టీడీపీ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మ దహనం | TDP MLAs burning of the effigy | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మ దహనం

Published Thu, Mar 19 2015 4:07 AM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM

TDP MLAs burning of the effigy

యూనివర్సిటీ క్యాంపస్: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల అనుచిత వైఖరిని నిరసిస్తూ బుధవారం ఎస్వీయూలో దిష్టిబొమ్మ దహనం చేశారు. వైఎస్‌ఆర్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వి.హరిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో  విద్యార్థులు బుధవారం ఎస్వీయూ లో ఈ కార్యక్రమం చేపట్టారు. వర్సిటీ ప్రధాన ద్వా రం వద్ద టీడీపీ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను తగులబెట్టారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరును విమర్శించారు.

ఈ సందర్భంగా హరిప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులతో ప్రవర్తిం చిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. చంద్రబాబు రైతులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను  నెరవేర్చలేక రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. విద్యార్థి నాయకులు హేమంత్‌కుమార్, సురేష్‌నాయక్,  వెంకటకల్యాణ్, మురళీధర్, తేజేష్, నాగరాజు, కి షోర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, హేమంత్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement