస్తున్నారు? ► ఇన్నాళ్లు నాయకుడని చెప్పిన లోకేష్‌ను ఎందుకు వెనక్కి నెడుతున్నారు? ► ఎన్నికలకు ఏడు నెలల ముందు ఇంత గందరగోళమా? ► ఒక్క అరెస్ట్‌కే అతలాకుతులం కావాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది? ► జాతీయ స్థాయిలో రెండు కూటములు ఎందుకు దూరం పెడుతున్నాయి? ► కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు పట్టించుకోవడం లేదు? ► నాడు మోదీని నానా మాటలు ఎందుకు అనాలి? ఇప్పుడెందుకు కాళ్లు పట్టుకోవాలి? ► కనీసం కాంగ్రెస్ అధిష్టానం నుంచయినా బాబుకు అనుకూలంగా ఒక్క మాట రావట్లేదు? ► ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా చంద్రబాబు కాంగ్రెస్ మిత్రపక్షాలకు అనుకూలంగా ప్రచారం చేశారు కదా.? ► రాహుల్, సోనియా ఎందుకు బాబును మరిచిపోయారు? ఎందుకు మాట్లాడడం లేదు? ► మన స్థాయి రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులేనా.? 1:05 PM, అక్టోబర్ 02, 2023 సుప్రీంకోర్టులో రేపు చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ► చంద్రబాబు పిటిషన్ మంగళవారం విచారించనున్న సుప్రీంకోర్టు ► జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ముందుకు పిటిషన్ ► 6 వ నెంబర్ కోర్టులో జరగనున్న విచారణ ► Case No: SLP(Crl) No. 012289 - / 2023 Registered on 23-09-2023 ► Category : 1405-Criminal Matters : Matters relating to Prevention of Corruption Act ► స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదయిన కేసు కొట్టేయాలని చంద్రబాబు పిటిషన్ ► తమ వాదన విన్న తర్వాతే కేసులో నిర్ణయం తీసుకోవాలంటూ ఇంప్లీడ్ అయిన ఏపీ ప్రభుత్వం ► ఐటెం నెంబర్ 63గా లిస్ట్ అయిన చంద్రబాబు కేసు ► తనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A వర్తిస్తుందని పిటిషన్ ► తనను అరెస్ట్ చేసిన విధానం తప్పని చంద్రబాబు లాయర్ల వాదన ► గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేయడం అక్రమం అని పిటిషన్ లో వాదన 12:55 PM, అక్టోబర్ 02, 2023 పవన్ కళ్యాణ్ పై వెల్లంపల్లి విమర్శలు ► పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ ► రెండు చోట్లా ఓడిపోయిన పవన్‌కు సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదు ► పవన్‌కు 175 సీట్లలో అభ్యర్ధులను నిలబెట్టే దమ్ముందా? ► చంద్రబాబు, లోకేశ్‌లను తిట్టి మళ్లీ వారి పక్కనే చేరాడు ► అవినీతికి పాల్పడి లోనికెళ్లిన చంద్రబాబుతో జైల్లో పొత్తు పెట్టుకున్నారు ► పవన్ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలి : వెల్లంపల్లి 12:50 PM, అక్టోబర్ 02, 2023 పార్ట్ నర్ కోసం పవన్ కళ్యాణ్ దీక్ష మచిలీపట్నం సువర్ణ కల్యాణ మండపంలో పవన్‌కల్యాణ్ దీక్ష తెలుగుదేశం కోసం పవన్‌తో పాటు సంఘీభావంగా జనసేన నేతలు అర్జంటుగా చంద్రబాబును విడిచిపెట్టాలన్న డిమాండ్ తో దీక్ష అవినీతి వ్యతిరేక పార్టీ అని చెప్పిన పవన్ ఇప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం పదవి కోసం తన పొత్తుదారుడు చంద్రబాబు కోసం ఎజెండా విషయంలో రాజీ 12:45 PM, అక్టోబర్ 02, 2023 మార్పు ముందు బాబు ఇంటి నుంచి రావాలి : పోసాని కృష్ణ మురళి ► నారా కుటుంబం ఎన్నాళ్లు శాసిస్తుంది? : పోసాని కృష్ణ మురళి ► భారతదేశానికి ఒకరే గాంధీ... కానీ ఏపీకి మాత్రం ఇద్దరు గాంధీలు ► ఒకరు చంద్రబాబు, లోకేష్, వారింట్లో భర్తలను మించిన రాజకీయ నాయకురాలు భువనేశ్వరీ, బ్రాహ్మణి ► చంద్రబాబు, లోకేష్ నాశనం కావడానికి కారణమెవరు? ► చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి వెళ్ళేటప్పుడు భువనేశ్వరి ఎందుకు అడ్డుకోలేదు? ► నాన్న ఎన్టీఆర్‌ను చెప్పుతో కొట్టినా.. భువనేశ్వరి ఎందుకు అడుగలేదు? ► అత్తా కోడళ్ళు ఇద్దరూ భర్తల కంటే పెద్ద రాజకీయ నాయకురాళ్లు ► పవన్ కళ్యాణ్ అమాయకుడు కాబట్టే మళ్ళీ టీడీపీకి మద్దతు ఇస్తున్నారు ► పవన్ కళ్యాణ్ ఎంత తిట్టినా టిడిపి పొత్తు పెట్టుకుంది కేవలం కాపు ఓట్ల కోసమే ► కాపులు ఎవరి మైకంలోకి వెళ్ళకండి... ఎవరు మంచి చేస్తే వాళ్ళను గెలిపించండి 12:30 PM, అక్టోబర్ 02, 2023 అనకాపల్లిలో టిడిపి నేతల దౌర్జన్యం ► అనకాపల్లిలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఇంటి వద్ద టిడిపి నేతల దౌర్జన్యం ► ఓ మహిళా కానిస్టేబుల్ ను నెట్టేసిన టిడిపి నేతలు ► అనుమతి లేదంటున్నా లోనికి వెళ్లేందుకు ప్రయత్నం ► అడ్డుకున్న పోలీసులపౌ దౌర్జన్యం ► టిడిపి నేతల తోపులాటలో కింద పడిపోయిన మహిళా కానిస్టేబుల్ 11:45AM, అక్టోబర్ 02, 2023 దీక్షకు టీడీపీ నేతల డుమ్మా.! ►గాంధీ జయంతి నాడు.. అవినీతి కేసులో అరెస్టైన చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ దీక్షలు ►ఇప్పటికే జనం ముక్కున వేలేసుకుంటున్న వైనం ►చంద్రబాబుకు సంఘీభావంగా చేపట్టిన దీక్షను లైట్ తీసుకుంటున్న టీడీపీ శ్రేణులూ ►ఇప్పటికే చాలా జిల్లాల్లో ఇన్‌ఛార్జి స్థాయి దాకా నేతల డుమ్మా ►కర్నూలు పత్తికొండ నియోజకవర్గం ఇంఛార్జి శ్యామ్ బాబు దూరం ►చాలాచోట్ల మొక్కుబడి నిరసనలు 11:37AM, అక్టోబర్ 02, 2023 దొంగ దీక్షలను ప్రజలు గమనించాలి : మంత్రి రోజా ►గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తి చంద్రబాబు ►విద్యార్థుల సొమ్ము దోచుకున్న వ్యక్తి చంద్రబాబు ►చంద్రబాబు దీక్ష గాంధీజీని అవమానించడమే ►టీడీపీ నేతల దొంగ దీక్షలను ప్రజలు తరిమి కొట్టాలి ►చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో.. టీడీపీ సత్యాగ్రహ దీక్షలపై తిరుపతిలో మంత్రి ఆర్కే రోజా కామెంట్స్ 11:10AM, అక్టోబర్ 02, 2023 చంద్రబాబు కేసు.. ఐటెం నెంబర్ 63 గా లిస్ట్ ►రేపు సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు కేసు విచారణ ►కేసు విచారణ చేయనున్న జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్ ►ఐటెం నెంబర్ 63 గా లిస్ట్ అయిన చంద్రబాబు కేసు ►తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు ►తనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17a వర్తిస్తుందని పిటిషన్ ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం అక్రమం అని పిటిషన్లో వాదన 11:10AM, అక్టోబర్ 02, 2023 జైల్లో బాబు.. బయట భార్య.. ఢిల్లీలో కొడుకు ►చంద్రబాబు అరెస్ట్‌పై దీక్షలతో పరువు తీసుకుంటున్న టీడీపీ ►గాంధీ జయంతి నాడు.. సత్యమేవ జయతే పేరిట ఏడు గంటల దీక్ష ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు దీక్ష ►రాజమండ్రిలో సతీమణి నారా భువనేశ్వరి దీక్ష ►మరోవైపు ఢిల్లీలో తనయుడు నారా లోకేష్ దీక్ష ►చంద్రబాబు ఏం చేసి జైలుకు వెళ్లారని నిలదీస్తున్న జనం ►టీడీపీ శ్రేణుల నుంచే సరిగ్గా స్పందన దక్కని వైనం 10:39 AM అక్టోబర్ 02, 2023 టీడీపీ దీక్షపై మంత్రి అంబటి సెటైర్ ►జైల్లో పడ్డ అవినీతి పరుడు దీక్ష చేస్తుంటే మహాత్ముడి ఆత్మ క్షోభిస్తుంది!హే రామ్! జైల్లో పడ్డ అవినీతి పరుడు దీక్ష చేస్తుంటే మహాత్ముడి ఆత్మ క్షోభిస్తుంది!హే రామ్!@naralokesh @ncbn — Ambati Rambabu (@AmbatiRambabu) October 2, 2023 10:35AM, అక్టోబర్ 02, 2023 హే రామ్.. ►గాంధీ జయంతి నాడు టీడీపీ కొత్త డ్రామా ►అవినీతి కేసులో అరెస్ట్ అయితే.. సత్యాగ్రహ దీక్షలా! ►టీడీపీ దీక్షలతో గాంధీ ఆత్మ ఘోషిస్తోందంటున్న జనం ►టీడీపీ నిరసనలపై విస్తుపోతున్న జనం ►ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్‌పై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీడీపీ ►మోత మోగిద్దాం కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కరువు ►ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా టీడీపీ దక్కని సానుభూతి 10:15AM, అక్టోబర్ 02, 2023 IRR కేసులో నారాయణకు మళ్లీ నోటీసులు ►ఇన్నర్ రింగ్‌రోడ్ స్కామ్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు మరోసారి నోటీసులు ►ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో ఏ2గా ఉన్న నారాయణ ► బెయిల్‌పై బయట ఉన్న నారాయణ ► మరోసారి నోటీసులు పంపిన దర్యాప్తు సంస్థ ఏపీ సీఐడీ ► ఈనెల 4న విచారణకు హాజరుకావాలని నోటీసులు ► ఇదే స్కామ్‌లో అదే తేదీన టీడీపీ జాతీయ కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ విచారణ ► ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి మరీ లోకేష్‌కు నోటీసులు అందజేసిన ఏపీ సీఐడీ ►ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో ఏ14గా ఉన్న నారా లోకేష్ ► నారాయణ, లోకేష్‌లను కలిపి విచారించే అవకాశం 09:58AM, అక్టోబర్ 02, 2023 సుప్రీంకోర్టులో రేపే ఓటుకు కోట్లు కేసు విచారణ ►మళ్లీ తెరపైకి చంద్రబాబు నోటుకు ఓటు కేసు ►సుప్రీం కోర్టు లో అక్టోబర్ 3న రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ►రేవంత్ పిటిషన్‌ను విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ►ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని, కేసు