నడికుడి రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసిన జీఎం | General manger verified Railway station | Sakshi
Sakshi News home page

నడికుడి రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసిన జీఎం

Published Sat, Jul 12 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM

నడికుడి  రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసిన జీఎం

నడికుడి రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసిన జీఎం

దాచేపల్లి:  నడికుడి రైల్వేస్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పీఎన్ శ్రీవాత్సవ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలులో జీఎం శ్రీవాస్తవ నడికుడి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్‌లోని రైల్వే క్యాంటీన్‌ను పరిశీలించారు.
 
 క్యాంటీన్‌లో ప్రయాణికులకు లభిస్తున్న ఆహార పదార్థాలను జీఎం పరిశీలించారు. క్యాంటీన్‌లో క్రయవిక్రయాలపై నిర్వహకులు స్పేషిప్‌ను జీఎం అడిగి తెలుసుకున్నారు. అనంతరం బుకింగ్ కౌంటర్‌ను తనిఖీచేశారు. రోజుకు ఎన్ని టికెట్లు అమ్ముతున్నదీ.. రిజర్వేషన్‌లు ఎన్ని జరుగుతున్నాయని సిబ్బందిని జీఎం అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లో ప్రయాణికులకు అందిస్తున్న తాగునీటిని జీఎం స్వయంగా పరిశీలించారు. స్టేషన్ మేనేజర్ ఎంఎల్ మీనా వివరాలు వెల్లడించారు.
 
 అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించి స్టేషన్ ముందుభాగంలో గార్డెన్‌ను ఏర్పాటు చేయాలని జీఎం ఆదేశించారు.  ఈ సందర్భంగా జీఎం శ్రీవాత్సవను జేపీ సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్కే దూదా, డిప్యూటీ జీఎం గిరిష్‌కుమార్, సీనియర్ అధికారి జి.విశ్వనాథరెడ్డిలు కలిసి సిమెంట్ లోడింగ్‌కు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. జీఎం వెంట సీఎంవో జేఎన్ జాను తదితరులున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement