Kottur
-
మావోల కదలికలపై నిఘా
సాక్షి, కొత్తూరు(శ్రీకాకుళం) : మావోల కదలికలపై నిఘా పెట్టినట్లు ఎస్పీ అమ్మిరెడ్డి తెలియజేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం రాత్రి ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానంగా గతంలో మావోలతో సంబంధాలు ఉన్న గిరిజన గ్రామాల్లో కొత్త వ్యక్తుల చేరికపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. పట్టణాలు, మండల కేంద్రాల్లోని రద్దీగా ఉన్న ప్రాంతాల్లో విజబుల్ పోలీస్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నా రు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు ఉన్నట్లయితే ప్రజల కదలికలు గుర్తించవచ్చు అన్నారు. అలాగే హైవేలపై వాహనాలు నడిపే వారికి రోడ్డు నిబంధనలు గురించి ఎస్ఐ స్థాయిలో కౌన్సిలిం గ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతీ వాహనానికి వెనుక భాగంగా రేడియం స్టిక్కర్ అతికించి ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నదుల నుంచి అక్రమ ఇసుక రవాణ చేస్తే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఇసుక అక్రమ నిల్వలు ఉన్నట్లయితే ఇసుక నిల్వ ఉంచిన జిరాయితీ భూమి యజమానిపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమవ్వడంతో కాలేజీల్లో ర్యాంగిగ్ జరగకుండా విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అనంతరం పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించారు. ఎస్పీతో పాటు సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ ప్రవల్లికలు ఉన్నారు. -
కంట్లో కారం చల్లి దారి దోపిడీ
-
కంట్లో కారం చల్లి...తుపాకితో బెదిరించి..
సాక్షి, కొత్తూర్ : దారి కాచి రోడ్డుపై వెళుతున్న వ్యక్తి కంట్లో కారం చల్లి, తుపాకితో బెదిరించి రెండు లక్షలు దోచుకున్న ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూర్‌లో చోటుచేసుకుంది. కొత్తూర్ మండల కేంద్రంలోని మద్దూర్ పంచాయతీ బిక్య తాండకు చెందిన దశరథ్ గత కొన్ని నెలలుగా ఆన్లైన్ మనీ టాన్స్‌ఫర్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ శనివారం రాత్రి పదిగంటల సమయంలో అతను పనులు ముగించుకుని బైక్‌పై ఇంటికి బయలుదేరి వెళ్లాడు. గూడూరు పంచాయతీ రాగ్య.. కమల తాండ మధ్యన రోడ్డుకు అడ్డంగా రాళ్లు కనిపించడంతో అతను బైక్ ఆపాడు. అప్పటికే అక్కడ దారికాచి ఉన్న దుండగులు.. అతనిపై కారం చల్లి సుమారు రెండు లక్షలు దోచుకున్నారు. తిరగబడిన దశరథ్ను తుపాకితో బెదిరించగా అతను కేకలు వేసుకుంటూ సమీపంలోని తాండలోకి పరుగులు తీశాడు. అది గమనించిన కొందరు అతనికి సహాయంగా దొంగల కోసం వెతికారు. దీంతో ఆ ముఠాకి చెందిన ఒకడు పట్టుబడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ముఠా సభ్యుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
రేషన్ కార్డుల కోసం అధికారుల నిర్బంధం