కొట్టేయాలని అంటున్న రేవంత్ రెడ్డి ►ఈ కేసులో ప్రాథమిక సాక్షాధారాలు ఉన్నాయని, అన్ని విషయాలు ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని అంటున్న తెలంగాణ ప్రభుత్వం ►సుప్రీంకోర్టు ఏం చెప్తుందనే దానిపై ఉత్కంఠ ►మరోవైపు.. అక్టోబర్ 4న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ►ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్ర పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ ►విచారణ చేయనున్న జస్టిస్ సుందరేష్, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం 09:20AM, అక్టోబర్ 02, 2023 రాజకీయాల్లోకి రావడం ఆమె ఇష్టం: నారా లోకేష్ ►జైల్లో చంద్రబాబు గారిని చూసి షేక్ అయ్యాను ►చంద్రబాబు అరెస్ట్‌లో ఇతరుల హస్తంపై ఏం మాట్లాడలేను ►అరెస్ట్‌పై సిగ్గుపడడం లేదు ►ఇది రాజకీయాల్లో భాగమని భావించడంలేదు ►రాజకీయాల్లోకి రావడం బ్రహ్మాణి ఇష్టం ►తెలుగుదేశం పార్టీ ఏనుగు లాంటింది ►గల్లా ఇంట్లో ఆదివారం రాత్రి ఢిల్లీలో విలేకర్లుతో నారా లోకేష్ ►స్కామ్‌లపై మాత్రం దాటవేత సమాధానాలు 9:00 AM, అక్టోబర్ 02, 2023 దయనీయ స్థితిలో టీడీపీ: ఎంపీ విజయసాయిరెడ్డి ► అధినాయకుడు కరప్షన్ కేసులో జైలుపాలైనా పార్టీ శ్రేణులు పెద్దగా పట్టించుకోకపోవడం టీడీపీ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. ► త్వరలోనే ఆ పార్టీ రెండు మూడు ముక్కలుగా చీలిపోవచ్చు. ► 40 ఏళ్లుగా పార్టీకి మద్ధతిస్తున్న ‘బలమైన’ వ్యాపార వర్గంలో కూడా పునరాలోచన మొదలైంది. ► ఆయన దోపిడీలను తామెందుకు సమర్థించాలన్న ఆలోచనలో పడ్డారు. అధినాయకుడు కరప్షన్ కేసులో జైలుపాలైనా పార్టీ శ్రేణులు పెద్దగా పట్టించుకోకపోవడం టీడీపీ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. త్వరలోనే ఆ పార్టీ రెండు మూడు ముక్కలుగా చీలిపోవచ్చు. 40 ఏళ్లుగా పార్టీకి మద్ధతిస్తున్న ‘బలమైన’ వ్యాపార వర్గంలో కూడా పునరాలోచన మొదలైంది. ఆయన దోపిడీలను తామెందుకు… — Vijayasai Reddy V (@VSReddy_MP) October 2, 2023 08:56AM, అక్టోబర్ 02, 2023 జైలు జీవితానికి అలవాటు పడిన చంద్రబాబు ►ఉదయం న్యూస్ పేపర్ లతో కాలక్షేపము ► ఐదు చానెల్స్‌తో నిత్యం టీవీ చూస్తున్న బాబు ►రాజమండ్రి జైల్లో 23వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►చంద్రబాబుకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్న జైలు వర్గాలు ►వేడి నీళ్లు స్నానం ►ఎప్పటికప్పుడు ఇంటి నుంచి భోజనము ► కానీ, ఇవాళ జైల్లో ఒక్కరోజు దీక్ష 08:53 AM, అక్టోబర్ 02, 2023 నారావారికి ఓ న్యాయం, ఆంధ్రా వారికీ ఇంకో న్యాయ మా? ►సానుభూతి కోసం టీడీపీ నానా తంటాలు ►ఈ నెల 5 నుంచి బస్సు యాత్ర యోచనలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ►రేపు సుప్రీం కోర్టులో జరిగే పరిణామాల తర్వాత తుది నిర్ణయం ► అన్ని జిల్లా కేంద్రాల్లో పర్యటన చేసేలా రూట్‌మ్యాప్ ► కుప్పం నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టేలా టీడీపీ ప్లాన్ ► ఇప్పటి వరకూ ఏ సమస్యపై బయటకు రాని భువనేశ్వరి, బ్రహ్మణి భువనేశ్వరి, బ్రహ్మణిలకు YSRCP సూటి ప్రశ్నలు బషీర్ బాగ్ కాల్పుల్లో రైతులు చనిపోయినప్పుడు ఈ ఇద్దరూ ఎందుకు బయటకు రాలేదు? పుష్కర్ ఘాట్‌లో చంద్రబాబు కుటుంబం స్నానానికి వెళ్లినప్పుడు.. అమాయకులు 30 మంది చనిపోయినపుడు ఎందుకు రాలేదు? ఎరుపాడులో సామాన్యులు చనిపోయినపుడు ఎందుకు రాలేదు? ఇరుకు సందులో మీటింగ్ పెట్టి.. జనాల్ని బలిగొన్నప్పుడు ఎందుకు రాలేదు? సొంత పార్టీ వినోద్ కుమార్ జైన్ వేధింపులతో ఓ చిన్నపాప చనిపోయినప్పుడు ఎందుకు రాలేదు? ►ఎపుడు.. ఎప్పుడూ.. అయ్యోపాపం అనలేదు. బయటకు వచ్చి విజిల్స్, హారన్లు కొట్టలేదు ఈ ఇద్దరూ. ► నారావారికి ఓ న్యాయం, ఆంధ్రా వారికి ఇంకో న్యాయమా? YSRCP challenge 08:41 AM, అక్టోబర్ 02, 2023 బాబు పై ఎన్ని కేసులు? ఎన్ని స్టే :పేర్ని నాని ►సిట్టింగ్ జడ్జితో నీ ఆస్తులపై విచారణకు సిద్ధమా స్టేBN ? ►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే తెచ్చుకున్నారు. ►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే. ►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. ►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే. ►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే. ►2003లో కన్నా లక్ష్మీనారాయణ పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే. ►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే. ►2004లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు వేశాడు. ►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ..దాంట్లోనూ స్టే ►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే ►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే ►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే ►విచారణలు జరగకుండా ఈ స్టేల బాగోతం ఎందుకు? 08:41 AM, అక్టోబర్ 02, 2023 బండారు నివాసం వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత ►Chandrababu కేసు తర్వాత మంత్రి రోజా పై బండారు నీచమైన వ్యాఖ్యలు ► డీజీపీ ఫిర్యాదు చేసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ► ఫిర్యాదు ఆధారంగా చర్యలకు ఉపక్రమించిన పోలీసులు ► విశాఖ వెన్నెల పాలంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటికి వెళ్లిన పోలీసులు ►ఇంట్లో నుంచి బయటికి రాని బండారు ►గడి పెట్టుకొని రాత్రి నుంచి ఇంట్లోనే ఉన్న బండారు ► సోమవారం ఉదయం బండారు నివాసం వద్ద ఉద్రిక్తత ► అయినా.. ఇంటి నుంచి బయటకు రాని బండారు సత్యనారాయణ మూర్తి ► ఇంటి ఆవరణలోనే వేచి చూస్తున్న పోలీసులు ► 41ఏ నోటీస్‌లు ఇస్తారా? లేదంటే స్టేషన్‌కు తీసుకెళ్తారా? ►బండారును కలిసి నోటీస్ ఇస్తామంటున్న పోలీసులు 08:12 AM, అక్టోబర్ 02, 2023 భువనేశ్వరి బస్సు యాత్ర! ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నేతల పడరాని పాట్లు ►చివరకు.. చంద్రబాబు భార్య భువనేశ్వరి బస్సు యాత్రకు సిద్ధం ►భువనేశ్వరిని బలవంతంగా ఒప్పించిన సీనియర్లు? ►ఈ వారంలోనే చేపట్టే అవకాశం ►ఈ నెల 5న కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభించే ప్రతిపాదన ►మేలుకో తెలుగోడా అనే పేరు ఖరారు! ►ఇలాగైనా ప్రజల అటెన్షన్ దక్కించుకోవాలని టీడీపీ నేతల తాపత్రయం ►కోర్టుల్లో వెలువడే ఉత్తర్వులకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం 07:29 AM, అక్టోబర్ 02, 2023 కోర్టుల్లో చంద్రబాబు, లోకేష్‌బాబు పిటిషన్ల అప్డేట్స్ ►నారా లోకేష్‌పై మూడు కేసులు, ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో నోటీసులు ►లోకేష్‌కు ఢిల్లీలో CID నోటీసులు, 4న విజయవాడ రావాలని సూచన ►స్కిల్ స్కాం కేసు : లోకేష్‌ను అరెస్ట్ చేసే విషయంలో అక్టోబర్ 4వరకు ఆగాలని హైకోర్టు సూచన ►హైకోర్టులో ఫైబర్ గ్రిడ్ కేసు : లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ అక్టోబర్ 4కు వాయిదా ►హైకోర్టు : ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా ►హైకోర్టు : ఇన్నర్ రింగ్ రోడ్ IRR కేసులో A1 చంద్రబాబు బెయిల్‌పై వాదనలు ► IRR కేసులో రేపు అక్టోబర్ 3న హైకోర్టులో విచారణ ►హైకోర్టు : అంగళ్లు అల్లర్ల కేసులో బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ ►ACB కోర్టు : చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లు అక్టోబర్ 4కి వాయిదా ►ఉండవల్లి పిటిషన్‌కు బెంచ్ కేటాయించాలని ఆదేశించిన ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ►సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ఇంకా విచారణకు లిస్టింగ్‌కాని వైనం 06:57 AM, అక్టోబర్ 02, 2023 జైల్లో చంద్రబాబు.. బయట భువనేశ్వరి ►గాంధీ జయంతి సందర్భంగా సెంట్రల్ జైల్లో నేడు చంద్రబాబు ఒక్కరోజు నిరసన ► స్కిల్ డెవలప్మెంట్ స్కాంతో పాటు పలు కుంభకోణాల్లో చంద్రబాబుపై అభియోగాలు ►మరోవైపు రాజమండ్రి క్వారీ మార్కెట్ ప్రాంతంలో బాబు సతీమణి భువనేశ్వరి నిరసన ► ‘సత్యమేవ జయతే’ పేరుతో భువనేశ్వరి దీక్ష ►రాజమండ్రి లోకేశ్ శిబిరంలో ఇప్పటికే భువనేశ్వరి బస 06:45 AM, అక్టోబర్ 02, 2023 టీడీపీ నేత బండారు అరెస్ట్‌కి రంగం సిద్ధం ►విశాఖ వెన్నెల పాలంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇంటికి వెళ్లిన పోలీసులు ►కాసేపట్లో అరెస్టు చేసే అవకాశం ►మంత్రి ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారు ►బండారు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన విమర్శలు ►బండారు సత్యనారాయణ పై డీజీపీకి ఫిర్యాదు చేసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ►బండారుని అరెస్టు చేయాలని లేఖలో పేర్కొన్న వాసిరెడ్డి పద్మ.. 06:33 AM, అక్టోబర్ 02, 2023 ఇది టీడీపీకి అంతమే: YSRCP ►మేం వద్దు… మా ఓట్లు కావాలా? ► మాజీ మంత్రి నారాయణకు చేదు అనుభవం ►నెల్లూరు పర్యటనలో అవకాశవాద రాజకీయాన్ని ప్రశ్నించిన మూలపేట ప్రజలు ►మొహం చాటేసి పారిపోయిన వైనం ► ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్‌లో నిందితుడిగా ఉన్న నారాయణ.. బెయిల్ మీద బయట ఉన్న సంగతి తెలిసిందే. మేం వద్దు… మా ఓట్లు కావాలా? “టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ అవకాశవాద రాజకీయాన్ని నిలదీసిన నెల్లూరు ప్రజలు” మూలపేట పర్యటనకు వెళ్లిన ఆయన్ను ‘చాన్నాళ్లకు వచ్చారు, కరోనా టైములో మేం ఎన్నో అవస్థలు పడ్డాం కానీ మీరు ఇటు రానే లేదు. మళ్ళీ ఎప్పుడొస్తారో.. మా బాధలు వినే ఓపిక లేదా?’ అని… pic.twitter.com/MWTpptyQUp — YSR Congress Party (@YSRCParty) October 1, 2023 06:33 AM, అక్టోబర్ 02, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @23 ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్ ► నంద్యాలలో సెప్టెంబర్ 09వ తేదీ పొద్దున అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ ► రిమాండ్ విధించి.. రెండుసార్లు పొడిగించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడీషియల్ రిమాండ్ మీద చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691 ► సీఐడీ రెండు రోజుల కస్టడీలో ఇంటరాగేషన్‌కు ఏమాత్రం సహకరించని వైనం ►మరో ఐదురోజులు కస్టడీకి కోరిన వైనం.. పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ► నేటితో (అక్టోబర్ 2)తో 23వ రోజుకు చేరిన చంద్రబాబు రిమాండ్ ► కోర్టు ఆదేశాల ప్రకారం.. చంద్రబాబుకు పూర్తి స్థాయిలో భద్రత, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు, ఇంటి భోజనం 06:30 AM, అక్టోబర్ 02, 2023 పవన్.. నీ కుల కామెంట్లేందో? ►పవన్ కుల స్టేట్మెంట్ల వైవిధ్యం ► కులం అంటే నచ్చదంటూనే.. సొంత కులస్తులే ఓడించారని గతంలో పవన్ కామెంట్లు ► కాపుల్లో ఐక్యత ఉంటే తాను భీమవరంలో గెలిచేవాడిని అంటూ వ్యాఖ్య ► గుర్తు చేసుకుంటున్న జనసైనికులు ► కుల ప్రస్తావనే నచ్చదు అని పదేపదే చెప్పే పవన్.. ప్రసంగాలు మాత్రం కులం చుట్టురానే! ►పవన్ స్టేట్మెంట్లపై ముక్కున వేలేసుకుంటున్న జన సైనికులు. కులం అంటే తనకు నచ్చదు అని చెప్పే @pawankalyan తనను సొంత కులస్తులే ఓడించారని గతంలో నిష్టూరమాడాడు. కాపుల్లో ఐక్యత ఉంటే తాను భీమవరంలో గెలిచేవాడిని అంటూ అతను గతంలో చేసిన కామెంట్లను యువత గుర్తు చేసుకుంటోంది. తనకు కుల ప్రస్తావనే నచ్చదు అని పదేపదే చెప్పే పవన్ ప్రసంగాలు యావత్తూ కులం… pic.twitter.com/nGLv1dNbRv — YSR Congress Party (@YSRCParty) October 1, 2023 -
ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
-
'టెరాసాఫ్ట్' మమ్మల్నీ మోసగించింది
సాక్షి, అమరావతి: ‘ఫైబర్ గ్రిడ్ల టెండర్లలో టెరాసాఫ్ట్ కంపెనీ ప్రభుత్వాన్నే కాదు కన్సార్టియం ఒప్పందాన్ని ఉల్లంఘించి మా కంపెనీని కూడా మోసం చేసింది’ అని హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ కె.జైన్ పేర్కొన్నారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. టెండర్లు దక్కించుకోవడం కోసం తమను కన్సార్టియంలో భాగస్వామిని చేసుకుని అనంతరం మోసం చేశారని ఆయన చెప్పారు. ఫైబర్ నెట్ టెండర్ల కుంభకోణంపై సీఐడీ అధికారులు టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు ఆ కంపెనీ కన్సార్టియంలో భాగస్వామి అయిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీతోపాటు అందుకు సహకరించిన అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా.. టెరాసాఫ్ట్ కంపెనీ తమ కంపెనీని ఎలా మోసం చేసిందనేది అనిల్ కె.జైన్ మాటల్లోనే.. టెండర్ల కోసమే కన్సార్టియంలో భాగస్వామ్యం కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫైబర్ గ్రిడ్ టెండర్లలో పాల్గొనాలంటే కనీసం మూడు కంపెనీలు కన్సార్టియంగా ఏర్పడాలి. వాటిలో ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు కోసం ఆప్టికల్ ఫైబర్లు సరఫరా చేసే కంపెనీ కూడా ఉండాలి. ఆ రంగంలో టెరాసాఫ్ట్ కు అనుభవం లేదు. కాబట్టి మమ్మల్ని సంప్రదించి కన్సార్టియంలో భాగస్వామిగా చేర్చుకుని, టెరాసాఫ్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఫైబర్ గ్రిడ్ మొదటి దశ పనుల కోసం పిలిచిన రూ.330 కోట్ల టెండర్లలో మా కంపెనీ రూ.134 కోట్ల విలువైన పనులు చేస్తుందని ఒప్పందంలో ఉంది. కానీ.. కేవలం బిడ్ దాఖలు చేయడానికి అర్హత సాధించేందుకే మాకు అవకాశం కల్పించారని ఆ తరువాత మేం గుర్తించాం. 20 శాతం పనులే ఇచ్చారు టెండర్లు దక్కిన తరువాత మమ్మల్ని పక్కనపెట్టేశారు. కన్సార్టియం ఒప్పందం ప్రకారం మేం రూ.134 కోట్ల విలువైన ఆప్టికల్ కేబుల్స్ వేయాల్సి ఉంది. కానీ మాతో కేవలం రూ.27 కోట్ల విలువైన పనులే చేయించారు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ రంగంలో మా కంపెనీకి మంచి పేరుంది. మేం నాణ్యమైన పరికరాలు సరఫరా చేస్తాం. కేంద్ర టెలికాం శాఖ ప్రమాణాల మేరకు ఉండే మా పరికరాల ధర కూడా కాస్త ఎక్కువే. టెండర్ల కోసం వేసిన బిడ్‌లో మా కంపెనీ సరఫరా చేసే పరికరాలనే వేస్తామని చెప్పిన టెరాసాఫ్ట్ కంపెనీ ఆ తరువాత ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. చిన్నచిన్న కంపెనీలు ఉత్పత్తి చేసే నాసిరకం కేబుళ్లు, ఇతర పరికరాలతో పనులు చేశారు. ఆ పరికరాలు చాలా తక్కువ ధరకు మార్కెట్లో లభిస్తాయి. అడ్డదారిలో లాభాలు ఆర్జించడానికే టెరాసాఫ్ట్ కంపెనీ ఇలా చేసింది. అందుకే మమ్మల్ని తప్పించింది. టెరాసాఫ్ట్ కంపెనీ సరఫరా చేసిన నాసిరకం పరికరాలతో మా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. కన్సార్టియం ఒప్పందం ప్రకారం సరఫరా చేస్తామన్న పరికరాలకు మేం బాధ్యత వహిస్తాం. కానీ ఆ పరికరాలు కాకుండా టెరాసాఫ్ట్ కంపెనీ ఇతర కంపెనీల నుంచి నాసిరకం పరికరాలు కొనుగోలు చేసి పనులు చేసింది. వాటితో మాకెలాంటి సంబంధం లేదు. అప్పటి ప్రభుత్వ పెద్దలకు భయపడే మౌనంగా ఉన్నాం కన్సార్టియం ఒప్పందం మేరకు మా వాటా పని మాకు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా టెరాసాఫ్ట్ కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదు. అందుకోసం మేం పంపిన ఈ–మెయిల్స్ మా వద్ద ఉన్నాయి. కన్సార్టియం ఏర్పాటు చేసిన స్ఫూర్తికి విరుద్ధంగా టెరాసాఫ్ట్ కంపెనీ వ్యవహరించింది. దీనిపై అప్పట్లోనే గట్టిగా నిలదీయాలని భావించాం. కానీ.. అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలు టెరాసాఫ్ట్ కంపెనీకి ఉన్నాయని మాకు తెలుసు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, ఉన్నతాధికారులు అంతా ఆ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారన్నది బహిరంగ రహస్యం. అందుకే భయపడి ఏమీ చేయలేక మాకు అన్యాయం జరిగినా మౌనంగా ఉండిపోయాం. ఫైబర్ నెట్ టెండర్ల కుంభకోణంపై సీఐడీ కేసు పెట్టడాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా వాస్తవాలు బయటకు రావాలి. -
సపరివార స'మేత'!
సాక్షి, అమరావతి: ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ముసుగులో నాటి సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ అండదండలతో ఈవీఎంల చోరీ కేసులో నిందితుడు వేమూరి హరికృష్ణప్రసాద్ సకుటుంబ సపరివార సమేతంగా దోపిడీకి పాల్పడ్డారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు అమలుకు ఏర్పాటైన ఏపీఎస్ఎఫ్ఎల్(ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్)లో తన బంధు గణాన్ని, అనుచరులను నియమించుకుని యథేచ్ఛగా అక్రమాలకు తెగబడ్డారు. అంతా తనవాళ్లే...! ► టెరాసాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్ చౌదరి స్నేహితుడు అట్లూరి రామారావు చౌదరిని ఏపీఎస్ఎఫ్ఎల్ టెక్నికల్ ఈడీగానూ, సమీప బంధువు, ఆర్టీసీ రిటైర్డు ఉద్యోగి ఎం.వెంకటేశ్వరరావు చౌదరిని ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్ ఈడీగానూ, మరో బంధువు, పురపాలక శాఖ ఉద్యోగి సూర్యదేవర హరికృష్ణ చౌదరిని కమర్షియల్ ఈడీగానూ నియమించేలా ఏపీఎస్ఎఫ్ఎల్ సలహాదారు హోదాలో వేమూరి చక్రం తిప్పారు. ► తన సంస్థ నెట్ ఇండియాలో పనిచేస్తున్న వల్లభనేని చంద్రశేఖర్ చౌదరిని ఏపీఎస్ఎఫ్ఎల్లో ఈడీ(టెక్నికల్‌స్ట్రాటజీ) గా నియమించుకున్నారు. ► ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా చేపట్టే పనులకు టెండర్ షెడ్యూళ్లపై వల్లభనేని చంద్రశేఖర్‌కు సూచనలు చేసి వాటిని టెరా సాఫ్ట్, అనుబంధ సంస్థలకే దక్కేలా పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. బ్లాక్‌లిస్ట్‌లో కంపెనీకి పనులు.. ► ఇక టెండర్ ఎవల్యూషన్ (మదింపు) కమిటీలోనూ నియమితుడైన వేమూరి హరికృష్ణప్రసాద్ టెరా సాఫ్ట్‌ను ఏపీటీఎస్(ఏపీ టెక్నాలజీ సర్వీసెస్) బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినా అక్రమంగా పనులు దక్కించుకున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా ఫైబర్ గ్రిడ్‌లో రూ.2 వేల కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారు. తన సంస్థకు తానే సర్టిఫికెట్లు.. ► ఫైబర్ గ్రిడ్ తొలి దశలో రూ.333 కోట్ల విలువైన పనులను టెరా సాఫ్ట్‌కు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టిన వేమూరి నాసిరకంగా పనులు చేశారు. తొలి దశ పనుల ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్‌గా జెమినీ కమ్యూనికేషన్స్ ఎంపిక కాగా ఆ సంస్థ నుంచి నెట్ ఇండియా సబ్ కాంట్రాక్టు తీసుకుంది. నాసిరకంగా చేసిన పనులు నాణ్యంగా ఉన్నట్లు నెట్ ఇండియా సర్టిఫికెట్ ఇస్తే టెరా సాఫ్ట్‌కు బిల్లులు చెల్లించారు. ఇలా తన సంస్థ చేసిన పనులకు తనకు చెందిన మరో సంస్థతో సర్టిఫికెట్ ఇప్పించుకుని దోచుకున్నారు. అనుభవం లేకున్నా కుమార్తె కంపెనీకి పనులు.. ► నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ సంస్థకు వేమూరి హరికృష్ణప్రసాద్ కూతురు అభిజ్ఞ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. నెటాప్స్ సంస్థకు ఫైబర్ లేయింగ్ అనుభవం లేకున్నా ప్రభుత్వ కార్యాలయాలకు ఫైబర్ గ్రిడ్ లైన్ల పనులను రూ.30 కోట్లతో అప్పగించారు. కిలోమీటర్ ఫైబర్ లేయింగ్‌కు ఇతర రాష్ట్రాల్లో రూ.15 వేలు మాత్రమే ఉండగా ఏపీలో మాత్రం 600 మీటర్ల ఫైబర్ లేయింగ్ పనులకు రూ.42 వేల చొప్పున నెటాప్స్‌కు బిల్లులు చెల్లించడం గమనార్హం. ► ఫైబర్ గ్రిడ్ తొలిదశ పనుల పర్యవేక్షణ, నిర్వహణకు 2016 సెప్టెంబర్ నుంచి 2019 మే వరకు ప్రతి నెలా రూ.1.2 కోట్ల చొప్పున చెల్లించారు. ఫైబర్ గ్రిడ్ రెండో దశలో రూ.1,410 కోట్ల విలువైన పనులను తన సంస్థ టెరా సాఫ్ట్‌కే కట్టబెట్టేలా చక్రం తిప్పిన వేమూరి నాసిరకం ఫైబర్ వేసి బిల్లులు చేసుకున్నారు. -
శాఖ బాబుది.. సంతకం చినబాబుది
తండ్రి ముఖ్యమంత్రి.. తనయుడు మంత్రి.. తండ్రి అధికారంతో తనయుడి నిర్వాకం.. తండ్రీ తనయుల తోడుతో పేట్రేగిన బినామీ వెరసి రూ.2 వేల కోట్లు ఖజానాకు తూట్లు! ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో అప్పటి సీఎం చంద్రబాబు, నాటి ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి లోకేశ్, ఐటీ సలహాదారు వేమూరి హరికృష్ణలు సాగించిన అక్రమాల బాగోతం ఇదీ..! సాక్షి, అమరావతి: గత సర్కారు హయాంలో చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో రూ.రెండు వేల కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు మంత్రివర్గ ఉప సంఘం నిర్ధారించింది. ఇందులో కీలక పాత్ర పోషించిన వేమూరి హరికృష్ణప్రసాద్ ఆదివారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఫైబర్ గ్రిడ్ ఫైలుపై నారా లోకేశ్ సంతకం చేశారని అంగీకరించారు. ఆరోజు నాటి సీఎం చంద్రబాబు అందుబాటులో లేకపోవడంతో సంతకం చేశారన్నారు. అయితే అంతలోనే సర్దుకుని లోకేశ్ సంతకం చేయలేదంటూ బుకాయించడం గమనార్హం. బహిరంగ మార్కెట్లో అత్యంత నాణ్యమైన సెట్‌టాప్ బాక్స్ రూ.2,200కే దొరుకుతుండగా గత సర్కారు రూ.4,400 చొప్పున కొనుగోలు చేసింది. వీటిని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కంపెనీలో ఉత్పత్తి చేసినట్లు అంగీకరించిన వేమూరి ఆ తర్వాత కేవలం 40 వేల బాక్స్‌లు మాత్రమే ఉత్పత్తి చేశామంటూ మాట మార్చారు. ఫైబర్ గ్రిడ్ కుంభకోణంపై సీబీఐ విచారణకైనా తాను సిద్ధమంటూ మీడియాతో పేర్కొన్న వేమూరి ఆ తర్వాత కేసులో తనను ఇరికించడానికి ప్రయత్నిస్తే హైకోర్టును ఆశ్రయిస్తానంటూ బెదిరింపులకు దిగారు. దోపిడీకి అడ్డాగా ఫైబర్ గ్రిడ్... ► రాష్ట్రంలో ఒకే కనెక్షన్‌తో ఇంటింటికీ కారు చౌకగా కేబుల్ టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాన్ని కల్పించడానికి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టామని 2015లో అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇందుకోసం పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ పరిధిలో ఏపీఎస్ఎఫ్ఎల్(ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్)ను ఏర్పాటు చేశారు. ఈ శాఖను ఐదేళ్లపాటూ చంద్రబాబే నిర్వహించారు. ► వేమూరి హరికృష్ణప్రసాద్ ఆగస్టు 10, 2012 నుంచి సెప్టెంబర్ 8, 2015 వరకూ టెరా సాఫ్ట్ అనుబంధ సంస్థ టెరా క్లౌడ్ సొల్యూషన్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా ఉన్నారు. చంద్రబాబుకు బినామీ అయిన వేమూరిని ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా నియమించుకున్నారు. ► ఏపీ ఫైబర్ గ్రిడ్‌లో తొలిదశ పనులను రూ.333 కోట్లతో చేపట్టేందుకు ఆగస్టు 26, 2015న ఇన్‌క్యాప్(ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) నుంచి ఏపీఎస్ఎఫ్ఎల్ అనుమతి తీసుకుంది. ఈ టెండర్ మదింపు కమిటీలో ఐటీ సలహాదారు హరికృష్ణప్రసాద్‌ను చేర్చింది. ► తూర్పుగోదావరి జిల్లాలో ఈపాస్ యంత్రాల సరఫరాలో గోల్మాల్ చేసిన టెరా సాఫ్ట్‌ను ఏపీటీఎస్(ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్) సంస్థ బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. కానీ.. ఫైబర్ గ్రిడ్ తొలి దశ టెండర్‌ను ఆగస్టు 30, 2015న టెరా సాఫ్ట్‌కు కట్టబెట్టారు. ► టెరా సాఫ్ట్కుకేబుళ్లు, నెట్ వర్క్ ఆపరేషన్ సెంటర్(నాక్), హెడ్ ఎండ్ అనుభవం ఉన్నట్లు సిగ్నమ్ కంపెనీ పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించి పనులు దక్కించుకున్నారు. సిగ్నమ్ కంపెనీ సీఈ, ఎండీ దీనిపై ఇప్పటికే ఫిర్యాదు చేయడం గమనార్హం. ► నాసిరకం కేబుల్, క్లాంప్‌లతో టెరా సాఫ్ట్ తొలి దశలోనే రూ.333 కోట్లను దోచేసింది. సంబంధిత శాఖ మంత్రే సంతకం చేయాలి.. ► నిబంధనల మేరకు సంబంధిత శాఖను నిర్వహిస్తున్న మంత్రి మాత్రమే ఆ శాఖలోని ఫైళ్లపై సంతకం చేయాలి. ఇతర మంత్రులు సంతకం చేయకూడదు. ► 2017లో ఏప్రిల్ 3న చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ను కేబినెట్లోకి తీసుకుని ఐటీ, పంచాయతీరాజ్ శాఖలు అప్పగించారు. ► లోకేశ్ మంత్రి కాగానే హరికృష్ణ ప్రసాద్‌ను 2017 సెప్టెంబర్ 14న ఏపీఎస్ఎఫ్ఎల్కు సలహాదారుగా నియమించారు. అప్పటి నుంచి టెండర్లలో గోల్ మాల్ పెద్ద ఎత్తున జరిగింది. ► లోకేశ్ వద్ద ఉన్న శాఖలకు, ఏపీఎస్ఎఫ్ఎల్కు సంబంధం లేదు. కానీ ఏపీఎస్ఎఫ్ఎల్కు చెందిన ఫైల్ పై లోకేశ్ సంతకాలు చేశారు. ► భారత్ నెట్ ఫేజ్ 2కి సంబంధించిన ఎంవోయూ ఫైల్ పై నారా లోకేశ్ 2017 నవంబర్ 12న సంతకం చేశారు. బీబీఎన్ఎల్(భారత్ బ్రాండ్ బ్యాండ్ నెట్ వర్క్ లిమిటెడ్) రెండో దశకు సంబంధించి ఆ సంస్థకూ ఏపీఎస్ఎఫ్ఎల్కూ మధ్య ఎంవోయూను ఆమోదిస్తూ సంబంధిత ఫైల్‌పై లోకేశ్ సంతకం చేశారు. ఇక్కడే లోకేశ్ అడ్డంగా దొరికారు. ► బీబీఎన్ఎల్ మార్గదర్శకాలను తుంగలో తొక్కి.. టెండర్ షరతులను సడలించి.. నిబంధనలు ఉల్లంఘించి.. అర్హత లేని టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్‌కు 11.26 శాతం అధిక ధరలకు పనులు అప్పగించారు. దీనివల్ల అంచనా వ్యయం రూ.907.94 కోట్ల నుంచి రూ.1410 కోట్లకు పెరిగింది. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. అంతులేని అక్రమాలు.. ► 2014–2019 మధ్య సుమారు రూ.3,492 కోట్లవిలువైన పనులను ఫైబర్ గ్రిడ్‌లో చేపట్టారు. ఫేజ్ 1 కింద రూ.333 కోట్ల పనులు, సీసీ కెమెరాల కొనుగోలుకు రూ.959 కోట్లు, భారత్ నెట్‌కు రూ.1,600 కోట్లు, సెట్ టాప్ బాక్సుల కొనుగోలును రూ.600 కోట్లతో చేపట్టారు. ► ఫైబర్ గ్రిడ్ పరికరాలు, సెట్ టాప్ బాక్సులు, కేబుళ్ల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. చైనా కంపెనీలతో హరికృష్ణప్రసాద్ ముందుగానే డీల్ కుదుర్చుకుని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కంపెనీలో నాసిరకమైన సెట్ టాప్ బాక్స్‌లను తయారు చేయించి ఖజానాను దోచేశారు. కొనుగోలు చేసిన 12 లక్షలసెట్‌టాప్ బాక్సుల్లో 3.40 లక్షల బాక్స్‌లు పని చేయకపోవడమే ఇవి ఎంత నాసిరకంగా ఉన్నాయో నిరూపిస్తోంది. సాంకేతిక సలహాలు మాత్రమే.. ఇచ్చేవాడిని వేమూరి హరికృష్ణప్రసాద్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు టెండర్ కమిటీలో తాను లేనని.. సాంకేతిక సలహాలు మాత్రమే ఇచ్చేవాడినని టీడీపీ ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారుడు వేమూరి హరికృష్ణప్రసాద్ చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. టెండర్ దక్కించుకున్న సంస్థకు, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సెట్ టాప్ బాక్సు ఒక్కొక్కటి రూ.3,700కు కొనుగోలు చేశామని చెప్పారు. 10 లక్షల బాక్సులకు టెండర్లు వేస్తే సుమారు 7 సంస్థలు పాల్గొన్నాయని.. అందులో తక్కువ రేటు ఉన్న దాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఏపీలో ప్రస్తుతం 10 లక్షల మంది ఏపీ ఫైబర్‌నెట్‌ను వినియోగిస్తున్నారని.. వాటి పనితీరు ఎలా ఉందో వారిని విచారించుకోవచ్చన్నారు. తాను అవకతవకలకు పాల్పడలేదన్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. -
రూ.1,500 కోట్ల ‘ఫైబర్’ ఫ్రాడ్!
