శ్రీకాకుళం పట్టణం సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణం సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టవర్ కంట్రోల్ రూం సమీపంలో ఉన్న కంప చెట్లను తొలగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు ఎగిసిపడి వంద కిలోమీటర్ల పొడవైన ఫైబర్ కేబుల్ నిల్వలు దహనమయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రథమికంగా అంచనా వేస్తున్నారు.