ప్రకాశం: అల్పాహారం వికటించడంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలోని కస్తూర్బా పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. ఉదయం అల్పాహారం తిన్నప్పటి నుంచి పాఠశలలో ఏడో తరగతి చదువుతున్న 8 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.