క్షణక్షణం.. భయం భయం! | Gas tanker roll over near ALLAGADDA | Sakshi
Sakshi News home page

క్షణక్షణం.. భయం భయం!

Published Wed, Jun 24 2015 4:11 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

క్షణక్షణం.. భయం భయం! - Sakshi

క్షణక్షణం.. భయం భయం!

ఆళ్లగడ్డటౌన్ : పట్టణ శివారులోని ఎంవీనగర్ సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం భారీ గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటనతో స్థానికులు, అధికారులు, పోలీసులు భయంభయంగా గడిపారు. భారత్ గ్యాస్ కంపెనీ ట్యాంకర్ దాదాపు 18 టన్నుల గ్యాస్ నింపుకుని చెన్నై నుంచి కర్నూలు వైపు వెళ్తూ బోల్తా పడింది. ఇంజిన్ రోడ్డుకు15 అడుగుల దూరం వరకు దూసుకుపోయింది. ట్యాంకర్ రోడ్డుపై పల్టీలు కొట్టింది. అయితే అదృష్ట వశాత్తు గ్యాస్ లీక్ కాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. రూరల్ పోలీస్ స్టేషన్, అగ్నిమాపక శాఖ కార్యాలయం, మండల పరిషత్, వ్యవసాయ, విద్య త దితర అనేక శాఖల కార్యాలయాలు ప్రమాదం జరిగిన స్థలానికి కూత వేటు దూరంలో ఉండడంతో ఎప్పుడు ఏంజరుగుతుందోనన్న ఆందోళనతో గడపాల్సి వచ్చింది.

 కాలనీని ఖాళీ చేసిన ప్రజలు
 ప్రమాదం జరిగిన వెంటనే ఏఎస్పీ శశికుమార్, సీఐ ఓబులేసు, ఎస్‌ఐలు శ్రీనివాసులు, చంద్రశేఖర్‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అగ్నిమాపక శా ఖ వాహనాన్ని రప్పించారు. ఎంవీనగర్ కాలనీ వాసులు జాగ్రత్తగా ఉండాలని, వీలైతే ట్యాంకరును అక్కడి నుంచి తరలించే వరకు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలని పో లీసులు సూచించడంతో స్థానికులు మొ త్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.

 పోలీసులు అక్కడే మకాం..
 ట్యాంకర్ బోల్తా ఘటన కారణంగా జాతీయ రహదారిపై వాహనాలు తిరక్కుండా దారి మళ్లించిన పోలీసులు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఉదయం ప్రమాదం జరిగినప్పటి నుంచి పోలీస్ బందోబస్తుతో రాత్రంతా అక్కడే మకాం వేశారు. ట్యాంకర్‌ను తరలించేందుకు మరో రోజు పడుతుందని సమాచారం.

 సరిపడా పరికరాలు లేవు :  శ్రీనివాసులు, ఎస్‌ఐ
 బోల్తా పడిన ట్యాంక ర్ బరువుకు తగ్గ క్రేన్‌లు ఆళ్లగడ్డ పరిశర ప్రాంతాల్లో లేవు. కర్నూలు నుంచి రెండు క్రేన్‌లను తెప్పిస్తున్నాం.  చీకట్లో పనులు జరక్కపోవచ్చు. బుధవారం ఉదయానికంతా ట్యాంకర్‌ను పక్కకు తరలించేందుకు చర్యలు తీసుకుంటాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement