కర్నూలు/ కల్లూరు: నగర శివారులోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో రూ. 200కు బదులు రూ. 10 నోటు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఏపీఎస్‌ఆర్‌టీసీ జోనల్ డ్రైవింగ్ ట్రైనింగ్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే ప్రసాద్‌శౌరి శేషాద్రి నగర్‌లో నివసిస్తున్నారు. రూ. 10 వేలు డబ్బు అవసరమై సమీపంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం వద్దకెళ్లి డ్రా చేశాడు. అందులో రూ. 200 నోట్లు 49, రూ. 10 నోటు ఒకటి వచ్చింది. ఆశ్చర్యపోయిన ప్రసాద్ శౌరి ఈ విషయం ఏటీఎం నిర్వహించే ఏజెన్సీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఏటీఎంలలో నగదు ఉంచే ఏజెన్సీలే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాయని కస్టమర్లు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment