చేపల చెరువులకు ఆన్‌లైన్‌లో అనుమతులు | Fish ponds online in permissions | Sakshi
Sakshi News home page

చేపల చెరువులకు ఆన్‌లైన్‌లో అనుమతులు

Published Mon, Feb 16 2015 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 PM

చేపల చెరువులకు ఆన్‌లైన్‌లో అనుమతులు

చేపల చెరువులకు ఆన్‌లైన్‌లో అనుమతులు

 ఏలూరు :జిల్లాలో చేపల చెరువులకు అనుమతులన్నీ ఆన్‌లైన్ ద్వారానే పారదర్శకంగా జారీ చేస్తున్నామని మత్స్యశాఖ ఇన్‌చార్జి డెప్యూటీ డెరైక్టర్ షేక్ లాల్ మహ్మద్ అన్నారు. ఈ విషయంలో ఏ అధికారిని స్వయంగా ఆశ్రయించనవసరం లేదని, దరఖాస్తు చేసుకున్న ఐదువారాల్లోనే ఆన్‌లైన్‌లో అనుమతులను భూ యజమానులు లేదా రైతులు పొందవచ్చునని తెలిపారు. నెలకొకసారి జిల్లా స్థాయిలో కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరుగుతుందని, 8 శాఖల అధికారులతో చర్చించి ఆన్‌లైన్‌లో జారీ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. 13 జిల్లాల్లో మొదటిసారిగా అనుమతులను ఆన్‌లైన్‌లో జారీ చేస్తున్న జిల్లా.. పశ్చిమగోదావరి ఒకటేనన్నారు. మీ సేవ కేంద్రంలోను రైతు, భూ యజమాని పట్టాదారు పుస్తకం, భూమి మ్యాప్, ఎఫ్‌ఎంబీ, ఆధార్‌కార్డు జిరాక్సులతో రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకున్న ఐదు వారాల్లో చేపల చెరువుల తవ్వకాలకు లెసైన్స్‌లు లభిస్తాయన్నారు.
 
 ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ, మత్స్యశాఖ, భూగర్భజలశాఖ, వ్యవసాయశాఖ, అటవీశాఖ, ఇరిగేషన్, కాలుష్య నియంత్రణ మండలి తదితర అన్ని శాఖలు ఆయా శాఖల పరిధిలో దరఖాస్తుల పరిశీలన జరిగాక రిమార్కులు ఉంటే ఆన్‌లైన్‌లో రాస్తామన్నారు. జిల్లా స్థాయి కమిటీలో చర్చించిన అనంతరం వారంలోనే అనుమతుల జారీ జరుగుతుందన్నారు. అనుమతిచ్చిన పరిధి దాటి చెరువులు తవ్వినా గూగుల్‌లోని మ్యాప్‌ల్లో తెలుస్తుందన్నారు. దీనిపై పూర్తిస్థాయి పర్యవేక్షణకు జిల్లాలోని 15 మంది ట్యాబ్‌లను మంజూరు చేశామని త్వరలో ఇవి పనిచేస్తాయన్నారు. మీ సేవల్లో చెరువులకు అనుమతులు జారీ చేయడానికి కలెక్టర్ కె.భాస్కర్ ఆధ్వర్యంలో కసరత్తు చేశామన్నారు. ఈ విధానంలో రైతులు ఎటువంటి ఇబ్బందులకు లోనుకాకుండా సునాయాసంగా అందిస్తున్నామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement