గ్లోకెమ్‌ను మూసేయకపోతే ఆమరణ దీక్ష | glokemnu fast unto death | Sakshi
Sakshi News home page

గ్లోకెమ్‌ను మూసేయకపోతే ఆమరణ దీక్ష

Published Mon, Jun 30 2014 2:38 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

glokemnu fast unto death

  •      పెందుర్తిఎమ్మెల్యే బండారు హెచ్చరిక
  •      పేలుడు ఘటనపై సమగ్ర విచారణకు డిమాండ్
  •      భద్రతా ప్రమాణాలు పాటించాకే తెరుస్తామన్న యాజమాన్యం
  • పరవాడ: భద్రతా ప్రమాణాలు పాటించని గ్లోకెమ్ పరిశ్రమను తక్షణమే మూసివేయాలని లేని పక్షంలో ఆమరణ దీక్షలకు దిగుతామని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి  హెచ్చరించారు. ఫార్మాసిటీలో గ్లోకెమ్ పరిశ్రమలో శనివారం జరిగిన పేలుడు ప్రమాద ఘటనకు నిరసనగాఎమ్మెల్యే బండారు ఆదివారం పరిశ్రమ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రమాద సంఘటనపై సమగ్ర విచారణ జరిపి పేలుడుకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

    పరిశ్రమలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు.  భద్రతా ప్రమాణాలు పాటించని గ్లోకెమ్ పరిశ్రమను తక్షణమే మూసివేయాలని ఆయన పట్టుపట్టారు. పరిశ్రమలో పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నట్లు అధికారులు, ప్రజా ప్రజాప్రతినిదుల సమక్షంలో నిరూపించుకొన్నప్పుడే పరిశ్రమ తెరవాలన్నారు.గ్లోకెమ్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలన్నారు.

    ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఆందోళనకారులు బీడీఎం కార్యదర్శి నాగరాజును బలవంతంగా ఎమ్మెల్యే వద్దకు లాక్కొని వ చ్చారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి ప్రమాదాలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని ఎమ్మెల్యే ఆయనను హెచ్చరించారు. పరిశ్రమలో కట్టుదిట్టమైన భద్రత కల్పించిన తరువాతే పరిశ్రమను తెరుస్తామని యాజమాన్యం ప్రకటించడంతో ఆందోళన విరమించారు.

    ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా  గాజువాక ఏసీపీ కె.వి.రమణ, పరవాడ సీఐ పి.రమణ, ఎస్.ఐలు ఎన్.గణేష్, ఎం.సత్యారావు, బి.గోవిందరావు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆందోళన కార్యక్రమంలో పరవాడ జెడ్పీటీసీ సభ్యుడు పైల జగన్నాథరావు, రాష్ట్ర టీఎన్‌టీయూసీ కార్యదర్శి మాసవరపు అప్పలనాయుడు, మాజీ ఎంపీపీ ఎం.నీలబాబు, టీడీపీ నాయకులు కె.వి.రమణ, ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement