
కేంద్రానికి గవర్నర్ నివేదిక
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కేంద్ర ప్రభుత్వానికి ఓ నివేదిక పంపారు. అయితే ఈ నివేదికలో మాత్రం ఆయన ఎలాంటి సూచనలు చేయలేదని తెలిసింది. వివిధ రాజకీయ పార్టీలు వెలిబుచ్చిన అభిప్రాయాలను మాత్రం క్రోడీకరించి వాటిని మాత్రమే ఓ నివేదిక రూపంలో పంపారు.
అలాగే, ముఖ్యమంత్రి రాజీనామా చేసినప్పుడు పాటించే సంప్రదాయంలో భాగంగా ప్రతిపక్ష నాయకులు అందరితోనూ గవర్నర్ మాట్లాడారు. అందులో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కూడా గవర్నర్ ఫోన్లో మాట్లాడి, ముఖ్యమంత్రి రాజీనామా చేసిన విషయాన్ని తెలిపారు.