రాష్ట్ర విభజన విషయంలోనే కాదు హైదరాబాద్పైనా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు విరుద్ధ ప్రకటనలు, అభిప్రాయాలతో గందరగోళం సృష్టిస్తున్నారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర కేంద్ర మంత్రులు ప్రతిపాదించినట్టు వార్తలు రాగా, దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మంత్రి జానారెడ్డి నివాసంలో సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశమవుతున్నారు.
హైదరాబాద్ను యూటీని చేయాలన్న ప్రతిపాదనను అడ్డుకునే విషయంపై కాంగ్రెస్ నాయకులు చర్చించనున్నారు. కేంద్ర మంత్రుల ప్రతిపాదనపై అభ్యంతరం తెలుపుతూ ప్రధాని మన్మోహన్ సింగ్కు లేఖ రాయాలని భావిస్తున్నారు. ఇదిలావుండగా సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి వెళుతున్నారు.
హైదరాబాద్ 'యూటీ'పై కాంగ్రెస్లో పోరు
Published Mon, Nov 11 2013 9:57 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement