ఆద్యంతం ఆసక్తికరం
Published Thu, Sep 19 2013 4:10 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్: ప్రతి ఏడాది మాదిరిగానే వినాయకుడి లడ్డూను కొనుగోలు చేయడానికి భక్తులు ఆసక్తి చూపారు. లడ్డు వేలం పాటలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. రూ. వెయ్యి నుంచి మొదలుపెడితే రూ. లక్ష వరకు పోటీపోటీగా లడ్డూను దక్కించుకోవడానికి భక్తులు శ్రద్ధ చూపారు. పెద్దషాపూర్‌లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం లడ్డూ వేలం పాటలో రూ.20,300 పలికింది. 27 కిలోల ఈ లడ్డూను శ్రీహనుమాన్ యూత్ సభ్యులు సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సత్యనారాయణ, సొసైటీ డెరైక్టర్ రాజశేఖర్ పాల్గొన్నారు. పెద్దగోల్కొండలో హనుమాన్ దేవాలయం వ ద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలోని లడ్డూను ఆనేగౌని వెంక టయ్యగౌడ్ రూ.35,800లకు సొంతం చేసుకున్నాడు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.శ్రీకాంత్‌గౌడ్, బీజేవైఎం నాయకులు వెంకటేష్‌గౌడ్, మాజీ సర్పంచ్ ఎ.నర్సింహగౌడ్, ఉప సర్పంచ్ జి.యాదగిరి, హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ ఎ.ప్రకాష్‌గౌడ్ పాల్గొన్నారు.
చేవెళ్లలో రూ.లక్షా 20 వేలు..
చేవెళ్ల రూరల్: చేవెళ్ల గ్రామ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి గణేష్ లడ్డూ వేలం పాట అట్టహాసంగా నిర్వహించారు. చేవెళ్ల గ్రామానికి చెందిన రమణారెడ్డి గ్రూపు సభ్యులు అత్యధికంగా రూ.లక్షా 20వేలకు వేలం పాడి వినాయకుడి లడ్డూ దక్కించుకున్నారు.
మేడ్చల్ రూరల్: పట్టణంలోని బ్యాంక్ కాలనీలో శ్రీ సేవా లాల్ బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డ్డూను రూ.93 వేలకు గోపి కిషన్ జాదవ్ దక్కించుకున్నారు.అదేవిధంగా చంద్రానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డూని స్థానిక కాలనీ ఉపాధ్యక్షుడు క్రిష్ణ మూర్తి రూ. 30 వేలకు దక్కించుకున్నాడు.
మొయినాబాద్: ఎనికేపల్లిలోని వినాయకుడి లడ్డూ అత్యధికంగా రూ.1.21లక్షలు పలికింది. న్యాలట నాగమణి వేలంపాటలో ఈ లడ్డూను దక్కించుకున్నారు.
చేవెళ్ల రూరల్: మండలకేంద్రంలోని రజక కాలనీలో సర్పంచ్ నాగమ్మబాల్‌రాజ్ రూ. 52వేలకు, అంబేద్కర్ కాలనీలో దామరగిద్ద సర్పంచ్ రెడ్డిశెట్టి మధుసూదన్‌గుప్త రూ. 25వేలకు లంబోదరుడి లడ్డూను దక్కించుకున్నారు. అలాగే ఎస్సీ కాలనీలో కందవాడ పెంటయ్య రూ. 35వేలకు, రంగారెడ్డి కాలనీలో శ్రీనివాస టెంట్‌హౌస్ బృందం రూ. 32వేలు, హౌసింగ్‌బోరులో బి. రాంరెడ్డి రూ. 9వేల 501కి లడ్డ్డూను దక్కించుకున్నారు.
Advertisement