కొత్తూరు (శ్రీకాకుళం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో బమ్మిడి గ్రామంలో రేషన్ కార్డులను ఇవ్వడం లేదని గ్రామస్థులు రెవెన్యూ అధికారులను శనివారం పంచాయతీ కార్యాలయంలో నిర్భంధించారు. జన్మభూమి కమిటీలో పేర్లు నమోదుచేసుకున్నప్పటికీ తమకు రేషన్ కార్డులు పంపిణీ చేయట్లేదని గ్రామస్థులు గ్రామ ఆర్ఐ,వీఆర్వోలను నిర్బంధించారు. గ్రామస్థుల ఆందోళనతో తహసీల్దార్ ఆదేశాల మేరకు పోలీసుల పహారాలో అధికారులు రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. -
కొత్తూరులో అగ్నిప్రమాదం
శ్రీకాకుళం(కొత్తూరు): ప్రమాద వశాత్తూ అగ్గి అంటుకోవడంతో పది పూరిళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంలో పది గుడిసెలతో పాటు ఏడు మేకలు సజీవ దహనమయ్యాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం చెర్లం గ్రామంలో చోటుచేసుకుంది. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న ప్రజల గుడిసెలకు మంటలు అంటుకోవడంతో స్థానికులు ఫైర్‌సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడానికి కృషిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 8 లక్షల ఆస్తినష్టం జరిగినట్టు అంచనా. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. -
మావోయిస్టుల ముసుగులో దోపిడీలు
ఏటీఎం చోరుల కోసం మాటేస్తే..ఎస్బీఐ ఏటీఎం మాయం కేసు.. రాష్ట్రంలోని సంచలనం రేపిన ఈ కేసు కొత్తూరు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాత్రింబవళ్లు నిందితుల కోసం వేట సాగిస్తున్నారు. అదే రీతిలో నిశిరాత్రి వేళ గాలింపు నిర్వహిస్తున్న వారికి అనూహ్య రీతిలో ఓ ముఠా పట్టుబడింది. ఏటీఎం చోరీ కేసు వీరి పనే అయ్యుంటుందన్న ఉద్దేశంతో పట్టుబడిన ముగ్గురిని స్టేషన్‌కు తరలించి విచారణ జరిపారు. తాము వెతుకుతున్న ముఠా కాకుండా మరో దోపిడీ ముఠా తమ వలలో చిక్కిందన్న విషయం పోలీసులకు అప్పుడు గాని అర్థం కాలేదు. దాంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఏటీఎం కేసు చిక్కుముడి వీడనందుకు నిరాశ పడినా.. అనూహ్యంగా మావోయిస్టుల పేరుతో దోపిడీలకు పాల్పడుతున్న ఒడిశా ముఠాను పట్టుకోగలిగామన్న ఆనందం వారిలో కనిపించింది. కొత్తూరు: మావోయిస్టులుగా చెలామణీ అవుతూ దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు నకిలీ మావోయిస్టులను శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. శనివారం తెల్లవారుజామున వీరిని అదుపులోకి తీసుకున్నట్లు కొత్తూరు ఎస్సై వి.రమేష్ విలేకరులకు తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో స్థానిక హరిదాసు కోనేరు వద్ద పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ద్విచక్ర వాహనంపై వె ళుతున్న ముగ్గురు తారసపడ్డారు. అనుమానంతో వారిని వెంబడించి పట్టుకున్నారు. విచారణలో వారు నకిలీ మావోయిస్టులని తేలింది. ఆ పేరుతో దోపిడీలకు పాల్పడుతున్నట్లు నిర్థారణ అయ్యింది. దాంతో మండల మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం హాజరు పరిచారు. అరెస్టరుున వారిలో ఒడిశా రాష్ట్రంలోని ఉక్కంబ గ్రామానికి చెందిన రత్తాల కృష్ణారావు, బరంపురానికి చెందిన కె.త్రినాథరావు(కలియా), శ్రీకాకుళం జిల్లా భామిని మండలం గురండికి చెందిన ముడగ పోలినాయుడులు ఉన్నారన్నారు. ఈ ఏడాది జూన్‌లో రాయగడ నుంచి బత్తిలి వస్తున్న ప్రైవేట్ బస్సును బాసన్నగూడ వద్ద వీరు నిలిపివేసి మావోస్టులమని బెదిరించి సిబ్బంది నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేయగా.. రూ. 50 వేలు వసూలు చేశారని ఎస్సై చెప్పారు. అదే నెలలో గుణపూర్ సమీపంలోని ఓ గ్రామస్తుని ఇంటికి వెళ్లి మావోరుుస్టుల పేరుతో రూ.50 వేలు డిమాండ్ చేయగా సదరు వ్యక్తి రూ. 20 వేలు ఇచ్చారన్నారు. నిందితుల నుంచి ఏపీ32ఏ 5526 హీరోహోండా ద్విచక్ర వాహనం స్వాధీ నం చేసుకున్నామన్నారు. అంధ్రా, ఒడిశా రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన చోరీ కేసులతో వీరికి సంబంధాలు ఉన్నాయన్నారు. పలు పోలీసు స్టేషన్లలో వీరిపై కేసులు ఉన్నాయన్నారు. ఈ ముఠా నాయకుడు ఒడిశాలో ఉన్నారన్న సమాచారం ఉందన్నారు. ఉలిక్కిపడిన ఏజెన్సీ నకిలీ మావోయిస్టుల అరెస్టుతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం ఉలిక్కి పడింది. ఆదివారం నుంచి ఏవోబీలో మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో నకిలీల అరెస్టు ఉదంతం కలకలం రేపింది. గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు తక్కువగానే ఉన్నప్పటికీ, వారి పేరుతో నేరగాళ్లు దోపిడీలు, చోరీలకు పాల్పడుతున్న విషయం వెలుగులోకి రావడం అలజడి రేపుతోంది. జిల్లాలో మావోయిస్టుల కదలికలు లేవని భావిస్తున్న పోలీసు అధికారులు, ఈ నకిలీ ఉదంతంతో అప్రమత్తమయ్యారు. పట్టుబడిన వారంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు కావడం, వారి నాయకుడు ఆ రాష్ట్రంలోనే ఉన్నాడని తెలియడంతో ఒడిశా ముఠాలు జిల్లాలోకి చొరబడ్డాయన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఈ విషయాలపై స్థానిక ఎస్ఐ వి.రమేష్ వద్ద ప్రస్తావించగా మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా కూంబింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రత్యేక బలగాలు వస్తున్నాయని చెప్పారు. అనుమానిత ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశామన్నారు. -
'70 శాతం నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వండి'
మహబూబ్‌నగర్: మూడేళ్లలో హరిత తెలంగాణ సాధిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. పారిశ్రామికవేత్తలకు పూర్తిగా సహకరిస్తామని హామీయిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా జిల్లా కొత్తూరు మండలం పెంజెర్లలో పీఅండ్ జీ పరిశ్రమను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పరిశ్రమల్లో 70 శాతం మంది తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించారు. పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ అందిస్తామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 35 వేల ఎకరాలు పరిశ్రమలకు సిద్దంగా ఉందని తెలిపారు. రూ. 20 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామన్నారు. పాలమూరు నుంచి వలసలు బంద్ కావాలన్న ఆకాంక్షను కేసీఆర్ వెలిబుచ్చారు. -
కొత్తూరులో ఎస్బీఐ ఏటీఎం అపహరణ
ఆదివారం తెల్లవారు జామున కొత్తూరులో జరిగిన ఏటీఎం అపహరణ జిల్లా ఉలిక్కిపడేలా చేసింది. అప్పుడే తెరిపిచ్చిన వర్షాల నుంచి తేరుకుంటున్న జనం..ఈ విషయం తెలిసి హతాశులయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడా ఎటీఎంను ఎత్తుకుపోవడం జరగలేదని పోలీసులు చెబుతున్నారు. పక్కా వ్యూహంతోనే దుండగులు చోరీకి పాల్పడినట్లు భావిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన ముఠాల పనేనన్న అనుమానాలు లేకపోలేదు. కొత్తూరు: కొత్తూరులో నగదుతో ఉన్న ఏటీఎంను సినీ ఫక్కీ లో ఎత్తుకుపోయారు. శనివారం రాత్రి నాలుగు గంటల సమయంలో (తెల్లవారితే ఆదివారం) ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయం కాస్త దావానంలా వ్యాపించడంతో..సంఘటన స్థలానికి స్థానికులు చేరుకున్నారు. సీసీ కెమెరాను మట్టితో కప్పి.. సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే..పక్కా వ్యూహంతోనే ఏటీఎంను అపహరించినట్లు తెలుస్తోంది. ఏటీఎం గదిలోని సీసీ కెమెరాను మట్టితో కప్పడంతో పాటు..ఆ గదిలో కారం పొడి జల్లారు. సుమారు 800 కేజీల బరువున్న ఏటీఎంకు ఉన్న ఇంటర్నెట్ వైర్లను తప్పించారు. గది వద్దకు మూడు చక్రాల వాహనం తెచ్చి..ఎక్కించుకుని వెళ్లినట్లు..టైర్ల అచ్చుల ఆధారంగా తెలుస్తోంది. ఏటీఎం కింద కాంక్రీట్ వేయకపోవడం, కనీసం ఇనుప స్టాండును కూడా గచ్చుపై బిగించకపోవడం తో దుండుగులు సులువుగా ఏటీఎంను ఎత్తుకెళ్లినట్లు పోలీ సులు భావిస్తున్నారు. భారీగా నగదు చోరీ జరిగే సమయానికి ఏటీఎంలో రూ.10 లక్షల 87 వేల 300 రూపాయలు ఉన్నట్లు మేనేజర్ సూర్యప్రకాశరావు తెలిపా రు. తెల్లవారితే ఆదివారం కావడంతో..శనివారం మరింత న గదు ఉంచాలనుకున్నామని, అయితే..రూ.వెయ్యి నోట్లు అందుబాటులో లేకపోవడంతో తక్కువ ఉంచామని చెప్పారు. రంగంలోకి పోలీసులు చోరీపై బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై వి.రమేష్ చెప్పారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌లు సంఘటన స్థలం వద్దకు చేరుకుని చోరీ జరిగిన వైనాన్ని పరిశీలించాయి. డాగ్ స్క్వాడ్ ఏటీఎం పరిసరాల్లో ఉన్న శ్లాబు ఇళ్లపైకి, బత్తిలి రోడ్డువైపు వెళ్లిన సూచనలు కనిపించాయి. దీంతో ఒడిశాకు చెందిన మఠాయే ఈ చోరీకి పాల్పడినట్లు పోలీ సులు భావిస్తున్నారు. ఎస్పీ పరిశీలన సంఘటన స్థలాన్ని ఎస్పీ ఏఎస్‌ఖాన్ సందర్శించారు. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. బ్యాంక్ మేనేజర్ సూ ర్యప్రకాశరావును ప్రశ్నించారు. విశాఖపట్నం రీజియన్ ఎస్బీఐ సెక్యూరిటీ అధికారి యాదవ్ నుంచి వివరాలు రాబట్టారు. చోరీ జరిగిన సమయంలో సీసీ కెమేరాలో నమోదైన ఫొటోలను పరిశీలించారు. అయితే..కెమేరా సక్రమంగా పనిచేయకపోవడంతో.. రికార్డైన దృశ్యాలను .పూర్తి స్థాయిలో చూడలేకపోయారు. ఆ మూడున్నర నిమిషాలే కీలకం ఇదిలా ఉండగా..