కొత్తూరులో అగ్నిప్రమాదం | fire accident in kottur | Sakshi
Sakshi News home page

కొత్తూరులో అగ్నిప్రమాదం

Published Mon, Feb 23 2015 2:06 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

fire accident in kottur

శ్రీకాకుళం(కొత్తూరు): ప్రమాద వశాత్తూ అగ్గి అంటుకోవడంతో పది పూరిళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంలో పది గుడిసెలతో పాటు ఏడు మేకలు సజీవ దహనమయ్యాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం చెర్లం గ్రామంలో చోటుచేసుకుంది. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న ప్రజల గుడిసెలకు మంటలు అంటుకోవడంతో స్థానికులు ఫైర్‌సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడానికి కృషిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 8 లక్షల ఆస్తినష్టం జరిగినట్టు అంచనా. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement