
పరిటాల హత్యపై విచారణకు సిద్ధమా?
హైదరాబాద్: టీడీపీ నేతలు కన్నుమూసినా, తెరిచినా వారికి వైఎస్సార్ కాంగ్రెస్సే కనిపిస్తోందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు చిత్తశుద్ధితో ఏనాడూ వ్యవహరించలేదని విమర్శించారు. ఏ అవకాశం దొరికినా వైఎస్సార్‌సీపీపై బురదజల్లడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
పరిటాల రవి హత్య విషయంలో చంద్రబాబు చేస్తున్నవి సిగ్గులేని ఆరోపణలని కొట్టిపారేశారు. చాలామంది నేతలు పరిటాల రవికి దగ్గరవుతున్న బాధతో చంద్రబాబే హత్యచేయించారని అనుమానాలున్నాయని అన్నారు. పార్టీలో తనకు ఎదురులేకుండా చేసుకోవడానికి పరిటాల రవిని చంద్రబాబే హత్యచేయించారనే ఆరోపణలున్నాయన్నారు.
చంద్రబాబు అన్నీ ఇలాంటి రాజకీయాలే చేస్తారన్నారు. ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించడానికి కూడా అలాంటి రాజకీయాలే చేశారన్నారు. మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి, ఇంద్రారెడ్డిల మరణాలపై సీబీఐ దర్యాప్తుకు చంద్రబాబు సిద్ధమా అని శ్రీకాంత్‌రెడ్డి సవాల్ చేశారు. చంద్రబాబు హయాంలో టీడీపీ ప్రతిష్ట నానాటికీ దిగజారిపోతుందని అన్నారు.