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో ఐటీ విభాగం సలహాదారుగా పనిచేసిన వేమూరి హరికృష్ణప్రసాద్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ఖజానాను లూటీ చేశారని ఏపీఎస్ఎఫ్ఎల్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్) బిజినెస్, ఆపరేషన్స్ మాజీ ఈడీ గౌరీశంకర్ వెల్లడించారు. వేమూరి నియమించిన వ్యక్తులే ఇప్పటికీ ఏపీఎస్ఎఫ్ఎల్లో పనిచేస్తున్నారని, అక్రమాలను బహిర్గతం చేసినందుకే తనను ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొన్నారు. తన సర్టిఫికెట్లు నిజమైనవని సబర్మతీ యూనివర్సిటీ నిర్ధారిస్తూ ధ్రువీకరణ పత్రంఇచ్చిందన్నారు. ఈ వ్యవహారంపై సీఐడీ లేదా పోలీసులతో విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్‌ను కోరారు. ఫైబర్ గ్రిడ్‌లో అక్రమాలపై బహిరంగ చర్చకు వేమూరి సిద్ధమా? అని సవాల్ చేశారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో రూ.1,500 కోట్ల బిల్లులను చెల్లిస్తే అందులో 80 శాతం వేమూరి హరికృష్ణప్రసాద్‌కు చెందిన టెరాసాఫ్ట్, నెట్‌ఇండియా, నెటాప్స్ సంస్థల ఖాతాల్లోకే వెళ్లాయన్నారు. గౌరీ శంకర్ శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. సెట్ టాప్ బాక్సుల కొనుగోళ్లలో అక్రమాలు.. ► సెట్ టాప్ బాక్స్‌ల కొనుగోళ్లలో భారీ అక్రమాలకు పాల్పడ్డారు. ఒక్కొక్కటి రూ.4,400 చొప్పున 12 లక్షల బాక్సులు కొనుగోలు చేశారు. ఇందులో 8.60 లక్షలు మాత్రమే పని చేస్తున్నాయి. ఒక్కో సెట్ టాప్ బాక్స్ కాల పరిమితి ఐదేళ్లు కాగా పదేళ్లుగా చూపించి ప్రభుత్వ గ్యారంటీతో ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.450 కోట్ల రుణం తీసుకున్నారు. ► ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ల నుంచి నెలకు రూ.11 కోట్లు బిల్లులు వసూలు కావాల్సి ఉండగా టెరా సాఫ్ట్ అక్రమాలకు పాల్పడి గరిష్టంగా రూ.ఏడు కోట్లు మాత్రమే వసూలైనట్లు చూపింది. తక్కువ బిల్లింగ్ చూపిస్తూ రూ.70 కోట్లకుపైగా దోపిడీ చేశారు. ఈ బిల్లింగ్‌ను సరి చేసేందుకు నేను సాఫ్ట్ వేర్ మార్చడంతో ఒక్క నెలలోనే రూ.8.50 కోట్ల బిల్లులు వసూలయ్యాయి. హరికృష్ణప్రసాద్ ఓ 420, మోసగాడు. తన స్నేహితుడు కనుమూరి కోటేశ్వరరావు, కుమార్తె అభిజæ్ఞ పేర్లతో సంస్థలను ఏర్పాటు చేసి భారీ అక్రమాలకు పాల్పడ్డారు. కుంభకోణంలో బడా నేతల పాత్రను బయటపెడతా. దీనిపై సీబీఐ విచారణ చేస్తే నిజాలు నిర్ధారణవుతాయి. టెండర్ కమిటీలో టెరాసాఫ్ట్ డైరెక్టర్... ► వేమూరి హరికృష్ణప్రసాద్ 2012 ఆగస్టు 10 నుంచి 2015 సెప్టెంబరు 8 వరకు టెరా సాఫ్ట్ అనుబంధ సంస్థ టెరా క్లౌడ్ సొల్యూషన్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ► ఏపీ ఫైబర్ గ్రిడ్ తొలి దశ పనులను రూ.333 కోట్లతో చేపట్టేందుకు 2015 ఆగస్టు 26న ఇన్‌క్యాప్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ కా>ర్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) నుంచి ఏపీఎస్ఎఫ్ఎల్ అనుమతి తీసుకుంది. ► ఈ టెండర్‌ను 2015 ఆగస్టు 30న టెరా సాఫ్ట్ దక్కించుకుంది. టెరా సాఫ్ట్ డైరెక్టర్ అయిన హరికృష్ణప్రసాద్ టెండర్ మదింపు కమిటీ సభ్యుడుగా ఉండటం అక్రమం. టెరా సాఫ్ట్‌కు కేబుళ్లు వేయడం, నెట్ వర్క్ ఆపరేషన్ సెంటర్(నాక్) ఏర్పాటు, హెడ్ ఎండ్ అనుభవం లేకున్నా నా సంస్థ పేరుతో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి పనులు దక్కించుకున్నారు. ► సిగ్నమ్ కంపెనీ సీఈ, ఎండీ అయిన నేను ఇదే అంశంపై ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ సాంబశివరావుకు ఫిర్యాదు చేశా. టెరాసాఫ్ట్‌కు అనుభవం ఉందని చెప్పాలంటూ హరికృష్ణప్రసాద్ నన్ను తీవ్రంగా బెదిరించారు. ► నాసిరకం కేబుళ్లు, క్లాంప్‌లతో తొలి దశ పనులను 2016లో ముగించి బిల్లులు తీసుకున్నారు. -
10 నెలల్లో ‘టీ–ఫైబర్’ పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: పటిష్టమైన డిజిటల్ నెట్వర్క్ అవసరాన్ని ప్రస్తుత కరోనా సంక్షోభం ఎత్తిచూపిందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాష్ట్రంలోని ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు చేపట్టిన టీ–ఫైబర్ ప్రాజెక్టును వచ్చే 10 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన టీ–ఫైబర్ నెట్‌వర్క్‌ను మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను వేగవంతం చేసేందుకు అవసరమైతే ‘రైట్ టు వే’చట్టాన్ని వినియోగించేందుకున్న అవకాశాలను పరిశీలిస్తామన్నారు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై మంగళవారం ఆయన ఇక్కడ సమీక్ష నిర్వహించారు. కరోనాపై యుద్ధంలో డిజిటల్ మౌలిక వసతులు ప్రభుత్వానికి ఉపయుక్తంగా మారాయన్నారు. ఆన్లైన్ విద్య, వైద్యం, ఈ–కామర్స్ సేవలకు ఏర్పడిన డిమాండ్ నేపథ్యంలో పటిష్టమైన డిజిటల్ నెట్వర్క్ కలిగి ఉండటం అత్యవసరమని చెప్పారు. లక్షల మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని వినియోగించుకుని ఇళ్ల నుంచే పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఐటీ, అనుబంధ రంగాల్లో ఈ ట్రెండ్ భవిష్యత్తులో సైతం కొనసాగే అవకాశముందన్నారు. ఈ అవసరాలను తీర్చడానికి ఎలాంటి లోపాలు లేని పటిష్టమైన బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అవసరమని, టీ–ఫైబర్ ప్రాజెక్టుతో ఇది సాధ్యం కానుందని వెల్లడించారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తయితే ప్రభుత్వం నుంచి ప్రభుత్వం (ఏ2ఏ), ప్రభుత్వం నుంచి పౌరులకు (ఏ2ఈ) అందించే సేవల్లో గణనీయమైన మార్పులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలను ప్రపంచంతో అనుసంధానం చేసేలా ఈ ప్రాజెక్టు ఉంటుందని తెలిపారు. ఆన్లైన్ విద్య/వైద్యం/వ్యవసాయ సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే శక్తి ఈ ప్రాజెక్టుకు ఉందన్నారు. గ్రామీణ ప్రాంతా ల్లోని ఇంటర్నెట్ కనెక్టివిటీ వస్తుందని, దీం తో డిజిటల్ కంటెంట్ ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. రైతు వేదికల అనుసంధానం కొత్తగా నిర్మించనున్న రైతు వేదికలన్నింటిని టీ–ఫైబర్‌తో అనుసంధానం చేయాలని కేటీఆర్ ఆదేశించారు. గ్రామాల్లోని రైతు వేదికల నుంచి రైతులు నేరుగా ముఖ్యమంత్రి, మంత్రి, వ్యవసాయ అధికారులతో మాట్లాడే అవకాశం కల్పించేందుకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించాలనే సీఎం కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్టు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, దిగుబడుల పెంపకం వంటి విషయాల్లో గణనీయమైన లబ్ధి పొందేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న డిజిటల్ నెట్వర్క్, స్టేట్ డేటా సెంటర్లను టీ–ఫైబర్ పరిధిలోకి తేవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. -
‘ఫైబర్‌గ్రిడ్’లో రూ.వేల కోట్ల దోపిడీ
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరిపించి, దోషుల నుంచి సొమ్ము రికవరీ చేయాలని మంగళవారం శానస సభలో అధికార వైఎస్సార్సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. గత టీడీపీ పాలకులు అస్మదీయ సంస్థలకు ఈ ప్రాజెక్టును కట్టబెట్టి, రూ.వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కేబుల్ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని తాము చెప్పిందే ప్రజలకు టీవీల ద్వారా చూపించాలంటూ నియంతృత్వ విధానానికి తెరలేపారని, గుత్తాధిపత్యం చలాయించాలని చూశారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. నెలకు రూ.149కే టీవీ కనెక్షన్, ఇంటర్నెట్, ఫోన్ కనెక్షన్ ఇస్తామని ప్రచారం చేసిన టీడీపీ పాలకులు రూ.1,500 కూడా విలువ చేయని సెట్‌టాప్ బాక్సు పేరుతో రూ.4,000 చొప్పున వసూలు చేశారని ధ్వజమెత్తారు. ‘‘అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుచరులకు చెందిన 4 కంపెనీలకు ఫైబర్ నెట్వర్కు ప్రాజెక్టును అప్పగించారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. దుర్బుద్ధితో సొంత ప్రయోజనాల కోసం ఫైబర్‌గ్రిడ్‌ను వాడుకున్నారు. ఫైబర్‌గ్రిడ్ నిధులను అప్పటి మంత్రి నారా లోకేశ్ రక్తంలా పీల్చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపి, అవినీతిని నిగ్గు తేల్చాలి. రివర్స్ టెండరింగ్ విధానంలో ముందుకెళ్లాలి’’ అని జోగి రమేష్ డిమాండ్ చేశారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా చంద్రబాబు సర్కారు గుత్తాధిపత్యానికి తెరలేపిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. సెట్‌టాప్ బాక్సుల కొనుగోలుతోపాటు ఇతర వ్యవహారాలపైనా దర్యాప్తు జరపాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. గుంటూరు, నరసరావుపేటలో ‘కే’ (కోడెల) చానల్ అక్రమాలపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అవినీతిపై దర్యాప్తు జరిపిస్తాం: మంత్రి గౌతంరెడ్డి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో ఎక్కువ ధరకు సెట్‌టాప్ బాక్సుల కొనుగోలు చేయడం వల్ల రూ.1,000 కోట్లు దుర్వినియోగమైన విషయం వాస్తవమేనని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అంగీకరించారు. ఈ ప్రాజెక్టులో అవినీతి అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించారు. కాగా, అవినీతి, నియంత పాలన కలిపితే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అభివర్ణించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ కేసులో నిందితుడైన వేమూరి రవికుమార్‌కు చెందిన సంస్థలకు ఈ ప్రాజెక్టు కట్టబెట్టారని విమర్శించారు. లక్షల సెట్‌టాప్ బాక్సుల కొనుగోలులో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై విచారణ జరిపిస్తామని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని బుగ్గన చెప్పారు. అన్న క్యాంటీన్ల నిర్మాణంలో అవినీతిపై విచారణ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ సర్కారు హయాంలో అన్న క్యాంటీన్ల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఎలాంటి ప్రణాళిక, ఆలోచన లేకుండా ఎన్నికల ముందు ఎక్కడ స్థలం దొరికితే అక్కడ ఈ క్యాంటీన్లు నిర్మించారని తెలిపారు. తెలంగాణలో అన్నపూర్ణ పేరుతో ఇదే తరహా క్యాంటీన్లు నిర్వహిస్తున్నారని, అక్కడ ఒక్కోదానికి రూ.1.50 లక్షలు వెచ్చిస్తే, ఏపీలో మాత్రం చంద్రబాబు సర్కారు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు ఖర్చు చేసిందని విమర్శించారు. అన్న క్యాంటీన్ల నిర్మాణంలో అవినీతిపై విచారణ జరిపిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. -
అంతన్నాడు.. ఇంతన్నాడే చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అంతన్నాడు.. ఇంతన్నాడు.. గంగరాజు అనే పాటను తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామస్తులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. చంద్రబాబు తీరే ఆ పాటను గుర్తుచేస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా మోరి గ్రామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్మార్ట్ విలేజ్‌గా ప్రకటించారు. 2016 డిసెంబర్ 29న మోరి గ్రామంలో భారీగా బహిరంగ సభలో ఆర్భాటంగా ప్రకటన చేశారు. ఫైబర్‌గ్రిడ్‌తో అనుసంధానమని, రాష్ట్రంలోనే తొలి పూర్తి నగదురహిత లావాదేవీల గ్రామమని, బహిరంగ మలవిసర్జన రహిత గ్రామమని ప్రకటించారు. సీఎం ప్రకటనలు చూసి ఇక మోరి గ్రామ స్వరూపమే మారిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అమలులో మాత్రం అదంతా ఉత్తిదేనని తేలిపోయింది. పనిచేయని ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లు రాష్ట్రంలోనే తొలిసారిగా ఫైబర్ గ్రిడ్‌ను మోరి గ్రామానికి అందించారు. 1,500 ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరుచేసింది. ప్రతి ఇంటికీ నెలకు రూ.149కే టీవీ, ఇంటర్నెట్ సౌకర్యం అన్నారు. ఆ కనెక్షన్లను స్థానిక కేబుల్ ఆపరేటర్లు ఫైబర్ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. అయితే ఇందులో 300 కనెక్షన్లకు ఐపీటీవీ (టీవీకి, ఫోన్‌కు పవర్ సప్లయి చేసే బాక్సులు) బాక్స్‌ల్లో వచ్చిన సాంకేతిక లోపాల వల్ల ప్రారంభంలోనే ఇన్స్టాల్ కాలేదు. పనిచేయని ఫోన్లు, కానరాని నగదు రహిత లావాదేవీలు నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు మోరిలో 600 మందికి స్మార్ట్ ఫోన్లు అందజేశారు. ఇచ్చిన కొన్ని రోజులకే ఫోన్ స్విచ్ఆఫ్ అవడం, బ్యాటరీ ఉబ్బిపోవడం, తదితర సమస్యలతో చాలావరకు పనికిరాకుండా పోయాయి. గ్రామంలో మెడికల్, కిరాణా, కూరగాయలు, పాన్‌షాప్.. ఇలా అన్నీ కలిపి 39 వరకూ ఉన్నాయి. నగదురహిత లావాదేవీలంటూ కేవలం నలుగురికి మాత్రమే స్వైపింగ్ మిషన్లు ఇచ్చింది. ప్రస్తుతం అవి కూడా వినియోగించని పరిస్థితి నెలకొంది.దీంతో ప్రస్తుతం నగదు లావాదేవీలే జరుపుతున్నారు. స్వచ్ఛభారత్‌కు తూట్లు సంపూర్ణ పారిశుధ్యంలో భాగంగా నూరుశాతం బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా మోరిని ప్రకటించారు. ఇందులో భాగంగా గ్రామంలో తొలి విడతగా 456 మరుగుదొడ్లు లేని నివాసాలను గుర్తించారు. ఇందులో నాలుగేళ్లలో 430 పూర్తిచేశారు. ఈలోపు కొత్తగా మరుగుదొడ్ల కోసం మరో 100 దరఖాస్తులు వచ్చాయి. బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా ప్రకటించినా అక్కడింకా మరుగుదొడ్లు లేని ఇళ్లు ఉన్నాయి. గ్రామాల్లో ఇంకా బహిరంగ మల విసర్జన కొనసాగుతూనే ఉంది.దీంతోపాటు ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోతోంది. టీవీ కనెక్షన్లకు సాంకేతిక లోపాలు ‘‘ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అమలు ప్రారంభంలోనే టీవీకి ఫైబర్ కేబుల్ వేసి కనెక్షన్ ఇచ్చారు. అయితే కొద్ది రోజులకే ఔటాఫ్ ఆర్డర్ అని వస్తోంది. టీవీని ఆన్ చేసిన వెంటనే స్క్రీన్‌పై నో ఇంటర్నెట్ ఏక్సెస్ అని వస్తుంది. ఇలా ఉంది మా ఊళ్లో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్’’ అని చెబుతున్నారు గ్రామస్తులు. మోరి ప్రజలకు సినిమా చూపించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మా ఊళ్లో భారీ బహిరంగ సభ పెట్టారు. స్మార్ట్ విలేజ్ అన్నారు. మోరి ప్రజలకు సినిమా చూపించారు. ఆయన చెప్పినవేవీ ఇక్కడ అమలు కాలేదు. –జాన శంకరరావు, మాజీ సర్పంచ్, మోరి, సఖినేటిపల్లి మండలం – కందుల శివశంకర్, సాక్షి ప్రతినిధి, కాకినాడ -
ఖజానాకు ‘ఈక్విటీ’ కన్నం!
సాక్షి, అమరావతి: ప్రైవేట్ సంస్థలు చేయాల్సిన పనికి ఏకంగా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా రెట్టింపు ధరలకు సెట్‌టాప్ బాక్సులను విక్రయిస్తూ తాజాగా ఈక్విటీ పేరుతో మరో దోపిడీ వ్యవహారానికి సర్కారు తెరతీయటంపై అధికారవర్గాలు నివ్వెరపోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితుడైన వేమూరి రవికుమార్‌కు చెందిన టెరా సాఫ్ట్వేర్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం రూ. కోట్ల విలువైన ఫైబర్ గ్రిడ్, సెట్‌టాప్ బాక్సుల ప్రాజెక్టును అప్పగించడం తెలిసిందే. తొలుత కేవలం రూ.300 కోట్లతో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించి ఇప్పుడు అంచనా వ్యయాన్ని రూ.5,200 కోట్లకు చేర్చడం గమనార్హం. ఇందులో రూ.200 కోట్లకు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి బ్యాంకు నుంచి అప్పు ఇప్పించింది. మరో రూ.వంద కోట్లను మైనింగ్ కార్పొరేషన్ నుంచి ఇప్పించింది. ఈ ప్రాజెక్టులో భారీ ఎత్తున అంటే ఏకంగా రూ.2000 కోట్లు ప్రభుత్వ పెద్దలకు చేరుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఏకంగా ఖజానా నుంచే జేబులు నింపేసుకోవటాన్ని చూసి ఉన్నతాధికార వర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో భారీ అవినీతికి పాల్పడుతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అజేయకల్లం ఇటీవలే వ్యాఖ్యానించడం తెలిసిందే. రూ.రెండు వేల కోట్ల దోపిడీకి స్కెచ్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును ఆర్థికశాఖ ఆదిలోనే గట్టిగా వ్యతిరేకించింది. ప్రైవేట్ సంస్థలు చేయాల్సిన పనిని రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరీ అప్పగించడాన్ని తప్పుబట్టింది. మరోవైపు ఈ ప్రాజెక్టు వ్యయాన్ని ఇప్పుడు ఏకంగా రూ.5,200 కోట్లకు పెంచేయడం గమనార్హం. ఈ ప్రాజెక్టును అనుబంధంగా ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ ద్వారా ఇళ్లలో టీవీలకు సెట్‌టాప్ బాక్సులను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నాసిరకం చైనా బాక్సులను రెట్టింపు ధరలకు వినియోగదారులకు అంటగట్టి రూ.2,000 కోట్ల దోపిడీకి ‘ముఖ్య’నేత బినామీ స్కెచ్ వేశారు. రాష్ట్ర ప్రజలపై అప్పులు భారం మోపడంతో పాటు ఖజానాను కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. సెట్‌టాప్ బాక్సుల ఏర్పాటు కోసం ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ రూ.4,000 కోట్ల అప్పు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. దీనికి ప్రభుత్వమే గ్యారెంటీ కూడా ఇచ్చింది. ఖజానా నుంచి మరో రూ.1,200 కోట్లు కాజేసే ఎత్తుగడ.. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు తాజాగా రూ.4,000 కోట్ల రుణం తీసుకోవడానికి గ్యారంటీ ఇచ్చిన సర్కార్ అంతటితో ఆగలేదు. కార్పొరేషన్ చేసే అప్పునకు ఈక్విటీ కింద రూ.1,200 కోట్లు మంజూరు చేయాలంటూ ఇటీవల ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈక్విటీ కింద రూ.1,200 కోట్లు ఇస్తేనే బ్యాంకుల నుంచి రుణం మంజూరు అవుతుందని కార్పొరేషన్ పేర్కొంది. దీనిపై ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 95 శాతం ఇళ్లలో టీవీలకు కేబుల్ కనెక్షన్లున్నాయని, అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా అప్పులు చేసి, ఖజానా నుంచి నిధులు కూడా ఇచ్చి సెట్‌టాప్ బాక్సులు సరఫరా చేయాల్సిన అవసరం ఏమిటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. దాదాపు కోటి ఫైబర్ కనెక్షన్లు ఇవ్వడంతో పాటు కోటి సెట్‌టాప్ బాక్సులను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లు తీసుకోవాల్సిందిగా గృహ వినియోగదారులపై ఒత్తిడి తేవడంతోపాటు ఇప్పటికే కేబుల్ కనెక్షన్లు ఇచ్చిన కేబుల్ ఆపరేటర్లను అధికారుల ద్వారా బెదిరిస్తోంది. ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ తీసుకుంటే నెలకు రూ.148కే టీవీ, ఫోన్, వైఫై అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. వైఫై వస్తుందనే ఉద్దేశంతో కొందరు కనెక్షన్లు తీసుకున్నా టీవీ సరిగా రాకపోవడం, ఇంటర్నెట్ పనిచేయకపోవడంతో ఆ కనెక్షన్లను తొలగించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. వినియోగదారులపై రూ.800 కోట్ల వడ్డీ భారం.. ఫైబర్ గ్రిడ్ కనెక్షన్, సెట్‌టాప్ బాక్సుల పేరుతో వినియోగదారులపై రాష్ట్ర ప్రభుత్వం రూ.800 కోట్ల వడ్డీ భారాన్ని మోపుతోంది. సెట్‌టాప్ బాక్సు ఖరీదు రూ.4,000ను వినియోగదారులు నాలుగేళ్లలో వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక్కో వినియోగదారుడు నాలుగేళ్లలో రూ.4,800 చొప్పన చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినట్లుగా కోటి కనెక్షన్లు, సెట్‌టాప్ బాక్సులను లెక్కలోకి తీసుకుంటే వినియోగదారులు నాలుగేళ్లలో వడ్డీ కింద రూ.800 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఫైబర్ గ్రిడ్ కనెక్షన్, సెట్‌టాప్ బాక్సు రెండూ తీసుకుంటే కనెక్షన్‌కు రూ.148తో పాటు బాక్సు ఖరీదు కింద రూ.100 చొప్పున ప్రతి నెలా మొత్తం రూ. 248 వంతున వినియోగదారులు చెల్లించాలి. అయితే ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లు తీసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదని ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులోనే తేలింది. దీంతో టార్గెట్ పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా జిల్లాకు ఒకరు చొప్పున 13 మంది సీనియర్ మేనేజర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించడం కొసమెరుపు. నాసిరకం బాక్సులు.. చైనా నుంచి నాసిరకం సెట్‌టాప్ బాక్సులను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయాన్ని కొద్ది నెలల క్రితం చెన్నై పోర్టులో తనిఖీల సందర్భంగా సెంట్రల్ ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ధృవీకరించారు. ఎక్సైజ్ సుంకం చెల్లించకుండా దిగుమతి చేసుకున్న సెట్‌టాప్ బాక్సులను చెన్నై పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి తయారీలో నాణ్యతా ప్రమాణాలను పాటించలేదని నిర్ధారించారు. దీంతో కేసుల భయంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్లోనూ ఆందోళన వ్యక్తమైంది. అప్పటికీ టీడీపీ కేంద్రం ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతుండటంతో వ్యవహారం సద్దుమణిగింది. దోపిడీ ఎలా అంటే...? మార్కెట్లో నాణ్యమైన సెట్‌టాప్ బాక్సులు ఒక్కోటి రూ.1,200 – రూ.1,500కే దొరుకుతున్నాయి. ఇంకా నాణ్యమైన వాటి విలువ రూ.2 వేల వరకు ఉంటుందని లెక్క వేసినా కోటి సెట్‌టాప్ బాక్సుల కొనుగోలు, సరఫరాకు రూ.2000 కోట్ల దాకా వ్యయం అవుతుంది. నిజానికి వీటిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే ఇంకా తక్కువ ధరకే లభిస్తాయి. అయితే ప్రభుత్వ పెద్దలు దేశంలో సెట్‌టాప్ బాక్సులు కొనుగోలు చేయకుండా చైనా నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించి ఒక్కోటి రూ.4,000 చొప్పున కొంటున్నారు. కేవలం రూ.2 వేల లోపే దొరికే సెట్‌టాప్ బాక్సులకు రూ.4 వేల చొప్పున చెల్లిస్తూ దోపిడీకి మార్గం సుగమం చేసుకున్నారు. అంటే కోటి సెట్‌టాప్ బాక్సుల కొనుగోళ్లలో రూ.2,000 కోట్ల అక్రమార్జనకు స్కెచ్ వేసినట్లు తేటతెల్లం అవుతోంది. -
‘ఫైబర్ గ్రిడ్’లో పైసా వసూల్
