రెంజల్, న్యూస్‌లైన్ : విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బోధన్ సబ్ కలెక్టర్ హరినారాయణన్ అన్నారు. బుధవారం రెంజల్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కీర్తన సొసైటీ అధ్వర్యంలో 10వ తరగతి బాలికలకు ‘సాక్షి’ బుక్‌లెట్స్‌ను సబ్ కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పదవ తరగతి పునాది లాంటిదని అన్నారు. ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకుని చదువులో ముందుకు సాగాలని సూచించారు. బాలికలకు 10వ తరగతి తర్వాత రూ.
10 వేల రుణం అందించి చిన్న తరహా పరిశ్రమలు పెట్టించినా ఫలితముండదని అదే కష్టపడి చదివి విద్యావంతులైతే వారితో పాటు కుటుంబం మొత్తానికి మేలు జరుగుతుందన్నారు.అంతేగాక సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ పథకాలతో పాటు సేవా సంస్థలు అందించే ప్రోత్సాహంతో పైకి రావాలన్నారు. 10వ తరగతి తర్వాత తీసుకునే నిర్ణయమే రూ.వితాన్ని మారుస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతీ ఒక్కరు పదిలో పాస్ కావాలని భగవంతుడిని ప్రార్థిస్థానని అన్నారు.
కీర్తన సొసైటీ ద్వారా అందిస్తున్న ‘సాక్షి’ ఎస్సెస్సీ బుక్‌లెట్స్‌ను చదివి రాణించాలన్నారు. పేద విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను అందించడం అభినందనీయమన్నారు. రెంజల్‌లోని కస్తూర్బా గాంధీ విద్యాలయం విద్యార్థులతో పాటు బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినులకు కూడా కీర్తన సోసైటీ ద్వార పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కీర్తన సొసైటీ అధ్యక్షుడు ప్రణయ్‌రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సీమా పర్వీన్ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
Published Thu, Mar 6 2014 3:30 AM | Last Updated on Mon, Aug 20 2018 8:09 PM
Advertisement