Nalla cheruvu
-
నీకోసం వెలిసిందీ.. ప్రేమ మందిరం!
అయినవిల్లి (పి.గన్నవరం): ఐదున్నర దశాబ్దాల వైవాహిక జీవితంలో అన్యోన్యంగా, ప్రేమానురాగాలతో మెలిగారు ఆ దంపతులు. ఏడాది కిందట భార్య మరణించగా ఆమె తీపి గురుతులు మరువలేని భర్త.. సంవత్సరీకాన్ని పురస్కరించుకొని భార్యకు ప్రేమ మందిరాన్ని నిర్మించాడు. ఊరు, వాడా.. ఇంటింటికీ తిరిగి ఆహ్వాన పత్రికలు పంచాడు. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం నల్లచెరువుకు చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మోటూరి భైరవస్వామి భార్య సత్యవతి ఏడాది కిందట మృతి చెందారు. ఆమె జ్ఞాపకార్థం గ్రామంలో ప్రేమ మందిరాన్ని రూ.3.5 లక్షలతో నిర్మించారు. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. ఇందుకు కరపత్రాలను ముద్రించి ఇంటింటికీ వెళ్లి ‘నా భార్య ప్రసాదాన్ని తిని, ఆత్మకు శాంతి చేకూరాలని ఆశీర్వదించాలని కోరాడు. తన భార్య మృతి చెందిన సమయంలో అవయవ దానం కోసం అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి దేహాన్ని అప్పగించామని, మరణానంతరం తన దేహన్ని కూడా అమలాపురం కిమ్స్ వైద్యశాలకు దానం ఇచ్చేందుకు అంగీకార పత్రం రాసిచ్చానన్నారు. తన భార్య 55 ఏళ్ల ప్రేమ, అనురాగాలతో నడుచుకుందని, ఇందుకు నిదర్శనంగా ఈ ప్రేమ మందిరాన్ని కుటుంబ సభ్యుల సహకారంతో నిర్మించానని చెప్పారు. -
నా కూతుర్ని చంపేశారు: రహీమా
గుంటూరు : దాదాపు ముప్పయి గంటలు గడిచిన తర్వాత పెంపుడు తండ్రి మద్యం తాగించిన ఘటనలో మృతి చెందిన చిన్నారి షణ్ను విషయంలో కీలక మలుపులు తిరుగుతోంది. చిన్నారి అసలు తల్లి రహీమా బయటకు వచ్చింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తెను సైదానే చంపేశాడని ఆమె ఆరోపించింది. షణ్నును తన భర్త వద్ద వదిలేస్తానని.... అతను తీసుకోకుంటే మదర్సాలో చేర్పిస్తానని సైదా ఇరవై రోజుల క్రితం తన వద్ద నుంచి తీసుకు వెళ్లాడని రహీమా తెలిపింది. అయితే ఆతర్వాత షణ్నును తండ్రి దగ్గర వదిలేశాడా లేదా అనేది తాను పట్టించుకోలేదని తెలిపింది. సైదా, అతని సోదరుడు ఇస్మాయిల్ కలిసి మద్యం తాగుతూ, చిన్నారికి కూడా తాగించారని, పాప చనిపోయిన తర్వాత సైదా ఆమెను తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించాడని రహీమా మండిపడింది. పాప విషయానికొస్తే ... ఆమె కన్నతల్లిదండ్రులు విడిపోగా, సైదా అనే వ్యక్తి దగ్గర పాప ఉంది. అతడు సంతానం లేని ఇస్మాయిల్ దంపతులకు చిన్నారిని ఇచ్చాడు. ఇస్మాయిల్ దంపతులు మద్యం తాగుతూ, చిన్నారికి కూడా తాగించగా, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. స్థానికులు గమనించి, ఆసుపత్రికి తరలించేంతలోపే ఆమె కన్నుమూసింది. అయితే కావాలనే తన బిడ్డను పొట్టన పెట్టుకున్నారని చిన్నారి కన్నతల్లి ఆరోపిస్తోంది. సైదా మాత్రం ...పాపను తాను తీసుకు రాలేదని, తన ఆఫీసు ముందు రహీమానే షణ్నును వదిలేసిందని, ఇంటికి వెళ్లి అడిగితే తనకు సంబంధం లేదని చెప్పిందని చెబుతున్నాడు. ఇక పాప తండ్రి మాట్లాడుతూ తాను....రహీమా విడిపోయి అయిదేళ్లు అయ్యిందని.... పెద్ద పాప తన దగ్గరే ఉంటుందని, చిన్న పాప తల్లి దగ్గర ఉంటుందని తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు చాలా ఆలస్యంగా స్పందించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, ఇంతవరకూ ఎవ్వరిని అరెస్ట్ చేయకపోగా ... తమ నిర్లక్ష్యమేమీ లేదని పోలీసులు బుకాయిస్తున్నారు. -
నా కూతుర్ని చంపేశారు: రహీమా
-
మద్యం తాగించిన పెంపుడు తండ్రి.. పాప దుర్మరణం
పెంపుడు తండ్రి మద్యం తాగించడంతో చిన్నారి చనిపోయిన ఘటనలో ఇంతవరకూ పోలీసులు ఎవ్వరినీ పట్టుకోలేకపోయారు. గుంటూరులో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనపై ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఏడాదిన్నర పాపకు మద్యం తాగించిన తండ్రి ... చివరికి ఆమె ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. ఈ విషాద సంఘటన గుంటూరు నల్లచెరువులో సోమవారం చోటుచేసుకుంది. ఎవరి కన్నబిడ్డో తెలియదుగానీ .. సైదా అనే వ్యక్తి తన వద్ద ఉన్న చిన్నారిని .. సంతానం లేని ఇస్మాయిల్ దంపతులకు పెంచుకోవడానికి ఇచ్చాడు. అయితే, పండగ పూట తప్పతాగిన ఆ జంట ... బిడ్డకు కూడా కొంత మద్యం తాగించింది. దీంతో పాప అపస్మారక స్థితికి చేరుకుంది. ఇది గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయింది. ఈ సంఘటనపై పోలీసుల వైఖరి పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.