పక్కోడి దుకాణానికి నిప్పు పెట్టించాడు! | fire damages grocery shop | Sakshi
Sakshi News home page

పక్కోడి దుకాణానికి నిప్పు పెట్టించాడు!

Published Sat, May 2 2015 9:29 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

fire damages grocery shop

మల్కాజిగిరి (హైదరాబాద్) :వ్యాపారంలో ఎదగటానికి సవాలక్ష మార్గాలున్నాయి. కానీ ఓ ప్రబుద్ధుడు అలా ఎదగడం చేతకాక.. తనకు పోటీగా ఉన్న ఓ దుకాణానికి ఏకంగా నిప్పు పెట్టించాడు. ఈ ఘటన హైదరాబాద్ మల్కాజ్‌గిరి పరిధిలోని ఆర్టీసీ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజస్థాన్‌కు చెందిన భక్రీచా దేవారాం(29) అనే వ్యక్తి ఏడాదిన్నరగా స్థానికంగా ఓ కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతంలో అంజాద్పాషా అనే వ్యక్తి ఆరు నెలల కిత్రం ఓ దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. దీంతో దేవారాం వ్యాపారం క్షీణించింది.


ఇది సహించలేని దేవారాం ఓ పథకం పన్నాడు. తన దగ్గర పనిచేసే విజయ్‌కుమార్‌సింగ్(20)కు పెట్రోల్ ఇచ్చి అంజాద్ దుకాణాన్ని తగులబెట్టమని చెప్పాడు. శుక్రవారం రాత్రి విజయ్‌సింగ్ అంజాద్ దుకాణంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అయితే ఇది గమనించిన స్థానికుడు విజయ్ మరికొందరితో కలసి విజయ్‌సింగ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పగా అప్పటికే  షాపు కొంతమేర దగ్ధమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement