gazetted status
-
ఏసీటీఓలకు గెజిటెడ్ హోదా కల్పించాలి
► వాణిజ్య పన్నుల నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముజాహిద్‌హుస్సేన్ కరీమాబాద్ : ప్రభుత్వం ఏసీటీఓలకు గెజిటెడ్ హోదా కల్పించాలని వాణిజ్య పన్నుల నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ ముజాహిద్‌హుస్సేన్ కోరారు. శనివారం హన్మకొండ అశోక కాన్ఫరెన్స్ హాల్లో డివిజన్ అధ్యక్షుడు కె.గోపీకిషోర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముజాహిద్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్–2 ఉద్యోగులకు నేరుగా ఏసీటీఓలు గానూ, అలాగే కిందిస్థాయి సిబ్బంది పదోన్నతుల ద్వారా ఏసీటీఓలుగా నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రూప్–2 ద్వారా నియామకమయ్యే సబ్రిజిస్ట్రార్లు, డీటీలు, కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్లు, అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్ స్పెక్టర్లు, ఎస్టీఓలకు గెజిటెడ్ హోదా ఇచ్చినట్లుగా ఏసీటీఓలకూ అవకాశం ఇవ్వాలని కోరారు. ఏసీటీఓలకు గెజిటెడ్ హోదా కల్పించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి భారం ఏర్పడదని ముజాహిద్ వివరించారు. ఏసీటీఓలు సుమారు 30 నుంచి 35 ఏళ్లుగా విధులు నిర్వర్తించినప్పటికీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్లుగానే ఉద్యోగవిరమణ చేయాల్సి వస్తోందన్నారు. సమావేశంలో గోపీకిషోర్, అజయ్‌కుమార్, మసూద్, రమేష్, జగదీష్‌కుమార్, సామ్యూల్, సుమలత, నాగమణి, వినయ్, మమత, అనుకిరణ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. -
గజిటెడ్ హోదా కల్పించాలి
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పాతగుంటూరు: పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న సూపరింటెండెంట్లు, డిప్యూటీ ఎంపీడీవోలకు గజిటెడ్ హోదా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం సంఘం జిల్లా యూనిట్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ మండల పరిషత్‌లో మండల రెవెన్యూ విభాగాల మాదిరిగా సూపరింటెండెంట్ పోస్టులను డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారులుగా హోదా కల్పించాలన్నారు. ఎంపీడీవో పోస్టులను సూపరింటెండెంట్ నిష్పత్తిని 34 శాతం చేరువకు ఎంపీడీవో పోస్టులను సూపరింటెండెంట్ కేటగిరి నుంచి మాత్రమే భర్తీ చేయాలని, 34 శాతం అడ్వకేసీని పాటించాలన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఉన్న రికార్డు అసిస్టెంట్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్లుగా అప్డేట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుభాన్, రాష్ట్ర నాయకులు డేవిడ్‌రాజ్, వెంకట్రావు, జిల్లా కార్యదర్శి కూచిపూడి మోహన్‌రావు, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, నాయకులు బాలకృష్ణ, వీరయ్య, శ్రీనివాసరావు, జొన్నల పూర్ణచంద్రారెడ్డి, గుంటుపల్లి శ్రీనివాసరావు, శామ్యేల్పాల్, ప్రసాద్, దయానందం, త్యాగరాజు, బసవకుమారి తదితరులు పాల్గొన్నారు. -
కౌన్సెలింగ్‌తో బదిలీలు!
* గెజిటెడ్ హోదా అధికారులకు మినహా అందరికీ వర్తింపు * భార్యా భర్తలు ఉద్యోగులైతే ఒకే చోట పని చేసేలా ప్రాధాన్యం * మినిస్టీరియల్ ఉద్యోగులు మూడేళ్లుగా ఒకే చోట పనిచేస్తుంటే బదిలీ * ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు మినహాయింపు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో స్వల్ప మార్పులు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. గెజిటెడ్ అధికారి స్థాయి ఉద్యోగులు మినహా మిగతా వారిని(మినిస్టీరియల్ సిబ్బంది) కౌన్సెలింగ్ ద్వారానే బదిలీ చేయనున్నారు. గెజిటెడ్(ఎగ్జిక్యూటివ్ పంక్షనరీలు) అధికారి స్థాయి ఉద్యోగులను ఇష్టానుసారం బదిలీ చేయవచ్చని స్వయంగా ముఖ్యమంత్రే నిర్ణయం తీసుకోవడం పట్ల అధికార యంత్రాంగం విస్తుపోతోంది. ఏ ఉద్యోగినైనా కొన్ని నిబంధనల మేరకు బదిలీ చేస్తారు. ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా పనిచేయలేదనే నెపంతో ఇష్టం లేని గెజిటెడ్ ఉద్యోగులందరినీ ఇష్టారాజ్యంగా బదిలీ చేయాలనే నిర్ణయానికి రావటంపై ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గెజిటెడ్ ఉద్యోగుల బదిలీలకు అధికారులు నిబంధనలు సూచించగా సీఎం మండిపడ్డారు. ‘నేను చెప్పినట్లు ఆదేశాలు ఇవ్వండి.. నేను చెబితే చేయరా...?’ అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గెజిటెడ్ ఉద్యోగులను ఎక్కడికైనా కౌన్సెలింగ్ లేకుండానే బదిలీ చేసేలా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఉద్యోగుల బదిలీల నిబంధనల్లో మార్పులను సూచించటంతో ఆమేరకు ఉత్తర్వులు జారీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. గెజిటెడ్ ఉద్యోగులు మినహా మిగతా వారిని(మినిస్టీరియల్ సిబ్బంది) కౌన్సెలింగ్ ద్వారానే బదిలీ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. తొలుత ఈ విధానాన్నిఉపాధ్యాయుల బదిలీలకే వర్తింప చేశారు. ఇప్పుడు మినిస్టీరియల్ ఉద్యోగులకు కూడా ఆ విధానాన్ని వర్తింప చేయనున్నారు. మూడేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులు బదిలీలు అర్హులు.ఒక కేడర్‌లో 20 శాతం మందికి మించి బదిలీ చేయరాదనే నిబంధనను ఇప్పుడు విధించనున్నారు. భార్య, భర్త ఉద్యోగులైతే ఇద్దరూ ఒకే చోట పనిచేసేందుకు వీలుగా బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.