కిలేడీ గ్యాంగ్ అరెస్టు
నర్సీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : నగదు చోరీకి పాల్పడుతున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ.90 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా, పోలవరం గ్రామానికి చెందిన జల్సా లక్ష్మి(40), నక్కా పోచమ్మ(42)లను అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ ఆర్.వి.ఆర్.కె.చౌదరి తెలిపారు.
ఈ నెల 2న వజ్రగడ గ్రామానికి చెందిన వడ్డాది నాగలక్ష్మి దంపతులు అనకాపల్లి వేళ్ళేందుకు మాకవరపాలెంలో బస్సు ఎక్కారు. శెట్టిపాలెంలో ఇద్దరు మహిళలు అదే బస్సు ఎక్కి నాగలక్ష్మి పక్కన కూర్చున్నారు. ఆమె దగ్గర రూ.90వేలతో ఉన్న బ్యాగ్‌ను కాజేసిన ఇద్దరు మహిళలు కన్నూరుపాలెంలో దిగిపోయారు.
దీంతో బాధితురాలు మాకవరపాలెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇద్దరు మహిళలు బుధవారం శారదానగర్ ప్రాంతంలో సంచరిస్తుండగా నేరవిభాగం టీమ్ పట్టుకుంది. ఈ సమావేశంలో మాకవరపాలెం ఎస్సై ఎం.రామారావు, హెడ్‌కానిస్టేబుల్ గంగరాజు పాల్గొన్నారు.