మాదిగలను మోసం చేస్తున్న చంద్రబాబు
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు
మల్లేష్ మాదిగ ఏపీ సీఎం దిష్టిబొమ్మ దహనం
హన్మకొండ : ఏపీ సీఎం చంద్రబాబు నాయు డు మాదిగలను మోసం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొయ్యడ మల్లేష్ మాదిగ, జాతీయ ప్రధాన కార్యదర్శి తిప్పారపు లక్ష్మణ్ మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ గురువారం హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్, మహా జన సోషలిస్ట్ పార్టీ (ఎంఎస్‌పీ) ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. సుబేదారి పోలీసులు చేరుకొని దిష్టిబొమ్మ కాలుతుండగానే లాక్కెళ్లారు. అరుునా ఆందోళనకారులు శాంతించకుండా రోడ్డుపై నిరసన తెలిపా రు.
చివరకు పోలీసులు వారికి సర్దిచెప్పి పంపేశారు. ఈ సందర్భంగా మల్లేశ్ మాదిగ, లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ నారావారిపల్లె నుంచి చేపట్టే పాదయూత్రను అడ్డుకోవడానికి పోలీసులు మిర్యాలగూడలో మంద కృష్ణను అరెస్ట్ చేశారని తెలిపారు. మంద కృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయూలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌పీ జాతీయ అధికార ప్రతినిధి తీగల ప్రదీప్‌గౌడ్, ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ నాయకులు వేల్పుల సూరన్న, గోవింద్ నరేష్, బుర్రి సతీష్, దామెర కరుణ, బండారి సురేందర్, వెంకటస్వామి, పుట్ట బిక్షపతి, బొర్ర బిక్షపతి, చాతల్ల శివ, రాగల్ల ఉపేందర్, సుకుమార్, కిష్టఫర్, స్వాతి పాల్గొన్నారు.