సాక్షి, అమరావతి బ్యూరో: ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో ప్రభుత్వ పెద్దలు పైసలు పిండుకుంటున్నారు. రూ.1,500 కోట్ల విలువైన ఈ కాంట్రాక్టు తమ అస్మదీయ సంస్థకు తప్ప ఇతరులకు దక్కకుండా పెద్ద స్కెచ్చే వేశారు. మొత్తం ప్రాజెక్టు విలువలో సగం.. అంటే రూ.765 కోట్ల మేర కమీషన్లు కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు రెండో దశ కాంట్రాక్టును ఇతర సంస్థలు దక్కించుకోకుండా ప్రభుత్వ పెద్దలు సాగించిన కుట్రలను గమనిస్తే.. ఇంత నీచానికి ఒడిగడుతారా అని ఛీ కొట్టక తప్పదు. టెండర్ అర్హత నిబంధనల్లో 11 సార్లు మార్పులు చేశారు, బిడ్లు దాఖలు చేయడానికి ఒక్కటంటే ఒక్కరోజే గడువు ఇచ్చారు. ఇలాంటి చోద్యం ఇంకెక్కడా ఉండదని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో 55 వేల కిలోమీటర్ల మేర వేయనున్న ఫైబర్ గ్రిడ్ రెండో దశ కాంట్రాక్టును ఏకపక్షంగా అస్మదీయ సంస్థకే కట్టబెట్టాలని ప్రభుత్వ పెద్దలు కొన్ని నెలల క్రితమే నిర్ణయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రతిపాదించిన ఆ కాంట్రాక్టును కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ అడ్డుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు మొదట షాక్ తగిలింది. మరోసారి టెండర్లు పిలవాల్సి వచ్చింది. ఈసారి ముఖ్యనేత సూచనలతో ఏపీఎస్ఎఫ్ఎల్ పకడ్బందీగా వ్యవహరిం చింది. కేవలం ఒక్కరోజు గడువుతో కాంట్రాక్టును ఏకపక్షంగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలపై అక్కసు ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టు కోసం తొలుత 7 సంస్థలు టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్లు దాఖలు చేశాయి. ఇండియా టెలికాం ఇండస్ట్రీస్(ఐటీఐ), టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్) వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇందులో ఉన్నాయి. దాంతో ప్రభుత్వ పెద్దలు దొంగాట ప్రారంభించారు. ప్రాజెక్టు కాలపరిమితిని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించడం ద్వారా ఇతర సంస్థలు తామంతట తామే వెనక్కి వెళ్లేలా చేయాలని భావించారు. టెండర్లు ఖరారు చేసేనాటికి టెలికాం స్టాండర్డ్ ఎలిజిబిలిటీ సెంటర్(టీఎస్ఈసీ) సర్టిఫికెట్ సమర్పించకపోతే ఎర్నెస్టు మనీ డిపాజిట్(ఈఎండీ) రూ.5 కోట్లు జప్తు చేస్తామన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ జోక్యం చేసుకున్న తర్వాత ఆ సంస్థల టెక్నికల్ బిడ్లను అనుమతించాల్సి వచ్చింది. కానీ, ప్రభుత్వ పెద్దలు మాత్రం తమ పంతం వీడలేదు ‘ఒక్క రోజు’ మంత్రాంగం ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగా టెండర్ అర్హత నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ వచ్చారు. ఫైబర్ గ్రిడ్ రెండో దశ టెండర్ల ప్రక్రియలో ఏకంగా 11 సవరణల ద్వారా 20 అదనపు నిబంధనలను చేర్చడం విస్మయపరుస్తోంది. ఆ సవరణలన్నీ ప్రభుత్వ పెద్దల అస్మదీయ సంస్థలకు అనుకూలంగా ఉండడం గమనార్హం. టెండర్ల దాఖలుకు గడువు తేదీ ఈ ఏడాది నవంబర్ 1 కాగా... చివరిదైన 11వ సవరణను పేర్కొంటూ అక్టోబరు 28న టెండర్ నిబంధనలను నిర్ణయించారు. ఆ రోజు ఆదివారం కావడంతో అక్టోబరు 29న అధికారికంగా వెబ్సైట్లో అప్లోడ్ చేసి సవరణను అక్టోబరు 30న విడుదల చేశారు. కానీ, సవరించిన నిబంధనలకు అనుగుణంగా బిడ్ల దాఖలుకు గడువును పొడిగించకపోవడం గమనార్హం. నవంబరు 1 నాటికి టెండర్లు దాఖలు చేయాలని స్పష్టం చేశారు. సాంకేతికంగా మూడు రోజులు గడువు ఉన్నట్లు కనిపిస్తున్నా వాస్తవానికి ఒక్కరోజు మాత్రమే గడువు ఇచ్చారు. దాంతో సవరించిన నిబంధనల మేరకు 4 కన్సార్టియం సంస్థలు బిడ్లు దాఖలు చేయలేకపోయాయి. కేవలం మూడు సంస్థలే బిడ్లు దాఖలు చేయడం గమనార్హం. ప్రభుత్వ పెద్దలకు బాగా కావాల్సిన ఆ సంస్థలకు ముందే సమాచారం ఉన్నందున ఒక్కరోజులోనే సవరించిన నిబంధనలకు అనుగుణంగా బిడ్లు దాఖలు చేయగలిగాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. రెండు డమ్మీ... అస్మదీయ సంస్థకే టెండర్! టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని చెప్పేందుకు మూడు కన్సార్టియం సంస్థలను అనుమతించారు. కానీ, వాటిలో రెండు సంస్థలు నామమాత్రంగానే పోటీలో ఉన్నాయి. వాటిలో ఓ సంస్థకు రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భారీ కాంట్రాక్టులు కట్టబెట్టారు. మరో సంస్థకు కూడా పలు సాఫ్ట్వేర్ కాంట్రాక్టులు ఇచ్చారు. ముఖ్యనేత బినామీ సంస్థకు మార్గం సుగమం చేస్తూ ఆ రెండు సంస్థలు ఫైబర్ గ్రిడ్ టెండర్లో ఎక్కువ ధర కోట్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో ముఖ్యనేత బినామీగా ఉంటూ ఏపీఎస్ఎఫ్ఎల్లో చక్రం తిప్పుతున్న ఓ కీలక వ్యక్తి ఆధీనంలోని సంస్థకే ఫైబర్ గ్రిడ్ టెండర్ కట్టబెట్టడానికి రంగం సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. రూ.1,500 కోట్ల కాంట్రాక్టును మూడు ప్యాకేజీలుగా విభజించి, ఆ సంస్థకు దారాదత్తం చేసేందుకు పన్నిన కుట్ర దాదాపు విజయవంతమైంది. కాగా, ప్రభుత్వ పెద్దల కుతంత్రంపై టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్(టీసీఐఎల్) కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. టెండర్ నిబంధనల సవరణలో మతలబు ఫైబర్ గ్రిడ్ టెండర్లో పాల్గొనేందుకు బిడ్ దాఖలు చేసే సంస్థలు భారతదేశంలో 24/7 సేవలు అందించే సొంత సర్వీసింగ్ సెంటర్, టోల్‌ఫ్రీ సెంటర్ ఉండాలి. 100 మంది సొంత సాంకేతిక నిపుణులతో ఈ సెంటర్ ఉండాలని నిబంధన విధించారు. కానీ, తరువాత ఆ అర్హత నిబంధనల్లో మార్పులు చేశారు. దీనిప్రకారం.. కనీసం 100 మందితో 24/7 సేవలందించే సర్వీసింగ్ సెంటర్, టోల్‌ఫ్రీ సెంటర్ ఉండాలి. దాంతోపాటు సొంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(ఆర్అండ్డీ) సెంటర్ ఆంధ్రప్రదేశ్‌లో ఉండాలని షరతు విధించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సాధారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆర్అండ్డీ సెంటర్లు ఉండవు. తద్వారా ఆ సంస్థలను పోటీ నుంచి తప్పించడానికే నిబంధనలను మార్చినట్లు స్పష్టమవుతోంది. టెండర్ దక్కించుకునే సంస్థలు ఏర్పాటు చేయాల్సిన రూటర్ల సామర్థ్యాన్ని కూడా అమాంతంగా పెంచేశారు. మొదట టెండర్లలో రూటర్లు 20 లక్షల ఎంఏసీ సామర్థ్యంతో 20 లక్షల ఐపీవీ4 యూనికాస్ట్ రౌట్లు, 10 లక్షల ఐపీవీ 6 రౌట్లు, 16 వేల మల్టీకాస్ట్ రౌట్లు కలిగి ఉండాలని చెప్పారు. కానీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తప్పించేందుకు రూటర్ల సామర్థ్యాన్ని పెంచేశారు. రూటర్లు 40 లక్షల ఎంఏసీ సామర్థ్యంతోపాటు 30 లక్షల ఐపీవీ 4 యూనికాస్ట్ రౌట్లు, 15 లక్షల ఐపీవీ 6 రౌట్లు, 50 వేల మల్టీకాస్ట్ రౌట్లు కలిగి ఉండాలని నిబంధన విధించడం గమనార్హం. అంతేకాదు రూటర్ ఎస్ఆర్, ఎస్ఆర్–టీఈ, ఎస్ఆర్వీ 6, టిల్ఫా, బీజీపీఎల్ఎస్ ఉపకరణాలకు అనుగుణంగా ఉండాలని కొత్త నిబంధన విధించారు. -
ఫైబర్ గ్రిడ్‌తో అమెరికాలో ఇవ్వనంత బ్యాండ్ విడ్త్
సాక్షి, అమరావతి: ‘ప్రస్తుతం విద్యుత్తును నిల్వచేయటం మీద దృష్టి సారించాం. ఈ రంగంలో పెట్టుబడులకు భారత్ ఉత్తమ దేశం..సురక్షితమని’ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం గురువారం కొలంబియా యూనివర్సిటీకి వెళ్లి ప్రసంగించారు. ప్రతి గ్రామాన్నీ రహదారులతో అనుసంధానిస్తున్నామని చెప్పారు. రానున్న రెండేళ్లల్లో అన్ని ప్రాంతాల్లో సింగిల్, డబుల్, నాలుగు, ఎనిమిది వరుసల రహదారుల నిర్మాణంలో లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుతో అమెరికాలో కూడా ఇవ్వనంత బ్యాండ్ విడ్త్ సమకూరుస్తున్నామన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు టెలికమ్యూనికేషన్ సంస్కరణలు వేగవంతమయ్యాయని.. అందుకు తానే బాధ్యత తీసుకున్నానని సీఎం చెప్పారు. గతంలో పబ్లిక్ సెక్టారు సంస్థలైన బీఎస్ఎన్ఎల్, వీఎస్ఎన్ఎల్ ఆధిపత్యంలో ఉండేవని తెలిపారు. వీఎస్ఎన్ఎల్ ఇంటర్నేషనల్ కాల్స్‌కు, బీఎస్ఎన్ఎల్ లోకల్ కాల్స్‌పై ఆధిపత్యం వహించేవన్నారు. అప్పట్లో లైటెనింగ్ కాల్స్ ఉండేవని, వాటికి కూడా ఒకోసారి రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేదన్నారు. ఇవాళ మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తక్షణమే మాట్లాడుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో ఎవరూ కూడా ఫోన్ కాల్స్‌కు డబ్బు వసూలు చేయరని, డేటా ఇచ్చినందుకు రుసుం వసూలు చేస్తారని తెలిపారు. వినియోగాన్ని అనుసరించి విద్యుత్తు చార్జీలు వసూలు చేస్తున్నట్లే తలసరి ఆదాయాన్ని బ్యాండ్ విడ్త్ తలసరి వినియోగం ఆధారంగా నిర్ణయించే రోజులు రానున్నాయన్నారు. సీఎం కోర్ డ్యాష్ బోర్డుతో ప్రపంచంలో ఎక్కడి నుంచైనా రియల్ టైమ్ డేటా చూడవచ్చునని తెలిపారు. రాష్ట్రంలో వీధిదీపాల నిర్వహణ కూడా రియల్ టైమ్ వ్యవస్థతో పనిచేయించే విధంగా తీర్చిదిద్దామని, బల్బు వెలిగిందా లేదా అనే అంశాన్ని సెన్సర్ ఆధారంగా గుర్తించవచ్చునన్నారు. నాలుగేళ్ల కృషితో ఆంధ్రప్రదేశ్ రెండంకెల వృద్ధిరేటు సాధిస్తోందన్నారు. నాలుగేళ్లుగా భారత ప్రభుత్వం సగటున 7.3 % వృద్ధి రేటు సాధిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10.52%తో రెండంకెల వృద్ధిరేటు నమోదు చేసిందని వివరించారు. కార్యక్రమంలో జాన్ చాంబర్స్ స్వీయరచన ‘ద డాట్స్’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. స్టార్టప్స్ ప్రారంభించే వారికి ఈ రచన ఓ దిక్సూచిగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు. -
నరకం చూపిస్తున్న ఫైబర్ గ్రిడ్!
