గంటా శ్రీనివాస రావు
గుంటూరు: విశాఖపట్నం జిల్లా భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాస రావు లక్కీ చాన్స్ కొట్టేశారు. అటు అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనూ ఆయన రాష్ట్ర ఓడరేవులు, పెట్టుబడులు శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ తరువాత పార్టీ మారారు. శాసనసభ్యుడిగా గెలిచారు. ఇప్పుడు టిడిపి ప్రభుత్వంలో కూడా మంత్రి పదవిని దక్కించుకున్నారు. అనేక మంది కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేరారు. శాసనసభ్యులుగా గెలిచారు. కానీ మంత్రి పదవి మాత్రం గంటానే వరించింది.
టిడిపి ద్వారానే గంటా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తరువాత చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ(పిఆర్పి)లో చేరారు. పిఆర్పి కాంగ్రెస్లో విలీనం అయిన తరువాత ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరారు.