ఏలూరు, న్యూస్‌లైన్ : ప్రజలకు సత్వర సేవలు అందించేం దుకు గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని, వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ టి.బాబూరావు నాయుడు హెచ్చరించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం డెప్యూ టీ తహసిల్దార్ల సమావేశంలో రెవెన్యూ వ్యవస్థ ప్రాధాన్యతను జేసీ వివరించారు. గ్రామస్థాయి నుంచి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయాలనే ఉద్దేశ్యంతోనే వీఆర్వోల వ్యవస్థను బలోపేతం చేశారని, అయితే వీఆర్వోల పనితీరు ఆశించిన మేర లేదని ఆయన ఆవేదన వ్యక్తం చే శారు.
గ్రామస్థాయిలో అన్ని శాఖలతో సమన్వయంగా పనిచేయాల్సిన వీఆర్వోలు సరైన సమాచారాన్ని యంత్రాంగానికి ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలిందన్నారు. దశాబ్దాల తరబడి గ్రామాల్లో పాతుకుపోయిన వీఆర్వోలను బదిలీ చేసి రెవెన్యూ వ్యవస్థను జిల్లాలో పటిష్టం చేయడానికి కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆలోచిస్తున్నట్లు జే సీ వివరించారు.
వీఆర్వో స్థారుు నుంచి ప్రగతి నివేదికలు
వీఆర్వో స్థాయి నుంచి ప్రగతి నివేదికలు ప్రతినెలా సమగ్రంగా సమర్పించాలని, గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు రెవెన్యూ అధికారులు ప్రతి విషయంపై సమగ్ర అవగాహనతో విధులు నిర్వర్తించాలన్నారు. ఎవరైనా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తే ఊపేక్షించబోమని జేసీ హెచ్చరించారు. జిల్లాలో ఒక్క గజం కూడా స్థలం అన్యాక్రాంతం కాకూడదని, భూముల సమగ్ర సమాచారం, జమాబందీ రికార్డులు, మీ సేవ కేంద్రాల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆయన ఆదేశించారు.
త్వరలో మండల స్థాయిలో వీఆర్వోలు, ఆర్‌ఐలతో సమావేశాలు నిర్వహించి రెవెన్యూ వ్యవస్థను ఏ విధంగా పటిష్టం చేయా లో సూచించాలని డీటీలను కోరారు. డీఆర్వో కె.ప్రభాకర్‌రావు మాట్లాడుతూ ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఎవరికైనా భూమి కేటాయించాలంటే ఆయా శాఖల ప్రధాన కార్యాలయాల నుంచి అవసరమైన భూ ప్రతిపాదనలు కలెక్టర్‌కు అందాలని చెప్పారు. 10 ఎకరాలు లేదా రూ.50 లక్షల విలు వ లోపు భూములను ప్రభుత్వం సంస్థలకు కేటాయిం చే అధికారం కలెక్టర్‌కు ఉందని, ఆపై ప్రతిపాదనలను ప్రభుత్వానికి అనుమతి కోసం పంపాలని ఆయన వివరించారు. కేటాయించిన భూములు లీజుకు ఇచ్చినా చట్ట విరుద్ధంగా వినియోగిస్తున్నా అటువంటి వాటిపై నివేదిక సమర్పిస్తే జిల్లా స్థాయి ల్యాండ్ ఆడిట్ మోనటరింగ్ కమిటీ పరిధిలోకి తీసుకువచ్చి వాటిని రద్దు పరుస్తామని డీఆర్వో తెలిపారు.
ఉద్యోగుల పనితీరు తెలుసుకునేందుకు గ్రేడింగ్ విధానం
జిల్లాలో పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగుల పనితీరును తెలుసుకునేందుకు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇందుకు రెవెన్యూ స్కోర్ కార్డును ఆన్‌లైన్‌లో పొందుపర్చామని జారుుంట్ కలెక్టర్ చెప్పారు. ప్రతి నెలాఖరున గ్రామాల వారీగా ప్రగతి వివరాలను డీటీలు సేకరించి ఆన్‌లైన్‌లో రెండో తేదీలోగా డేటాను పొందుపర్చాలన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను నూరు శాతంపైగా సాధించిన ఉద్యోగులకు గ్రేడ్-ఏ 90 నుంచి 100 శాతం లక్ష్యాలు సాధిస్తే గ్రేడ్ బి, 80 నుంచి 90లోపు సాధిస్తే గ్రేడ్ సీ, 80 శాతం లోపు ఉంటే వారిని డి గ్రేడ్‌లో ఉంచుతామన్నారు. పనితీరును బట్టి పదోన్నతులు కల్పిస్తామన్నారు. రెవెన్యూ స్కోర్ కార్డులో తప్పుడు సమాచారం పొందుపరిస్తే అటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
రెవెన్యూ ఉద్యోగులకు గ్రేడింగ్
Published Sat, Jun 7 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM
Advertisement
Advertisement