సీతంపేట: గ్రామాల్లోని గర్భిణులు, బాలింతలకు, చిన్న చిన్న జ్వరాలకు ైవె ద్యం చేస్తూ పల్లెల్లో ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటున్న ఆరోగ్య కార్యకర్తలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. వారికిచ్చే గౌరవ వేతనమే అరకొర అరుునా వారికి పద్నాలుగు నెలలుగా అదీ అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కష్టపడి గ్రామాల్లో తిరుగుతూ పనిచేస్తున్న మాకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఐటీడీఏ పరిధిలో సుమారు 398 మంది మహిళా ఆరోగ్య కార్యకర్తలు ( సీహెచ్‌డబ్ల్యూవో) పనిచేస్తున్నారు. నెలకు రూ. 400 గౌరవ వేతనంగా అందిస్తున్నారు. కానీ 14 నెలలుగా అదీ సక్రమంగా అందడంలేదు సరికదా ఉన్న ఉద్యోగం నుంచి కూడా తొలిగిస్తారనే ప్రచారం సాగుతుండడంతో వీరు మరింత ఆందోళన చెందుతున్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పనిచేస్తూ ఎండనకా వాననకా గ్రామాల్లో తిరుగుతూ జ్వరం, డయేరియా, మలేరియా వంటి వ్యాధులకు గురైతే ప్రథమ చికిత్స చేసి మందులు అందిస్తుంటారు. గర్భిణీలు, బాలింతలకు అవసరమైన సేవలు చేస్తుంటారు. ఇంత చేసినా వీరికి నెలకు దక్కేది కేవలం రూ. 400 మాత్రమే. సుమారు వీరు పదేళ్లు నుంచి ఈ ఉద్యోగాలు చే స్తున్నారు. అయితే ప్రతి ఏటా వీరు జీతాలు కోసం ధర్నాలు, ఆందోళనలు చేస్తుండడమే తప్ప వీరిని మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. గ్రామాల్లో పనిచేస్తారు కాబట్టి వీరిని గుర్తించే విధంగా ప్రత్యేక యూనిఫారం, టార్చ్‌లైట్, మందుల కిట్ వంటివి ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోగ్య కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో జె.కృష్ణమోహన్ వద్ద సాక్షి విలేకరి ప్రస్తావించగా నిధులు మంజూరు కాగానే వేతనాలు చెల్లిస్తామని చెప్పారు.
ఆందోళన చేపడతాం
గ్రామ ఆరోగ్య కార్యకర్తల సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీ ఆందోళన చేపడతాం. 14 జీతాలు లేక అల్లాడుతున్నారు. వీరికి ఇచ్చేది స్వల్పమే అరుునా సకాలంలో అందించ డంలేదు. వీరికి ఒక గుర్తింపు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.
- కె.నాగమణి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు
వేతనం ఎలా సరిపోతుంది
రూ. 400తో మేం ఎలా బతకాలి. రాత్రి, పగలు తేడా లేకుండా గ్రామాల్లో తిరుగుతూ కష్టపడి పనిచేస్తున్న మాకు పనికి తగ్గ వేతనం అందడంలేదు. గ్రామాల్లో ఎవ రికి వ్యాధులు ప్రభలినా ముందుగా మేమే ప్రథమ చికిత్స చేస్తాం. మాత్రలు ఇస్తాం. అయినా మమ్మల్ని గుర్తించడం లేదు. - కె.భారతి, ఆరోగ్య కార్యకర్త
గౌరవం ఫుల్.. వేతనం నిల్
Published Sun, Jul 13 2014 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM
Advertisement
Advertisement