
సుభానిని అభినందిస్తున్న నిర్వాహకులు
వేటపాలెం: మండలంలోని దేశాయిపేట పంచాయతీ, రామానగర్‌లో ఉన్న వివేకా స్కూలు విద్యార్థి కరాటేలో బంగారు పతకం సాధించాడు. వివేకా స్కూలులో 6వ తరగతి చదువుతున్న ఎస్‌డీ సుభాని ఆదివారం చిలకలూరిపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కోచింగ్ క్యాంపులో కరాటేలో బంగారు పతకం సాధించాడు. ఈ క్యాంపులో 150 మంది విద్యార్థులు పాల్గొనగా సుభాని తన ప్రతిభ కనబర్చి బంగారు పతకం సాధించాడు. సేన మార్షల్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కావూరి నరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో సుభాని ఈ పోటీల్లో పాల్గొనగా నిర్వాహకులు సుభానిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment