సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించే స్కాలర్‌షిప్‌లకు ఆధార్‌తో లింక్ పెట్టడాన్ని నిరసిస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరికాంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు ఆధార్ కార్డులు లేక స్కాలర్‌షిప్‌లకు దూరమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా రోజుకో నిబంధన విధిస్తూ స్కాలర్‌షిప్‌ల బారినుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కలెక్టరేట్ల ముట్టడి సందర్భంగా విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విభాగ్ సంఘటన కార్యదర్శి సర్వేశ్, జిల్లా సంఘటన కార్యదర్శి శివనాథ్, నాయకులు మహేశ్, రాములు, మల్లేశ్, అనిత పాల్గొన్నారు.
సీఎం దిష్టిబొమ్మ దహనం
జిన్నారం: స్కాలర్‌షిప్‌ల మంజూరుకు ఆధార్ లింకు పెట్టడాన్ని నిరసిస్తూ సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టిన ఏబీవీపీ నాయకులను అరెస్టు చేయడం తగదని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆరోపిస్తూ ఏబీవీపీ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం జిన్నారంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకు మందు విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఏబీవీపీ మండల కన్వీనర్ సాయికుమార్ మాట్లాడుతూ స్కాలర్‌షిప్‌లను ఆధార్‌తో అనుసంధానం చేయడం సరికాదన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఇలాంటి ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంటామన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు భాస్కర్, శ్రీనివాస్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
Published Sun, Jan 5 2014 12:42 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement