నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్ : స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై అధికారులు కేర్‌లెస్‌గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యం లేదా వాహనం కండీషన్ సరిగా లేని కారణంగా విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ఆర్టీఏ అధికారులు నానా హడావుడి చేయడం పరిపాటిగా మారిం ది. ఏటా జూన్‌లో పాఠశాలలు తెరుస్తారు. మే నెలలోనే విధిగా స్కూల్ బస్సుల ఫిట్‌నెన్‌ను ఆర్టీసీ అధికారులు పరీక్షించాల్సింది పోయి మొద్దునిద్రలో ఉన్నారు.
జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 800కి పైగా స్కూల్ బస్సులు ఉన్నాయి. వీటిన్నింటికి మే 15 నుంచి జూన్ ఒకటో తేదీ మధ్యనే ఆర్టీఏ అధికారుల ద్వారా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందా లి. స్కూళ్లు జూన్ రెండో వారంలో తెరచుకునే అవకాశం ఉంది. అయితే అధిక శాతం మొదటి వారంలోనే తెరచుకోనున్నాయి. ఈ కొద్దిపాటి గడువులో ఆన్ని స్కూల్ బస్సులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించడం అసాధ్యం.
పేరెంట్స్ కమిటీ బాధ్యత
బస్సుకు సంబంధించిన బాహ్యపరికరాలు విండ్‌స్క్రీన్, వైపర్స్, లైటింగ్స్ వంటి మెకానికల్ కండీషన్స్, పనితీరు తెలుసుకునేందుకు ప్రిన్సిపల్‌తో కలిసి పేరెంట్స్ కమిటీ ప్రతినెలా తనిఖీలు చేయాలి.
ఫస్ట్ ఎయిడ్ బాక్సులో మందులు, ఇతర పరికరాలు ఉన్నాయా? లేవా? అని తనిఖీ చేయాలి.
స్కూల్ బస్సులు ఇలా ఉండాలి
బస్సు పసుపురంగులో ఉండాలి. విద్యార్థులు బస్సులోకి ఎక్కడం, దిగడం డ్రైవర్‌కు స్పష్టంగా కనిపించేలా అద్దాలు అమర్చాలి.
బస్సు ఇంజన్ కంపార్టుమెంటులో ఒక అగ్నిమాపక యంత్రం, పొడి అందుబాటులో ఉండాలి. అత్యవసర ద్వారం కూడా ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏర్పాటు తప్పని సరి.
విద్యాసంస్థ పేరు, టెలిఫోన్ నంబర్ లేదా మొబైల్ నంబర్, పూర్తి చిరునామా బస్సుకు ఎడమవైపు ముందుభాగంలో స్పష్టంగా రాయాలి.
సీట్ల కిందిభాగంలో బ్యాగులు పెట్టుకునేలా అరలు ఏర్పాటు చేయాలి. పిల్లలు పట్టుకునేందుకు వీలుగా అక్కడక్కడ లోహపు స్తంభాలను బస్సులో అమర్చాలి.
వాహనానికి నాలుగువైపులా పైభాగం మూలల్లో (రూఫ్‌పై కాదు) బయటివైపు యాంబర్(గాఢపసుపు పచ్చని) రంగుగల ఫ్లాపింగ్ లైట్లను ఏర్పాటు చేయాలి. పిల్లలు దిగేప్పుడు, ఎక్కేటప్పుడు ఈ లైట్లు వెలుగుతూ ఉండాలి.
= బస్సు తలుపులు సురక్షితమైన లాకింగ్ సిస్టమ్‌తో ఉండాలి. సైడువిండోలకు అడ్డంగా మూడు లోహపు కడ్డీలను ఏర్పాటు చేయాలి. సీటింగ్ సామర్థ్యం కంటే ఎక్కువ మందిని తీసుకెళ్లకూడదు.
ఫిట్‌నెస్‌పై కేర్‌లెస్
Published Mon, Jun 2 2014 1:01 AM | Last Updated on Thu, Apr 4 2019 5:41 PM
Advertisement
Advertisement