ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు
పాతగుంటూరు: పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న సూపరింటెండెంట్‌లు, డిప్యూటీ ఎంపీడీవోలకు గజిటెడ్ హోదా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం సంఘం జిల్లా యూనిట్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ మండల పరిషత్‌లో మండల రెవెన్యూ విభాగాల మాదిరిగా సూపరింటెండెంట్ పోస్టులను డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారులుగా హోదా కల్పించాలన్నారు.
ఎంపీడీవో పోస్టులను సూపరింటెండెంట్ నిష్పత్తిని 34 శాతం చేరువకు ఎంపీడీవో పోస్టులను సూపరింటెండెంట్ కేటగిరి నుంచి మాత్రమే భర్తీ చేయాలని, 34 శాతం అడ్వకేసీని పాటించాలన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఉన్న రికార్డు అసిస్టెంట్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్లుగా అప్‌డేట్ చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుభాన్, రాష్ట్ర నాయకులు డేవిడ్‌రాజ్, వెంకట్రావు, జిల్లా కార్యదర్శి కూచిపూడి మోహన్‌రావు, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, నాయకులు బాలకృష్ణ, వీరయ్య, శ్రీనివాసరావు, జొన్నల పూర్ణచంద్రారెడ్డి, గుంటుపల్లి శ్రీనివాసరావు, శామ్యేల్‌పాల్, ప్రసాద్, దయానందం, త్యాగరాజు, బసవకుమారి తదితరులు పాల్గొన్నారు.