‘నవజీవన్’లో మంటలు | fire accident in nava jeevan express | Sakshi
Sakshi News home page

‘నవజీవన్’లో మంటలు

Published Tue, Jan 7 2014 1:05 AM | Last Updated on Mon, Aug 20 2018 9:35 PM

fire accident in nava jeevan express

 బాపట్ల, న్యూస్‌లైన్: చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అటు ప్రయాణికులు, ఇటు డ్రైవర్లు ఉలిక్కిపడ్డారు. సోమవారం మధ్యాహ్నం 2.55 గంటలకు గుంటూరు జిల్లా బాపట్ల నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా అప్పికట్ల వద్దకు వచ్చేసరికి ఎస్-9 బోగి కింద భాగం నుంచి మంటలు వచ్చాయి. దీంతో బోగీ అంతా పొగ కమ్మేయడంతో ప్రయాణికులు కేకలు వేశారు. వెంటనే చైన్‌లాగి రైలును నిలుపుదల చేశారు. డ్రైవర్, గార్డు మంటలను అదుపుచేశారు. తెనాలి నుంచి ఇంజనీర్లు వచ్చి మరమ్మతులు చేశారు. రైలు చక్రం పైన ఉండే డైనమా బెల్ట్ ట్రిప్ కావడంవల్ల మంటలు వ్యాపించాయని వారు తెలిపారు. ఈ కారణంగా రైలు సుమారు అర గంటపాటు నిలిచిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement