జనం మధ్య జోరు యాత్ర
చేవెళ్ల, న్యూస్‌లైన్: బాజా భజంత్రీలు.. పాటలహోరు.. డప్పు చప్పుళ్లు.. కాంగ్రెస్ జెండాల రెపరెపలు.. కార్యకర్తల నృత్యాలు.. పోతురాజుల విన్యాసాలు.. మహిళల మంగళహారతులు.. కార్తీక్‌రెడ్డి పాదయాత్రలో జోష్ నింపాయి. ‘తెలంగాణ నవ నిర్మాణ పాదయాత్ర’ మూడో రోజైన శుక్రవారం చేవెళ్ల మండలంలోని ఇబ్రహీంపల్లి సమీపం నుంచి ప్రారంభమైంది. ఉదయం 10.40 నిమిషాలకు ఆ గ్రామ సర్పంచ్ ఎన్ను జంగారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పి.గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు మంగళహారతులివ్వగా కార్తీక్‌రెడ్డి నడక ప్రారంభించారు.
పాదయాత్రకు అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దామరగిద్ద, న్యాలట బస్‌స్టేజీల వద్ద మార్కెట్ చైర్మన్ ఎం.వెంకటేశంగుప్త, మార్కెట్ డెరైక్టర్ ఎండీ.అలీ, మాజీ జెడ్పీటీసీ పి.పరమయ్య తదితర నాయకులు, వేలాదిమంది గ్రామస్తులు, మహిళలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పోతురాజు విన్యాసం ఆకట్టుకుంది. అనంతరం బస్తేపూర్ వద్ద మాజీ వైస్ ఎంపీపీ శివానందం, చనువల్లి సర్పంచ్ అనుసూజ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ అనంతం తదితరులు స్వాగతం పలికారు. ఖానాపూర్ బస్‌స్టేజీ వద్ద ఉన్న ఇంద్రారెడ్డి విగ్రహానికి కార్తీక్‌రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆలూరు స్టేజీ వద్ద మండల ఉపసర్పంచుల సంఘం అధ్యక్షుడు ఎండీ.షబ్బీర్, వార్డు సభ్యులు కె.నర్సింహులు, మాజీ సర్పంచ్, అడ్వకేట్ మోకరం నర్సింహులు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు బుచ్చ య్య, రాంచంద్రయ్య కార్తీక్‌రెడ్డికి స్వాగ తం పలికారు. చివరగా చిట్టెంపల్లి వద్ద జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, అడ్వకేట్ వెంకటయ్య, నరేందర్, వీరస్వామిలు స్వాగతం పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా కాంగ్రెస్ నాయకులు పి.వెంకటస్వామి, ఎస్.బల్వంత్‌రెడ్డి, పి.కృష్ణారెడ్డి, డి.శ్రీధర్‌రెడ్డి, ఎం.బాల్‌రాజ్, జి.చంద్రశేఖర్‌రెడ్డి, ఎం.రమణారెడ్డి, వెంకటేశ్, ఎం.యాదగిరి, ఎం.విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న గుర్రం
పాదయాత్ర ప్రారంభ సమయంలో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ డెరైక్టర్ ఎండీ.అలీ సొంత గుర్రంపై రావడం అందరినీ ఆకట్టుకుంది. కాంగ్రెస్ జెండాలను చేతపట్టుకొని కొంతదూరం గుర్రంపై ఆయన స్వారీ చేశారు. కార్తీక్‌రెడ్డి పాదయాత్రకు ముందు గుర్రంవద్ద కొద్దిసేపు నిల్చుని పాదయాత్రను ఆరంభించారు.