సర్కార్ ప్రోత్సాహం... మాటలకే పరిమితమైంది. పంచాయతీ ఖజానా వెక్కిరిస్తోంది. ఎన్నో ఆశలతో గెలిపించిన ప్రజలు మాత్రం ఏదో చేస్తారంటూ ఎదురుచూస్తున్నారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌ల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. సర్పంచ్ పీఠం ఎక్కి ఆరు నెలలు దాటినా గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టలేక, ప్రశ్నించే వారికి సమాధానం చెప్పలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలకులు మాత్రం నిధుల సాకుతో ప్రోత్సాహక సొమ్ముల ఫైలును తొక్కిపెట్టారు.
పదవికి ఇద్దరు నామినేషన్లు వేసినా పరిశీలనలో అవి తిరస్కరణకు గురయ్యాయి. ఇక రాయిలాపూర్‌లో 5వ వార్డులు, చింతపల్లిలో ఒక వార్డుకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇటీవలి కాలంలో జిల్లాలోని ముగ్గురు వార్డు సభ్యులు మరణించగా, మరో ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో జిల్లాలో మొత్తం 21 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కలెక్టర్ స్మితా సబర్వాల్ పరిశీలనలో వున్న ఫైలు ఆమోదం పొందిన వెంటనే మూడో తేదీన నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
ఆర్నెల్లుగా అదే మాట
Published Thu, Jan 2 2014 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
Advertisement
Advertisement