నాలుగు కిలోమీటర్లు దూరాన్ని చూపిస్తున్న బోర్డులు ఏర్పాటు చేసిన దృశ్యం
శ్రీకాకుళం రూరల్: ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన రామ్‌జీ ఇటీవల వెలువడిన పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్‌లో ఉత్తీర్ణత సాధించారు. శ్రీకాకుళంలోని తండేవలస పోలీస్ శిక్షణ కేంద్రం తెలియక నేరుగా ఆయన ఎచ్చెర్లలోని పోలీస్ క్వార్టర్ వద్దకు వెళ్లిపోయారు. అక్కడ పనిచేసే సిబ్బంది ఇక్కడ సెలక్షన్‌లు జరగడం లేదని పెదపాడు దాటాక ఆర్టీవో కార్యాలయం వెళ్లే రవాదారి గుండా వెళ్లాలని చెప్పడంతో అక్కడ నుంచి నేరుగా పయనమయ్యారు. ఈ సమస్య ఒక్క రామ్‌జీదే కాదు జిల్లాలోని కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన సదూర ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులంతా ఇదే మాదిరిగా రెండు రోజులు నుంచి పలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
నాలుగు కిలోమీటర్లు దూరం నడవాల్సిందే..
తండేంవలస గ్రామానికి వెళ్లేందుకు ఆటోలు, బస్సులు లేవు. పెదపాడు శివారు ప్రాంతం నుంచి పోలీసు శిక్షణ కేంద్రానికి వెళ్లాలంటే నాలుగు కిలోమీటర్లు దూరం నడవాలి. చాలా మంది అభ్యర్థులు మాత్రం దగ్గరిలోని ఆర్టీవో కార్యాలయానికి వివిధ పనులపై రాకపోకలు సాగించే వారి వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీవో కార్యాలయం నుంచి మరో రెండు కిలోమీటర్లు నడిచి Ððవెళ్లాలి. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఎవరైనా బస్సు దిగి నేరుగా ఆటో కట్టుకొని పయనమైతే వారి జేబులు ఖాళీ అవుతున్నాయి.
520 మంది ఉత్తీర్ణత
పోలీస్ శిక్షణ ఎంపికల్లో మంగళవారం 800 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 671 మంది హాజరయ్యారు. వీరిలో 576 మంది సభ్యులు దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. అందులో 520 మంది అభ్యర్థులు మాత్రమే ఫైనల్ టెస్ట్‌కు అర్హత సాధించారు. ఎస్పీ ఎ.వెంకటరత్నం, ఏఎస్పీ టి.పనసారెడ్డి, డీఎస్పీలు ఈ పర్యవేక్షించారు.
బస్సులు ఏర్పాటు చేస్తే బాగుండేది
నేను కానిస్టేబుల్ పరీక్షలో అర్హత సాధించాను. అడ్రాస్ తెలియక రామలక్ష్మణ జంక్షన్‌లో దిగిపోయాను. ఆటోకి రమ్మంటే ఆయన అడిగినంత డబ్బులు నా దగ్గర లేవు. ఎనిమిది గంటలు కల్లా నేను తండేవలసలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో ఉండాలి. ఇప్పటికే వారిచ్చిన సమయం మించిపోయింది. పోలీసు అధికారులు మాలాంటి వారికోసం ఏదైనా జంక్షన్ వద్ద బస్సులు ఏర్పాటు చేస్తే బాగుండేది.
–పి.లోకేష్‌కుమార్, పాతపట్నం
Comments
Please login to add a commentAdd a comment