నేరాల నియం్రత్రణ.. శాంతి భద్రతల పరిరక్షణ.. చోరీలను
అరికట్టడం పోలీసు విధుల్లో కీలకమైనవి. నిత్యం కేసులతో బిజీగా ఉండే సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (డీఎస్పీ) నర్రా వెంకటేశ్వరరావు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. వివిధ రంగాలకు చెందిన వారితో మాట్లాడారు. కొవ్వూరు పట్టణ ప్రజలకు అందుతున్న పోలీస్ సేవలపై ఆరా తీశారు. నర్సింగ్ కళాశాలకు వెళ్లి విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న పుష్కరాలలో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీనియర్ సిటిజన్స్ నుంచి సలహాలు స్వీకరించారు. మేలైన పోలీస్ సేవలు అందించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై సూచనలు తీసుకున్నారు. చాగల్లు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది పని తీరును పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడారు. అక్కడికక్కడే వారికి పరిష్కార మార్గాలు చూపించారు. పేకాటలో పట్టుబడిన వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మరోసారి పట్టు బడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు వీఐపీ రిపోర్టింగ్ ఇలా సాగింది.
డీఎస్పీ : ఏమండీ. మీ నర్సింగ్
ఇనిస్టిట్యూట్‌లో ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేశారా.
ప్రిన్సిపాల్ సత్యనారాయణ : కమిటీ లేదు సార్. గతంలో విద్యార్థులు బయటకు వెళితే ర్యాగింగ్ సమస్య ఉండేది.
డీఎస్పీ : పోలీసుల దృష్టికి
తీసుకు వెళ్లారా.
ప్రిన్సిపాల్ : పట్టణ పోలీసులకు రెండుమూడు సార్లు చెప్పాం. పోలీసులు గస్తీ పెంచడంతో ప్రస్తుతం ర్యాగింగ్ సమస్య త గ్గింది.
డీఎస్పీ : ర్యాగింగ్ నియంత్రణకు ఏ చర్యలు తీసుకుంటున్నారు.
ప్రిన్సిపాల్ : సీనియర్ విద్యార్థులకు గెడైన్స్ ఇస్తున్నాం. బయట ర్యాగింగ్ సమస్యలుంటే వెంటనే మా దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నాం.
డీఎస్పీ : ఇక్కడంతా ఆడపిల్లలే ఉంటున్నారు. రాత్రిపూట భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు.
ప్రిన్సిపాల్ : ఇద్దరు వాచ్‌మెన్‌లు ఉన్నారు. కుక్కలు ఉన్నాయి.
డీఎస్పీ : ఏమ్మా.. బయటికి వెళ్లినప్పుడు ర్యాగింగ్ సమస్య ఉందా?
పాతాళ రాణి, విద్యార్థిని : గతంలో ఉండేది సార్. ప్రస్తుతం ఇబ్బందేమీ లేదు.
డీఎస్పీ : పోలీసుల పరంగా ఏవైనా సమస్యలుఉన్నాయా.
రాణి : మాది చాగల్లు మండలం మార్కోండపాడు. ఇంటిపక్కన వాళ్లు గొడవ పడి మా అమ్మను కొట్టారు. కేసు పెట్టినా ఏం చర్యలు తీసుకోలేదు సార్.
డీఎస్పీ : కేసు పెట్టినప్పుడు కచ్చితంగా రశీదు తీసుకోవాలి. చాగల్లు పోలీసులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం.
డీఎస్పీ : ఇంకా ఏమైనా సమస్యలున్నాయా.
మద్దాల తబిత : మెరక వీధి వాటర్
ట్యాంక్ దగ్గర ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది సార్. రోడ్డు దాటడానికి జనం ఇబ్బంది పడుతున్నారు.
డీఎస్పీ : జనం రోడ్డు దాటేందుకు అనువుగా ఆర్ అండ్‌బీ అధికారులతో మాట్లాడి జీబ్రా లైన్స్ వేయిస్తాం. ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చేందుకు కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేస్తాం.
పులపా సత్యనారాయణ : బిచ్చగాళ్ల ముసుగులో గోష్పాద క్షేత్రంలో దొంగలు సంచరిస్తున్నారు. నేరస్తులకు ఈ క్షేత్రం అడ్డాగా మారింది.
