'70 శాతం నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వండి'
మహబూబ్నగర్: మూడేళ్లలో హరిత తెలంగాణ సాధిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. పారిశ్రామికవేత్తలకు పూర్తిగా సహకరిస్తామని హామీయిచ్చారు. మహబూబ్నగర్ జిల్లా జిల్లా కొత్తూరు మండలం పెంజెర్లలో పీఅండ్ జీ పరిశ్రమను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పరిశ్రమల్లో 70 శాతం మంది తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించారు.
పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ అందిస్తామన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో 35 వేల ఎకరాలు పరిశ్రమలకు సిద్దంగా ఉందని తెలిపారు. రూ. 20 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామన్నారు. పాలమూరు నుంచి వలసలు బంద్ కావాలన్న ఆకాంక్షను కేసీఆర్ వెలిబుచ్చారు.