నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటలో చెన్నై- గూడూరు ప్యాసింజర్ లో మంటలు చెలరేగిన ఘటన మరువక ముందే అలాంటి ఘటనే తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జరిగింది. నిడదవోలు రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం సాయంత్రం 6 గంటలకు మంటలు చెలరేగాయి.
దీంతో ఆందోళనకు గురైన జనం దూరంగా పరుగెత్తారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఆ మంటలు షార్ట్‌సర్క్యూట్ కారణంగానే చెలరేగాయని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
Published Sat, Apr 18 2015 8:52 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement