సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి గవర్నర్ నరసింహన్ మరో ఝలక్ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి చివరి రోజుల్లో మండలి చీఫ్ విప్, విప్‌లను నియమిస్తూ తీసుకున్న నిర్ణయాలతో పాటు, అసెంబ్లీ చీఫ్ విప్, విప్‌ల పదవులను కూడా గవర్నర్ రద్దు చేశారు. మండలి చీఫ్ విప్‌గా రుద్రరాజు పద్మరాజు, విప్‌లుగా ఎం. రంగారెడ్డి, ఆర్. రెడ్డపరెడ్డిలను నియమించారు. అసెంబ్లీ చీఫ్ గండ్ర వెంకట రమణారెడ్డి, విప్‌లు అరేపల్లి మోహన్, ద్రోణంరాజు శ్రీనివాసరాజు, పేర్ని నాని, తూర్పు జయప్రకాశ్‌రెడ్డిల పదవులను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే అసెంబ్లీ విప్‌గా ఉన్న ఎమ్మెల్యే అనిల్ పేరును ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. పేర్ని నాని విప్ కాకపోవడం గమనార్హం.
కిరణ్ నియమించిన విప్ పదవులు రద్దు
Published Wed, Mar 26 2014 2:10 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement