రిమ్స్‌క్యాంపస్: పరిశుభ్రతతోనే మెరుగైన ఆరోగ్యం సాధ్యమని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. మంచి ఆరోగ్యానికి డీ వార్మింగు (పొట్టలో ఉన్న నులిపురుగులను నివారించట) ఎంతో దోహదం చేస్తోందన్నారు. జవహర్ బాల ఆరోగ్య రక్ష-పాఠశాల ఆరోగ్య పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న డీ వార్మింగు దినోత్సవాన్ని శ్రీకాకుళంలోని టీపీఎం ఉన్నత పాఠశాలలో మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుతో ఆల్‌బెండజోల్ 400 మిల్లీ గ్రాముల మాత్రలను వేయించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నులి పురుగుల నివారణపై శ్రద్ధ వహించాలన్నారు. జిల్లాలోని 3,580 ప్రభుత్వ పాఠశాలలు, వివిధ కళాశాలల్లోని 2,96,950 మంది విద్యార్థులకు డీ వార్మింగు దినోత్సవం సందర్భంగా ఆల్‌బెండాజోల్ మాత్రలు వేయించినట్టు పేర్కొన్నారు.
పిల్లలు పరిశుభ్రత అలవర్చుకోవాలన్నారు. డీఎంహెచ్‌వో ఆర్.గీతాంజలి మాట్లాడుతూ జిల్లాలో 4,77,421 ఆల్‌బెండాజోల్ మాత్రలను అందుబాటులో ఉంచామన్నారు. 5 నుంచి 18 సంవత్సరాల్లోపు విద్యార్థులతో మాత్రమే వీటిని వేయింస్తున్నట్టు చెప్పారు. అంతకముందు డీ వార్మింగు, వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులు, ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ సరోజిని, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త ఎం.సునీల, జవహార్ బాల ఆరోగ్య రక్ష జిల్లా కన్వీనర్ డాక్టర్ మెండ ప్రవీణ్ పాల్గొన్నారు.
2.97లక్షల మంది విద్యార్థులకు మాత్రలు పంపిణీ
రాష్ట్ర పరిశీలకురాలు సరోజిని
పాతపట్నం : జాతీయ నులిపురుగుల నివారణ (డీ వార్మింగ్) దినోత్సవంలో భాగంగా జిల్లాలో మంగళవారం 2,96,950 మంది విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేశామని రాష్ట్ర పరిశీలకురాలు డాక్టర్ సరోజిని చెప్పారు. పాతపట్నం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో డీవార్మింగ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పిల్లలకు ఇచ్చే మాత్రలు మింగించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఆమె వెంట డాక్టర్ ప్రవీణ్, కేజీబీవీ ప్రత్యేక అధికారి కె.అనూరాధ ఉన్నారు.
పరిశుభ్రతతోనే మంచి ఆరోగ్యం
Published Wed, Nov 12 2014 4:15 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement