
రూ. 70 లక్షల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం రాజాం జంక్షన్ వద్ద పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి అయిదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వ్యాన్ సీజ్ చేశారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి 500 కేజీలు ఉందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 70 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. అయిదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.