ఉట్నూర్, న్యూస్‌లైన్ : సమగ్ర గిరిజనాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ఐటీడీఏ ఆధీనంలోని 4.95లక్షల మంది ఆదివాసీ గిరిజనుల ప్రగతికి బాటలు వేసేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్ అన్నారు. గురువారం 67వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉన్న 905 ప్రాథమిక పాఠశాలల్లో 983 మంది ఉపాధ్యాయులతో 19,212 మంది విద్యార్థులకు ప్రాథమిక విద్య అందిస్తున్నట్లు చెప్పారు. మరో 256 మంది ఎస్జీటీల నియామకానికి చర్యలు తీసుకుంటున్నామని, ఆశ్రమ పాఠశాలల్లో ఉన్నత విద్యాభివృద్ధికి 577 మంది సీఆర్టీలను నియమించామని తెలిపారు.
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 146 ఆశ్రమ, వసతి, కస్తూరిబా, గురుకుల, మినీ గురుకుల పాఠశాలలు, ఆరు గురుకుల కళాశాలలు, ఒక డిగ్రీ కళాశాల ద్వారా 42,493 మంది విద్యార్థులకు ఉన్నత విద్య అందిస్తున్నామని వివరించారు. పునాది, క్వెస్ట్, రూపాంతర్, దిశ కార్యక్రమాలతో మెరుగైన విద్యకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. హరివిల్లు కింద 137 పాఠశాలల్లో సర్వే నిర్వహించామని అన్నారు. గత సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో 89.68 శాతం ఉత్తీర్ణత సాధించగా 92 మంది గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించామని పేర్కొన్నారు. 31 పీహెచ్‌సీల్లో 186 ఉప కేంద్రాలు, 11క్లస్టర్ల ద్వారా గిరిజనులకు నిరంతరం వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పిన్ పాయింట్, ర్యాపిడ్ ఫీవర్ సర్వేల్లో గుర్తించిన జ్వర పీడితులు, రక్తహీనత, అతిసార, మలేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
27 పీహెచ్‌సీలకు అంబులెన్స్ సౌకర్యం కల్పించామని, ఏజెన్సీలో వ్యాధుల నివారణకు టోల్‌ఫ్రీ నంబరు 18004255226 ఏర్పాటు చేశామన్నారు. నాలుగు డీఆర్‌డిపోల నిర్మాణానికి రూ.48.40 లక్షలు, 12 అంగన్‌వాడీ భవన నిర్మాణాలకు రూ.51 లక్షలు నాబార్డు నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఐఏపీ పథకం కింద రూ.34.60 కోట్లతో 229 రకాల పనులు చేపట్టామన్నారు. అర్హులైన 37,589 మంది గిరిజనులకు 4,05,628.14 ఎకరాల భూములపై అటవీ హక్కు పత్రాలు అందజేశామని వివరించారు. ఆమ్‌ఆద్మీ, జనశ్రీ యోజన పథకాల కింద 1,085 మంది విద్యార్థులకు రూ.12.91 లక్షలు ఉపకార వేతనాలు పంపిణీ చెశారు. ఈ వేడుకల్లో ఐటీడీఏ ఏపీఓ(జనరల్) వెంకటేశ్వర్లు, మలేరియా అధికారి అల్హం రవి, ఈఈటీడబ్ల్యు శంకరయ్య, ఏఓ భీం, ఈజీఎస్‌ఏపీడీ(టీపీఏంయూ) నూరొద్దీన్, ఐటీడీఏ మేనేజర్ స్వామి, ఈజీఎస్ అంబుడ్సుమెన్ నాగోరావు, జన వికాస జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, ఉట్నూర్ సర్పంచ్ బొంత ఆశరెడ్డి పాల్గొన్నారు
గిరి సీమ సంపూర్ణ అభివృద్ధి కృషి
Published Fri, Aug 16 2013 4:16 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
Advertisement