unanimous sarpanch
-
మాస్టార్ కోసం నామినేషన్ల ఉపసంహరణ
సాక్షి, విశాఖపట్నం: మనిషి జీవితంలో తల్లితండ్రి తరువాతి స్థానం గురువుదే.. ఆ తర్వాతే దైవం. ఎందుకంటే అమ్మనాన్న మనకు జన్మనిస్తే.. గురువు చదువు చెప్పి విద్యాబుద్దులు నేర్పి.. జీవితంలో మంచి మార్గంలో నడవడానికి.. ఉన్నతంగా ఎదగడానికి అవసరమైన జ్ఞానాన్ని బోధిస్తాడు. జీవితంలో మనం మంచి స్థాయిలో ఉన్నామంటే అందుకు తల్లితండ్రులతో పాటు గురువు కూడా కారణమే. అలాంటి మాస్టారుకు ఏమిచ్చినా తక్కువే. వారి రుణం తీర్చుకునే అవకాశం లభించడమే అదృష్టం. అలాంటి పరిస్థితే ఎదురయ్యింది కొందరు గ్రామస్తులకి. గురువు మీద అభిమానంతో వారు చేసిన పనిని అందరు ప్రశంసిస్తున్నారు. ఆ వివరాలు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. మూడో విడత నామినేషన్ల ఉపసంహరణకు నేడే చివరి రోజు. ఈ క్రమంలో కొయ్యూరు మండలం మంప గ్రామంలో స్కూల్ టీచర్‌గా పని చేసిన ఇంగువ త్రినాథ్ పడాల్ సర్పంచ్‌గా బరిలో నిలిచారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువు పట్ల కృతజ్ఞతగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. దాంతో ఉపాధ్యాయుడు ఇంగువ త్రినాధ్ పడాల్ మంప గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులను గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. చదవండి: ఓటర్ల దీవెన.. సర్పంచ్‌లుగా ముగ్గురు వలంటీర్లు -
ఏకగ్రీవ సర్పంచ్‌కు ఎన్ని కష్టాలో..
అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగలేదని వివక్ష కనిగిరి ఏఎంసీ చైర్మన్ చెప్పినట్లు నడుచుకోలేదని కక్ష నిత్యం అవమానానికి గురిచేస్తున్న అధికారులు ఒంగోలులో చెప్పులు కుడుతూ నిరసన తెలిపిన సర్పంచ్ ఒంగోలు టౌన్: ఆయన పేరు తాతపూడి భూషణం. మూడున్నరేళ్ల క్రితం గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన నాటినుంచి తాము చెప్పినట్లు నడుచుకోవాలంటూ బెదిరిస్తున్నారు. అధికారపార్టీ అండ చూసుకుని గ్రామ కార్యదర్శి నుంచి డివిజినల్ పంచాయతీ అధికారి వరకు ఆ సర్పంచ్‌ను అవమానానికి గురిచేస్తూనే ఉన్నారు. తనకు జరిగిన అన్యాయం గురించి అధికారులకు చెప్పుకున్న ప్రతిసారీ ఆ సర్పంచ్ మరింత అవమానానికి గురవుతూనే ఉన్నాడు. ఒకవైపు అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగలేదని కక్ష, ఇంకోవైపు నిత్యం అధికారుల వివక్షతో తన వేదనను జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలనుకున్నారు ఆ సర్పంచ్. కేవీపీఎస్ జిల్లా నాయకులను కలిసిన అనంతరం సోమవారం కలెక్టరేట్ వద్ద చెప్పులు కుడుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇదేనా గౌరవం..? పామూరు మండలం కోడిగుండ్లపాడు సర్పంచ్‌గా తాతపూడి భూషణం 2013 జూలై 18వ తేదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఆ సర్పంచ్‌పై ఒత్తిళ్లు పెరిగిపోయాయి. తాము చెప్పిన పనులు చేయాలని వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టారు. కనిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్.. తాను చెప్పినట్లు సర్పంచ్ నడుచుకోలేదన్న అక్కసుతో కక్ష కట్టారు. గ్రామ కార్యదర్శి షేక్ చాంద్‌బాషా మొదలుకుని ఈఓఆర్డీ సదాశివరావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజారావు, డివిజినల్ పంచాయతీ అధికారి భాస్కరరెడ్డిలు సర్పంచ్‌ను నిత్యం అవమానపరుస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూషణం గ్రామంలో నివసిస్తున్నప్పటికీ ఉండటం లేదని అధికారులను మార్కెట్ కమిటీ చైర్మన్ తప్పుదోవ పట్టించి ఉప సర్పంచ్ దారపనేని జనార్దన్‌కు బాధ్యతలు అప్పగించేందుకు 2015 ఫిబ్రవరి 28వ తేదీ ఉత్తర్వులు తెప్పించారు. తనకు జరిగిన అన్యాయం గురించి అప్పటి కలెక్టర్‌ను కలిసి సర్పంచ్ ఫిర్యాదు చేయగా, అతనికే బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుంచి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనీ జరగనీయకపోగా, కనీసం గౌరవ వేతనం కూడా ఇవ్వకుండా మానసిక వేధనకు గురిచేస్తున్నారని విలేకరుల వద్ద భూషణం వాపోయారు. అధికార పార్టీ ఆగడాలను అడ్డుకోవాలి... ఏకగ్రీవ సర్పంచ్‌పై అధికార పార్టీతో పాటు అధికారుల ఆగడాలను అడ్డుకోవాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బీ రఘురామ్ డిమాండ్ చేశారు. భూషణం తనకు జరుగుతున్న వివక్షపై మండల, డివిజినల్ స్థాయి అధికారుల వద్ద మొరపెట్టుకున్నా వారు అధికారపార్టీ నాయకులకు దాసోహమై ఎదురుదాడికి దిగుతున్నారని ధ్వజమెత్తారు. భూషణం వంటి బాధిత సర్పంచులు జిల్లాలో అనేకమంది ఉన్నారని, కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి వారి హక్కులను కాపాడాలని కోరారు. -
ఏకగ్రీవాలకు ప్రోత్సాహమేదీ?
భువనగిరి, న్యూస్‌లైన్: గత సంవత్సరం జూలైలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన వాటికి ఇస్తామన్న నజరానా నేటికీ అందలేదు. ప్రభుత్వం ఇస్తామన్న నగదు ప్రోత్సాహకం కోసం ఎదురుచూస్తున్న ఏకగ్రీవ సర్పంచ్‌లకు నిరాశే మిగులుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఎన్నికలు లేకుండా పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ పంచాయతీకి *7లక్షల పారితోషికం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాలో ఉన్న 1169 పంచాయతీల్లో 103 ఏకగ్రీవమయ్యాయి. వీటన్నింటికి కలిపి *7.21కోట్ల నిధులు రావాల్సి ఉంది. ఎన్నికలు జరిగి ఏడు నెలలవుతున్నా ఒక్క పంచాయతీకి కూడా ప్రోత్సాహక నిధులు విడుదల చేయలేదు. పంచాయతీల్లో నిధులు లేక గ్రామాల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని స్థితిలో సర్పంచ్‌లున్నారు. కనీసం ప్రోత్సాహక నిధులు వస్తే వాటితోనైనా తాగునీరు, వీధి దీపాలు తదితర పనులు పూర్తి చేద్దామనుకుంటే ప్రభుత్వం వాటి గురించే పట్టించుకోవడం లేదని ఏకగ్రీవ సర్పంచ్‌లు వాపోతున్నారు. ఆ నిధుల కోసం ఎన్నిసార్లు అధికారులను కలిసినా ఎవరూ స్పం దించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ఇస్తామన్న ప్రోత్సాహక నగదును మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. -
ఆర్నెల్లుగా అదే మాట
సర్కార్ ప్రోత్సాహం... మాటలకే పరిమితమైంది. పంచాయతీ ఖజానా వెక్కిరిస్తోంది. ఎన్నో ఆశలతో గెలిపించిన ప్రజలు మాత్రం ఏదో చేస్తారంటూ ఎదురుచూస్తున్నారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. సర్పంచ్ పీఠం ఎక్కి ఆరు నెలలు దాటినా గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టలేక, ప్రశ్నించే వారికి సమాధానం చెప్పలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలకులు మాత్రం నిధుల సాకుతో ప్రోత్సాహక సొమ్ముల ఫైలును తొక్కిపెట్టారు. పదవికి ఇద్దరు నామినేషన్లు వేసినా పరిశీలనలో అవి తిరస్కరణకు గురయ్యాయి. ఇక రాయిలాపూర్‌లో 5వ వార్డులు, చింతపల్లిలో ఒక వార్డుకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇటీవలి కాలంలో జిల్లాలోని ముగ్గురు వార్డు సభ్యులు మరణించగా, మరో ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో జిల్లాలో మొత్తం 21 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కలెక్టర్ స్మితా సబర్వాల్ పరిశీలనలో వున్న ఫైలు ఆమోదం పొందిన వెంటనే మూడో తేదీన నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.