డీఎస్పీ : గతంలో ఒడిశా నుంచి వచ్చిన
దొంగలను పట్టుకున్నాం. దొంగలపై నిఘా పెంచుతాం.
డీఎస్పీ : రానున్న పుష్కరాలకు ఏవిధమైన చర్యలు తీసుకుంటే బావుటుందంటారు.
సత్యనారాయణ : సీనియర్ సిటిజన్ అసోసియేషన్‌లో అన్ని విభాగాల్లో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. సమాచార కేంద్రాల్లో మా సంఘం సేవలను ఉపయోగించుకోండి.
డీఎస్పీ : ట్రాఫిక్ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి.
డీజేజే పురుషోత్తం : మొయిన్ రోడ్డులో ఆక్రమణలు ఎక్కువయ్యాయి. విజయవిహార్ సెంటర్ నుంచి అడ్డదిడ్డంగా వాహనాలు నిలిపివేస్తుండటంతో ఇబ్బందులు తలెత్తున్నాయి.
డీఎస్పీ : ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. పుష్కరాలకు పార్కింగ్ ప్రదేశాలు ఎక్కడ పెడితే బావుంటుంది. గత అనుభవాలు చెప్పండి.
లక్ష్మీనారాయణ : బ్రిడ్జి దగ్గర పార్కింగ్ ఏర్పా టు చేస్తే బాగుంటుంది. ఈసారి రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని పార్కింగ్ ప్రదేశాలను ముందుగానే గుర్తించాలి.
యాళ్ల నరసింహరావు : పట్టణంలో చైన్ స్నాచింగ్స్ ఎక్కువయ్యాయి. వాటి నివారణకు చర్యలు తీసుకోవాలి.
డీఎస్పీ : రద్దీ సమయాల్లో బ్లూకోట్స్,
రక్షక్ వాహనాలతో నిఘా పెడుతున్నాం. చోరీల నియంత్రణకు నిఘా బృందాలను ఏర్పాటు చేశాం.
నరసింహరావు : సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తే బాగుటుంది.
డీఎస్పీ : పట్టణంలో అన్ని ప్రధాన కూడళ్లలో శాశ్వతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నాం. అపార్టుమెంట్స్‌లోనూ వాటి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం.
సున్నం సత్యనారాయణ : గోష్పాద క్షేత్రం సమీపంలో రాష్ట్ర రహదారికి ఇరువైపులా స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
డీఎస్పీ : ఆర్ అండ్ బీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఏర్పాటు చేయిస్తాం.
ఎం.సత్యనారాయణ : మద్యం తాగి వాహనాలు నడపటం వల్ల ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. చర్యలు తీసుకోండి.
డీఎస్పీ : ఇప్పటికే ఎన్స్‌ఫోర్స్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారులతో కలిసి వాహన తనిఖీలు చేస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెడుతున్నాం. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు పెడుతున్నాం. ప్రధాన కూడళ్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయిస్తాం.
అక్కడి నుంచి చాగల్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన డీఎస్పీ అక్కడ ఫిర్యాదుదారులతో మాట్లాడుతూ..
డీఎస్పీ :పోలీస్ స్టేషన్‌కు దేనికోసం వచ్చారు.
పిన్నమని కృష్ణారావు : నా సైకిల్ చోరీకి గురైంది. ఫిర్యాదు చేయడానికి వచ్చాను సార్.
డీఎస్పీ: కేసు నమోదు చేశారా. రశీదు ఇచ్చారా.
కృష్ణారావు : రశీదు ఇస్తామన్నారు.
డీఎస్పీ : మీరెవరు. ఏ సమస్యపై వచ్చారు.
పేకాటరాయుళ్లు : పేకాట ఆడుతూ పట్టుబడ్డాం సార్. కోర్టులో ఫైన్ కట్టి వచ్చాం.
డీఎస్పీ : మరోసారి పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటాం. చెడు వ్యసనాలకు బానిసలైతే కుటుంబాలు వీధిన పడతాయి. వాటి జోలికి పోకండి.
పారేపల్లి కృష్ణవేణి : గత నెల 11న నాపై దాడిచేసి కొట్టి గాయపరిచిన నిందితులను అరెస్ట్ చేయడం లేదు.
డీఎస్పీ : తక్షణమే అరెస్ట్ చేయిస్తాం.
ఫ్రెండ్లీ పోలీసింగ్
Published Sun, Mar 15 2015 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM
Advertisement
Advertisement