మద్యం తాగించిన పెంపుడు తండ్రి.. పాప దుర్మరణం
పెంపుడు తండ్రి మద్యం తాగించడంతో చిన్నారి చనిపోయిన ఘటనలో ఇంతవరకూ పోలీసులు ఎవ్వరినీ పట్టుకోలేకపోయారు. గుంటూరులో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనపై ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఏడాదిన్నర పాపకు మద్యం తాగించిన తండ్రి ... చివరికి ఆమె ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు.
ఈ విషాద సంఘటన గుంటూరు నల్లచెరువులో సోమవారం చోటుచేసుకుంది. ఎవరి కన్నబిడ్డో తెలియదుగానీ .. సైదా అనే వ్యక్తి తన వద్ద ఉన్న చిన్నారిని .. సంతానం లేని ఇస్మాయిల్ దంపతులకు పెంచుకోవడానికి ఇచ్చాడు. అయితే, పండగ పూట తప్పతాగిన ఆ జంట ... బిడ్డకు కూడా కొంత మద్యం తాగించింది. దీంతో పాప అపస్మారక స్థితికి చేరుకుంది. ఇది గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయింది. ఈ సంఘటనపై పోలీసుల వైఖరి పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.