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): సీఎం చంద్రబాబు ఏ వేదిక మీద నుంచి ప్రసంగించినా రాష్ట్రంలో 2 కోట్ల కేబుల్ కనెక్షన్లు ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతీ ఇంటికీ ఇవ్వనున్నట్లు ఆర్భాటంగా చెబుతున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో కోటి ఇళ్లకు కేబుల్ ఆపరేటర్ల ద్వారా, 30లక్షల ఇâళ్లకు డీటీహెచ్‌ల ద్వారా సేవలు అందుతున్నాయి. కానీ సీఎం 2 కోట్ల మందికి కనెక్షన్లు ఇస్తామని చెప్పినట్లు ఇటీవల ఓ పత్రికలో ప్రచురించారు. 25 లక్షల ఇళ్లకు ఫైబర్ సేవలు అందిస్తున్నామని చెబుతున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు కేవలం 2 లక్షల ఇళ్లకు మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా కొందరు వినియోగదారులకు వేలల్లో టెలిఫోన్ బిల్లులు రావడం చూసి బెంబేలెత్తుతున్నారు. ఈ ఫైబర్ గ్రిడ్ సదుపాయాన్ని మిగిలిన రాష్ట్రాల్లో విద్యార్థులకోసం, ఈ గవర్నెర్స్ కోసం వినియోగిస్తే మన రాష్ట్రంలో మాత్రం చానెళ్ల నియంత్రణకు వినియోగిస్తున్నారు. అంతేకాదు ఫైబర్ కనెక్షన్‌కు కేవలం రూ.149 మాత్రమే చెల్లించాలని అధికారులు తెలియజేస్తున్నా ఆపరేటర్లు మాత్రం రూ.234 వసూలు చేస్తున్నారు. ఇంకా మార్కెట్లో రూ.700లకు దొరికే ఐపీ టీపీ బాక్స్‌కు వీరు రూ.4వేల వరకూ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మరోపక్క ఇటీవల కేబుల్ ప్రసారాలు వీక్షిస్తున్న వీక్షకులకు బిల్లులు చెల్లించలేని కారణంగా కనెక్షన్ నిలిపివేస్తున్నట్లు డిస్ప్లేలో ప్రదర్శితమవుతుంది. వాస్తవానికి చాలామంది వినియోగదారులు ఎప్పుడో బిల్లులు చెల్లించేసినా, వారికి కూడా ప్రసారాలు అందడం లేదు. ఈ విధంగా డిస్ప్లే చూపించడం వల్ల వినియెగదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని కేబుల్ ఆపరేటర్లను కోరుతున్నారు. -
రూటర్ల కాంట్రాక్టులో రూ.700 కోట్ల దోపిడీకి తెర
-
మీడియాపై పెత్తనానికే ఫైబర్ గ్రిడ్
విజయవాడ సిటీ: మీడియాను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకే సీఎం చంద్రబాబు నాయుడు టెక్నాలజీ పేరుతో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును కుట్రపూరితంగా తెరపైకి తెచ్చారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ టెలివిజన్ రంగంపై పెత్తనం చలాయించాలనే దుర్భిద్ధితో ఉన్నారని దుయ్యబట్టారు. గురువారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సర్కారుకు నచ్చిన చానళ్లను చూపేందుకే.. మీడియాపై పెత్తనం చలాయించేందుకే కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థలోకి చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశిస్తోందని అంబటి మండిపడ్డారు. గతంలో చంద్రబాబు ఆదేశాల మేరకు ఓ చానల్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఆరునెలల పాటు ప్రసారాలు చేయనివ్వకుండా ఆంక్షలు విధించారని గుర్తు చేశారు. కేబుల్ ఆపరేటర్ వ్యవస్థను తన దగ్గరకు తెచ్చుకుంటే ఇష్టం వచ్చిన చానల్‌ను మాత్రమే చూపించవచ్చనే కుట్రతో ఫైబర్‌గ్రిడ్ తెచ్చారన్నారు. ఫైబర్ గ్రిడ్ ఏ విధంగానూ ప్రజలకు ఉపయోగ పడదన్నారు. ఫైబర్ గ్రిడ్ కింద ఇచ్చే సెట్‌టాప్ బాక్స్‌లకు రూ.4 వేలు చొప్పున చెల్లించాలని ప్రభుత్వం చెప్పడంపై మండిపడ్డారు. ప్రజలంతా ఇప్పటికే రూ.2 వేలు చెల్లించి సెట్‌టాప్ బాక్సులు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ట్రాయ్ నిబంధనలు తెలియవా? ప్రభుత్వ రంగ సంస్థలు టెలివిజన్ రంగంలోకి ప్రవేశించరాదనే ట్రాయ్ నిబంధనలు చంద్రబాబుకు తెలియవా అని అంబటి ప్రశ్నించారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ టీవీ రూపంలో చంద్రబాబు కేబుల్ రంగంలోకి దొడ్డిదారిన ప్రవేశించాలని చూస్తున్నారని చెప్పారు. ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ మినహా ఇతరులు విద్యుత్, టెలిఫోన్ స్తంభాలపై కేబుల్ వైర్లు అమర్చటానికి వీల్లేదని చట్టవిరుద్ధంగా ఆదేశాలు జారీ చేశారన్నారు. అయితే రైట్వే ఆఫ్ కేబుల్ ఆపరేషన్ అండ్ పర్మిషన్ బై పబ్లిక్ అథారిటీ చట్టం సెక్షన్ 4 బీ ప్రకారం లైసైన్స్ పొందినవారు అండర్ గ్రౌండ్, పోల్స్ (స్తంభాలు)పై లైన్లు వేసుకోవచ్చనే నిబంధన ఉందని తెలిపారు. దీని ఆధారంగా కడపకు చెందిన కొందరు కేబుల్ ఆపరేటర్లు హైకోర్టును ఆశ్రయిస్తే చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన మెమోను కోర్టు కొట్టివేసిందని వెల్లడించారు. బాబు కోటరీకి దొడ్డిదారిన డబ్బులు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ఈవీఎంల చోరీ కేసులో నిందితుడు వేమూరి హరికృష్ణ సలహాదారుగా, హెరిటేజ్ డైరెక్టర్లు కొల్లి రాజేష్, దేవినేని సీతారామ్‌ను భాగస్వాములుగా పెట్టుకున్నారని అంబటి ధ్వజమెత్తారు. చంద్రబాబు కోటరీకి దొడ్డిదారిన డబ్బులు సమకూర్చటంతోపాటు కేబుల్ ఆపరేటర్ వ్యవస్థను వారి ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఫైబర్‌గ్రిడ్ ముందుకు తెచ్చారని చెప్పారు. కేబుల్ ఆపరేటర్లను రోడ్డుపాలు చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని, వారికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని అంబటి ప్రకటించారు. -
ఫైబర్ గ్రిడ్.. చంద్రబాబు కొత్త ఎత్తుగడ
సాక్షి, విజయవాడ : టెక్నాలజీ పేరిట ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుతో తెలుగుదేశం ప్రభుత్వం దారుమైన మోసానికి పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. గురువారం నగరంలోని రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఫైబర్ గ్రిడ్ అని ఘనంగా ప్రారంభించారు. కానీ, దాని వెనుక చంద్రబాబు పెద్ద కుట్రకే తెరలేపారు అని అంబటి చెప్పారు. ట్రాయ్ రూల్స్ ప్రకారం ఏ ప్రభుత్వ సంస్థ అయినా సరే ఇందులోకి రాకూడదనే ఉంది. కానీ, ఐపీ టీవీ రూపంలో ఈ రంగంలోకి దొడ్డిదారిలో ప్రవేశించాలని చంద్రబాబు చూశారు. పైగా హేరిటేజ్ పార్టనర్స్ ఇందులో భాగస్వాములు కాగా.. దుర్భుద్ధితో ఓ మెమోను కూడా జారీ చేశారు. ఏపీ ఎస్ఎఫ్ఎల్ తప్ప మిగతా ఎవరూ కూడా ఎలక్ట్రికల్, టెలిఫోన్ పోల్స్ మీద కేబుల్స్ వేయటానికి వీల్లేదంట. అలా చేస్తే పోలీసుల సహకారంతో అయినా తొలగించండి అని ఆదేశాలు జారీ చేశారు. అది ముమ్మాటికీ చట్ట విరుద్ధమైన ఆదేశం అని అంబటి మండిపడ్డారు. ఏ ప్రైవేట్ ఎంస్వో కూడా సొంతంగా కేబుల్ లైన్ వేసుకోలేరు. పైగా లైసెన్స్ తీసుకున్నవారు ఎవరైనా సరే పోల్ మీదుగా, అండర్ గ్రౌండ్ ఎక్కడైనా వేసుకోవచ్చని రూల్స్ లో పేర్కొని ఉంది. కానీ, ఈ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నిబంధనలను తుంగలో తొక్కి ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా ఆపరేటర్లను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా తమకు అనుకూలంగా లేని ఛానెళ్లపై వేటు వేయాలని ప్రయత్నిస్తోంది. అది ఖచ్ఛితంగా అప్రజాస్వామిక చర్యేనని ఆయన పేర్కొన్నారు. ఇది చాలదన్నట్లు ఈ నిర్ణయాలను ప్రశ్నిస్తే.. టెక్నాలజీ వ్యతిరేకం.. అద్భుతాలకు అడ్డుపుల్ల వేస్తున్నారంటూ లోకేష్, చంద్రబాబులు వైసీపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. మీరు చేసేది అద్భుతాలు కావు. మీడియా మీద నియంత్రణ కోసం చేసే నిరంకుశ యత్నాలు. టెక్నాలజీ ప్రజలకు అందాలి. కానీ, ఇది సరైన పద్ధతి కాదు. భవిష్యత్తులో ముందడుగు కోసం ప్రైవేటీకరణ కరెక్ట్ కాదు. ఒకవేళ చేయాలనుకుంటే అందులో ప్రభుత్వ రంగ సంస్థ జోక్యం ఉండకూడదు. ఈ నిర్ణయం ద్వారా కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుంది. వారి పొట్ట కొట్టినట్లువుతుంది. దీనికితోడు మళ్లీ సెటప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలంటే వినియోగదారులపైనా భారం పడటం ఖాయం. అందుకే ఈ ఫైబర్ గ్రిడ్ వ్యవస్థకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని అంబటి స్పష్టం చేశారు. ఈ విషయంలో గతంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్టే ఆర్డర్లు తెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. కేబుల్ ఆపరేట్లకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని అంబటి భరోసా ఇచ్చారు. -
టెక్నాలజీ పేరిట మరో మోసానికి ఎత్తుగడ
-
రాష్ట్రంలో తయారీ యూనిట్ పెట్టండి: బాబు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనలో భాగంగా రెండవ రోజు శనివారం ఆపిల్ సీఈవో జెఫ్ విలియమ్స్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆపిల్ కంపెనీ సీఈవోను కోరారు. భారతదేశంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనంతరం ముఖ్యమంత్రితో క్వాలకమ్ టెక్నాలజీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గోపి సిరినేని, డైరెక్టర్ ప్రొడెక్ట్ మేనేజ్మెంట్ చందన పైరాల సమావేశం అయ్యారు. టెలికమ్యునికేషన్ రంగంలో ప్రఖ్యాతిగాంచిన క్వాల్కమ్ టెక్నాలజీస్ రాష్ట్రంలో చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ఆసక్తి కనపరిచిందని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. స్ట్రోటోస్పియర్ బెలూన్స్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించే విభాగాధిపతి అలిస్టర్‌తో బాబు సమావేశమయ్యారు. లాస్ ఏంజెల్స్‌లో టెస్ట్రా ప్రెసిడెంట్ సీఎఫ్ఓ ఎలొన్ మస్క్ సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు. అమెరికా పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈవీఎక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఐ–బ్రిడ్జి, ఇన్నోవా సొల్యూషన్స్ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. -
ఈ-ప్రగతితో అవినీతికి చెక్ శాసనసభలో సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2018 నాటికి అన్ని ఇళ్లకూ ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు పురోగమనంలో ఉందన్నారు. పౌరులందరికీ నాణ్యమైన, తక్కువ సమాచార సామర్థ్యాన్ని అందిస్తామన్నారు. ఫైబర్‌గ్రిడ్, ఈ-ప్రగతి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి శని వారం శాసనసభలో ప్రకటన చేశారు. ఇందులోని ముఖ్యాంశాలు.. ♦ రాష్ట్రంలో 61 వేల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ భూగర్భంలో వేయాల్సి ఉంటుంది. దీనికి రూ.4,700 కోట్లు ఖర్చవుతుంది. మూడేళ్లు పడుతుంది. ఈ కారణం గా తొలిదశ ప్రాజెక్టులో భాగంగా విద్యుత్ స్తంభాలపైనే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ వేస్తున్నాం. దీనికి రూ.333 కోట్లతో, తొమ్మిది నెలల్లోనే పూర్తవుతుంది. ♦ కేబుల్ టీవీ, హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్, టెలి కాం సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చి, మరింత ఆదాయం పెరిగేలా చూస్తాం. డిజిటల్ ఏపీ ద్వారా బాటలు వేస్తున్నాం. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు దీని వల్ల ప్రయోజనం ఉంటుంది. తొలిదశలో సర్వీస్ ఆపరేషన్ సెంటర్, నెట్వర్క్ ఆపరేషన్స్ సెంటర్, ఏరియల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తారు. ♦ ఈఏడాది ఏప్రిల్ నాటికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 2016 నాటికి పూర్తిస్థాయిలో పనులు ప్రారంభమవుతాయి. జూన్ నాటికి 22,400 కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు లక్ష్యం. ♦ విశాఖలో రూ.40 కోట్లతో నెట్వర్క్ ఆపరేషన్స్ సెంటర్‌ను నెలకొల్పుతాం. ♦ నెలకు రూ.149 ప్యాకేజీతో కూడిన సేవలపై ఇప్పటికే అవగాహన కుదిరింది. ఈ ప్యాకేజీ కింద 15 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెట్, కనీసం 100 ఛానళ్లు, టెలిఫోన్ కనెక్షన్ వినియోగదారులకు ఇస్తాం. ♦ ఈ-ప్రగతి ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి చేస్తాం. తొలి దశలో 10 శాఖలను, సచివాలయం, రెండోదశలో మరో పది శాఖలను, మూడో దశలో 13 శాఖలను కలుపుతాం.