దుండగులు ఏటీఎంను ఎత్తుకుపోయిన సమయంలో సీసీ కెమెరాలో మూడున్నర నిమిషాల రికార్డింగ్ జంప్ అవుతోంది. ఎస్పీ ఈ దృశ్యాలను స్వయంగా పరిశీలించినా..కెమెరా జంప్ అవుతుండడంతో ఆ మూడున్నర నిమిషాలే కీలకంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలో గత కొన్ని రోజుల నుంచి రికార్డయిన వివరాలను పరిశీలించాలని డీఎస్పీ శాంతోను ఆదేశించారు. ఏటీఎం సీసీ కెమెరాలో శనివారం రాత్రి 3 గంటలు 52 నిమషాల 50 సెకెన్ల నుంచి 3 గంటల 56 నిమషాల 33 సెకెన్లకు జంప్ అవుతోంది. అంతవరకు గదిలో ఏటీఎం ఉన్నట్లు సీసీ కెమెరాలో కనిపిస్తోంది. తరువాత నల్లని తెరమాదిరిగా చూపిస్తోంది. అదే సమయంలో బ్యాంకు సీసీ కెమెరా కూడా సు మారు 13 సెకెన్ల జంప్ అయినట్లు చూపుతోంది. అలాగే చోరీకి గురైన ఏటీఎం పక్కన సీడీఎం( క్యాష్ డిపాజిట్ మిషన్) ఉంది. దీని కెమెరా రాత్రి రెండు గంటల నుంచి హేంగ్ అయిపోయింది. సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయకపోవడంతో..దర్యాప్తునకు అవరోధం కలుగుతోందని పోలీసులు పేర్కొంటున్నారు. బ్యాంకు సాంకేతిక నిపుణులతో సంప్రదించి..దర్యాప్తు చేస్తామని ఎస్పీ చెప్పారు. సమగ్ర దర్యాప్తు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..చోరీపై పూర్తి స్థాయి లో దర్యాప్తు నిర్వహిస్తామన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రాలో ఇటువంటి చోరీ జరగలేదని చెప్పారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగుతుందన్నారు. ముందుగా బ్యాంకు లోపల, బయట దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. ఆయనతో పాటు పాలకొండ డీఎస్పీ దేవానంద్ శాంతో, సీఐ ఇలియాబాబు, ఎస్సై రమేష్‌లు ఉన్నారు. అనంతరం ఎస్డీ శ్రీదేవిరావు సంఘటన స్తలాన్ని పరిశీలించారు. ఏజీఎం పరిశీలన ఎస్బీఐ రీజినల్ మేనేజర్ రాజారామ్మోహనరాయ్ బ్యాం కును సందర్శించారు.ఏటీఎం గదిని, పలు రికార్డులను పరిశీలించారు. క్యాష్ వివరాలు తెలుసుకున్నారు. -
పరిహారం.. పరిహాసం!
తమిళనాడు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం సొమ్ము వచ్చేసింది. మీరంతా జిల్లా కేంద్రానికి వచ్చేయండి.. చెక్కులు ఇచ్చేస్తాం.. ఈ నెల 16న జిల్లా అధికార యంత్రాంగం తరఫున హడావుడిగా పిలుపు,.. అదే విషయమై పత్రికా ప్రకటనలు జారీ.. ఈ నెల 17న.. మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ చేతుల మీదుగా బాధితుల తరఫున వచ్చిన వారికి చెక్కుల పంపిణీ.. ఇదంతా జరిగింది.. ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి బాధితుల పరామర్శకు వచ్చిన రోజే.. ఆయన వెళ్లే సమయానికి బాధితులు ఇళ్ల వద్ద ఉండకుండా చేయాలన్న దురుద్దేశంతోనే అధికార టీడీపీ నేతలు అధికార యంత్రాంగం ద్వారా హడావుడిగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని అప్పట్లోనే విమర్శలు గుప్పుమన్నాయి. ఇప్పుడు జరిగింది చూస్తే.. ఆ విమర్శలు.. టీడీపీ కుట్రలు నిజ మేనని తేటతెల్లమవుతోంది. హడావుడిగా ఇచ్చిన ఆ చెక్కులు చెల్లని చిత్తు కాగితాల్లా తిరిగివచ్చాయి. కొత్తూరు: బాధితులను పరామర్శించడాన్ని.. నష్టపరిహారం పంపిణీని సైతం అధికార టీడీపీ రాజకీయం చేస్తోందనడానికి చెన్నై బాధితులకు హడావుడిగా ఇచ్చిన చెక్కులు చెల్లని ఉదంతం నిదర్శనంగా నిలుస్తోంది. గత నెల చెన్నైలో బహుళ అంతస్తుల భవనం కూలినదుర్ఘటనలో మృతి చెందిన జిల్లాకు చెందిన 14 మంది కుటుంబ సభ్యులకు తమిళనాడు ప్రభుత్వం రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ నెల 17న జిల్లా కేంద్రానికి బాధిత కుటుంబీకులను ప్రత్యేకంగా రప్పించి మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ సంతకంతో ఉన్న చెక్కులను అదరాబాదరాగా అందజేశారు. ఇందులో భాగంగా కొత్తూరు మండలానికి చెందిన అమలాపురం రమేష్, రాజేష్‌ల తరఫున వారి తండ్రి అమలాపురం సూర్యారావుకు రెండు చెక్కులు, కిమిడి సుబ్బయ్య భార్య కిమిడి శశిమ్మ పేరిట ఒక చెక్కు అందజేశారు. ఈ చెక్కులను సూర్యారావు స్థానిక ఏపీజీవీబీలో ఉన్న తన ఖాతాలో వేశారు. కలెక్షన్ కోసం వాటిని కొత్తూరు ఎస్బీఐకి పంపగా చెక్కులో పేర్కొన్న ఖాతా(నెం. 11152302687)లో నగదు లేకపోవడంతో ఆ చెక్కులు వెనక్కి వచ్చాయి. శనివారం బ్యాంకుకు వెళ్లిన సూర్యారావుకు ఏపీజీవీబీ మేనేజర్ వినోద్ ఈ విషయం చెప్పి చెక్కులను తిరిగి ఇచ్చేశారు. కాగా కిమిడి శశిమ్మ తన చెక్కును స్థానిక ఎస్బీఐలో జమ చేయగా, అది కూడా చెల్లకుండా పోయింది. చెక్కులో సూచించిన ఖాతాలో బ్యాలెన్స్ లేనందున చెక్కు ఇంకా మారలేదని ఎస్బీఐ మేనేజర్ ప్రకాశరావు తెలిపారు. ఖాతాలో డబ్బులు వేసిన వంటనే శశిమ్మ ఖాతాకు చెక్కు మొత్తాన్ని జమ చేస్తామని చెప్పారు. కాగా చెక్కులు చెల్లకపోవడంతో లబోదిబోమన్న సూర్యారావు వాటిని తీసుకెళ్లి తాహశీల్దార్‌కు చూపించారు. వెంటనే ఆయన కలక్టరేట్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సోమవారం నాటికి అకౌంట్లో డబ్బులు వేస్తారని.. అ రోజు చెక్కులు తీసుకొని బ్యాంకుకు వెళ్లాలని కలెక్టరేట్ అధికారులు సూచించినట్లు తహశీల్దార్ పీవీ శ్యామ్‌సుందరావు తెలిపారు. కాగా పాలకొండ తదితర ప్రాంతాల్లోని బాధితులకు ఇదే అనుభవం ఎదురైనట్లు సమాచారం. వికటించిన పన్నాగం ప్రతిపక్ష నేత పర్యటనను విఫలం చేయాలన్న దురుద్దేశంతో అధికార పార్టీ పన్నిన పన్నాగం.. ఖాతాలో నిధులు ఉన్నాయో లేవో కూడా తెలుసుకోకుండా హడావుడిగా చెక్కులు రూపొందించి ఇవ్వడం వల్లే ఈ చిక్కులు వచ్చాయి. అధికార పార్టీ రాజకీయాల కారణంగా బాధితులు అనవసరంగా ఇబ్బందులకు గురవుతున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ జిల్లాకు వస్తున్నారని ముందే తెలిసినా.. టీడీపీ నాయకులు జగన్ పరామర్శించే సమయానికి బాధితులు ఇంటి వద్ద లేకుండా చేసేందుకు జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అకౌంట్లో డబ్బులు లేకపోయినా చెక్కులు బ్యాంకు నిబంధనలకు నీళ్లొదిలారు. తీరా ఇప్పుడు చెక్కులు బౌన్స్ కావడంతో తీరిగ్గా సోమవారం నిధులు జమ అవుతాయి.. అప్పుడు వెళ్లి తీసుకోండని చెబుతున్నారంటేనే.. అప్పుడు చేసిందంతా ఆర్భాటమేనని.. బాధితులను పావులుగా చేసుకొని ఆడిన రాజకీయ నాటకమేనని వేరే చెప్పాలా!..