మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాట తెలుగువారు ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుతల్లి పరిస్థితి దయనీయంగా మారిందంటూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని సర్పవరం హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న వీరమణి అనే బాలిక అద్భుతంగా పాడింది. శంకరంబాడి సుందరాచార్య కలం నుంచి జాలువారిన అసలు పాటకు టంగుటూరి సూర్యకుమారి తన గళాన్ని ఇచ్చారు. ఆ పాటే ఇన్నాళ్లూ అందరికీ తెలుసు. కానీ.. తెలుగుతల్లిని మరిచారు, ఆ తల్లి మనసు విరిచారంటూ కాకినాడ బాలిక వీరమణి కళ్లు చెమర్చేలా పాడి అందరినీ ఆకట్టుకుంది.
మా తెలుగు తల్లికి మల్లెపూ దండ.. మా కన్న తల్లికి మంగళారతులు
మన తెలుగు తల్లిని మరచిపోయారా.. మముగన్న తల్లికి మనసు విరిచారా (2)
కడుపులో బంగారు.. కనుచూపులో కరుణ.. చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి
కడుపులో భుగభుగలు.. కనుచూపులో దిగులు.. చిరునవ్వు కనుమరుగు.. సిరులు నిలువున తరుగు..
ఇలా ఆ పాట సాగుతుంది.