నిడమర్రు:గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతను చైతన్యం చేసి వారికి తగిన శిక్షణ అందించి స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకునే లక్ష్యంతో ఆంధ్రాబ్యాంక్ ‘రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్’ ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత వివిధ రంగాల్లో రాణించేందుకు అవసరమైన శిక్షణ తరగతులను జిల్లా కేంద్రం ఏలూరులో నిర్వహిస్తున్నట్టు జయప్రకాష్‌నారాయణ ఆంధ్రాబ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సంచాలకులు జె. షణ్ముఖరావు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థుల నుంచి రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకూ ఆ సంస్థలో బ్యూటీపార్లర్ మేనేజ్మెంట్ కోర్సులపై 1,200 మంది శిక్షణ పొందగా, 1,100 మంది వరకూ స్థిరపరపడినట్టు తెలిపారు. ఇదే కోర్సుపై 2018–19 సంవత్సరానికి మరో కొత్త బ్యాచ్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఈ కొత్త బ్యాచ్ ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందన్నారు. ఈ కోర్సు శిక్షణకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
అభ్యర్థుల అర్హతలివే..
♦ దరఖాస్తు చేసుకునే అవకాశం పశ్చిమగోదారి జిల్లాకు చెందిన మహిళా అభ్యర్థులకు మాత్రమే
♦ వయోపరిమితి: 18 నుండి 35 ఏళ్లలోపు ఉండాలి.
♦ విద్యార్హత: 10వ తరగతి ఆపై
శిక్షణ కాలంలో సదుపాయాలు ఇలా..
♦ శిక్షణకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
♦ దూరప్రాంతాల నుంచి శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులకు వసతి, భోజన సదుపాయం ఉచితంగా ఏర్పాటు చేస్తారు.
♦ హాస్టల్ అభ్యర్థులకు వారి గ్రామాల నుంచి ఒకసారి సంస్థకు రానుపోను ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు.
♦ స్థానిక అభ్యర్థులకు కూడా మ««ధ్యాహ్నం ఉచిత భోజన వసతి కల్పిస్తారు.
♦ శిక్షణ కాలమందు అవసరమగు సేవలు, మెటీరియల్ సంస్థచే ఉచితంగా అందిస్తారు.
♦ బ్యూటీషియన్ కోర్సుపై సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పైనా శిక్షణ ఉంటుంది.
ప్రత్యేకతలు ఇవి
♦ అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో శిక్షణ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ
♦ 30 రోజుల్లోనే బ్యూటీపార్లర్ మేనేజ్మెంట్, బ్యూటీషియన్ నైపుణ్యంపై మెరుగైన శిక్షణ ఇస్తారు.
పేర్లు నమోదు ఇలా..
♦ ఈ కోర్సులో శిక్షణ పొందేందుకు ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 7వ తేదీలోపు ఫోన్ ద్వారా/ఎస్ఎంఎస్/పోస్ట్ కార్డుద్వారా పే ర్లు, చిరునామాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
♦ గతంలో పేర్లు నమోదు చేసుకున్నవారు, కొత్తగా అడ్మిషన్‌కు అర్హత సాధించినవారు వారి ఆధార్, రేషన్ కార్డు, విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు, 3 ఫోటోలు తీసుకురావాల్సి ఉంటుంది.
శిక్షణ సంస్థ చిరునామా:జయప్రకాష్ నారాయణ్ ఆంధ్రాబ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ,వెలుగు ఆఫీస్ ప్రాంగణం/ఐటీఐ కాలేజీ దగ్గర ,సత్రంపాడు, ఏలూరు– 534 007ఫోన్ నంబర్స్: 08812–253 97598660 94383/94909 98882
బ్యూటీషియన్ కోర్సుకు మంచి డిమాండ్
ఈ శిక్షణ సంస్థను 2005లో ఏర్పాటు చేశాం. బ్యూటీషియన్ కోర్సుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ కోర్సులో ఎక్కువమంది మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. మా సంస్థలో శిక్షణ పూర్తయిన తర్వాత సంబంధిత యూనిట్ స్థాపించేం దుకు బ్యాంకు రుణం పొందుటలో అవసరమగు సలహాలు, సహాయ సహకారం మా బ్యాంక్ సిబ్బంది అందిస్తారు.
– జె. షణ్ముఖరావు, సంచాలకులు,ఏబీఆర్ఎస్ఈటీఐ
Comments
Please login to add a commentAdd a comment