జూన్ 2 నుంచి గాంధీ ఆస్పత్రిలో ఉచిత వై-ఫై | Free Wi-Fi in gandhi hospital soon | Sakshi
Sakshi News home page

జూన్ 2 నుంచి గాంధీ ఆస్పత్రిలో ఉచిత వై-ఫై

Published Thu, May 28 2015 7:24 PM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM

జూన్ 2 నుంచి గాంధీ ఆస్పత్రిలో ఉచిత వై-ఫై

జూన్ 2 నుంచి గాంధీ ఆస్పత్రిలో ఉచిత వై-ఫై

హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఉచిత వై-ఫై సేవలు మరో ఐదురోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయమై బీఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజర్ సుబ్బారావు గురువారం ఆస్పత్రిని సందర్శించి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లుతో భేటీ ఆయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ..  'వై-ఫై నగరంగా హైదరాబాద్' పధకంలో భాగంగా తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ 2వ తేదీ నుంచి గాంధీ ఆస్పత్రిలో ఉచిత వై-ఫై సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

గాంధీ ఓపీ, ఇన్‌పేషెంట్ విభాగాల వద్ద వై-ఫై రూటర్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామన్నారు. 2 ఎంబీపీఎస్ నుంచి 20 ఎంబీపీఎస్ స్పీడుతో వై-ఫై సేవలు అందిస్తామన్నారు. ప్రతిరోజు మొదటి అరగంట పాటు ఈ సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చని, తర్వాత వినియోగించుకున్న డేటాకు ఛార్జీలు వర్తిస్తాయని తెలిపారు. రెండు రోజుల్లో వై-ఫై రూటర్లు ఇన్‌స్టాల్ చేసి, జూన్ 2వ తేదీ నుంచి వై-ఫై సేవలను అందుబాటులోకి తెస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజర్ సుబ్బారావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement