The burning of the effigy
-
మాదిగలను మోసం చేస్తున్న చంద్రబాబు
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ మాదిగ ఏపీ సీఎం దిష్టిబొమ్మ దహనం హన్మకొండ : ఏపీ సీఎం చంద్రబాబు నాయు డు మాదిగలను మోసం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొయ్యడ మల్లేష్ మాదిగ, జాతీయ ప్రధాన కార్యదర్శి తిప్పారపు లక్ష్మణ్ మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ గురువారం హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్, మహా జన సోషలిస్ట్ పార్టీ (ఎంఎస్పీ) ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. సుబేదారి పోలీసులు చేరుకొని దిష్టిబొమ్మ కాలుతుండగానే లాక్కెళ్లారు. అరుునా ఆందోళనకారులు శాంతించకుండా రోడ్డుపై నిరసన తెలిపా రు. చివరకు పోలీసులు వారికి సర్దిచెప్పి పంపేశారు. ఈ సందర్భంగా మల్లేశ్ మాదిగ, లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ నారావారిపల్లె నుంచి చేపట్టే పాదయూత్రను అడ్డుకోవడానికి పోలీసులు మిర్యాలగూడలో మంద కృష్ణను అరెస్ట్ చేశారని తెలిపారు. మంద కృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయూలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జాతీయ అధికార ప్రతినిధి తీగల ప్రదీప్‌గౌడ్, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు వేల్పుల సూరన్న, గోవింద్ నరేష్, బుర్రి సతీష్, దామెర కరుణ, బండారి సురేందర్, వెంకటస్వామి, పుట్ట బిక్షపతి, బొర్ర బిక్షపతి, చాతల్ల శివ, రాగల్ల ఉపేందర్, సుకుమార్, కిష్టఫర్, స్వాతి పాల్గొన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మ దహనం
యూనివర్సిటీ క్యాంపస్: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల అనుచిత వైఖరిని నిరసిస్తూ బుధవారం ఎస్వీయూలో దిష్టిబొమ్మ దహనం చేశారు. వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వి.హరిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం ఎస్వీయూ లో ఈ కార్యక్రమం చేపట్టారు. వర్సిటీ ప్రధాన ద్వా రం వద్ద టీడీపీ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను తగులబెట్టారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరును విమర్శించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ నాయకులతో ప్రవర్తిం చిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. చంద్రబాబు రైతులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. విద్యార్థి నాయకులు హేమంత్‌కుమార్, సురేష్‌నాయక్, వెంకటకల్యాణ్, మురళీధర్, తేజేష్, నాగరాజు, కి షోర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, హేమంత్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘హెరిటేజ్’ను మూసివేయాలి
జోగిపేట: హెరిటేజ్ పరిశ్రమను మూసివేయాలని డిమాండ్ చేస్తూ జోగిపేటలో టీజీవీపీ ఆధ్వర్యంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీజీవీపీ నాయకులు విద్యార్థులతో ఊరేగింపుగా వచ్చి హెరిటేజ్ పరిశ్రమను మూసివేయాలంటూ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకు ముందు వారు స్థానిక తహశీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి, అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ టీజీబీవీ నాయకులు కృష్ణాగౌడ్, సురేష్ మాట్లాడుతూ హెరిటేజ్ పాల కారణంగా చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నందున ప్రభుత్వం వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హెరిటేజ్ పాలను నిషేధించాలి సంగారెడ్డి క్రైం: తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డి కొత్తబస్టాండ్ ఎదుట ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ పాలలో డిటర్టెంట్ కలిపి కల్తీ చేస్తున్నందున ఆ పాలను తెలంగాణ రాష్ట్రంలో నిషేధించాలన్నారు. కల్తీ పాల విక్రయాలకు మద్దతు పలుకుతున్న తెలంగాణ టీడీపీ నేతలు తమ వైఖరిని మార్చుకోవాలన్నారు. హెరిటేజ్ పాలు విక్రయించి ఎక్కువ లాభాలు పొందాలనే దురాలోచనతో ఆవులకు, గేదెలకు ఇంజెక్షన్లు ఇవ్వడంతో పసిపిల్లలు, విద్యార్థులు కిడ్నీ, కాలేయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ పాలను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల వేణు, మండల అధ్యక్షుడు శివరామకృష్ణ, మచ్చేందర్, రాజు, శ్రీనివాస్, నర్సిములు, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. -
ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించే స్కాలర్‌షిప్‌లకు ఆధార్‌తో లింక్ పెట్టడాన్ని నిరసిస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరికాంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు ఆధార్ కార్డులు లేక స్కాలర్‌షిప్‌లకు దూరమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా రోజుకో నిబంధన విధిస్తూ స్కాలర్‌షిప్‌ల బారినుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కలెక్టరేట్ల ముట్టడి సందర్భంగా విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విభాగ్ సంఘటన కార్యదర్శి సర్వేశ్, జిల్లా సంఘటన కార్యదర్శి శివనాథ్, నాయకులు మహేశ్, రాములు, మల్లేశ్, అనిత పాల్గొన్నారు. సీఎం దిష్టిబొమ్మ దహనం జిన్నారం: స్కాలర్‌షిప్‌ల మంజూరుకు ఆధార్ లింకు పెట్టడాన్ని నిరసిస్తూ సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టిన ఏబీవీపీ నాయకులను అరెస్టు చేయడం తగదని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆరోపిస్తూ ఏబీవీపీ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం జిన్నారంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకు మందు విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఏబీవీపీ మండల కన్వీనర్ సాయికుమార్ మాట్లాడుతూ స్కాలర్షిప్లను ఆధార్‌తో అనుసంధానం చేయడం సరికాదన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఇలాంటి ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంటామన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు భాస్కర్, శ్రీనివాస్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.