శివ్వంపేట, న్యూస్‌లైన్ : మండల పరిధిలోని గ్రామీణ వికాస్ బ్యాంక్ గోమారం శాఖ కార్యాలయంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు దోపిడీకి విఫలయత్నం చేశారు. తుప్రాన్ సీఐ రవీందర్‌రెడ్డి కథనం మేరకు.. గుర్తు తెలియని వ్యక్తులు బ్యాం క్ ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బ్యాంక్ లోపల మూడు సీసీ కెమెరాలు ఉండగా అందు లో ఒకదాని కనెక్షన్ తొలగించి మరో దా న్ని గోడ వైపునకు తిప్పారు. అనంతరం లాకర్లు ఉన్న అల్మరాను ధ్వంసం చేసి తలుపులు తెరిచారు. అందులో డబ్బు లేకపోవడంతో పక్కనే ఉన్న లాకర్లను తెరిచేందుకు విశ్వప్రయత్నం చేశారు. అవి తెరుచుకోక పోవడంతో దుండగులకు డబ్బు, నగలు లభ్యం కాలేదు.
చోరీ యత్నానికి సంబంధించిన వివరాలను బ్యాంక్ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను ఈ సందర్భంగా పరిశీలించాం. బ్యాంక్ లోనికి చొరవడిన ఇద్దరు వ్యక్తులు మొహానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు ధరించారు. ఇదిలా ఉండగా సంఘటనా స్థలాన్ని గ్రామీణ వికాస్ బ్యాంక్ డివిజనల్ మేనేజర్ పీవీ కృష్ణారెడ్డి పరిశీలించారు. బ్యాంక్‌లో ఎలాంటి సొమ్మూ పోలేదని శాఖ మేనేజర్ ఎం ప్రభాకర్‌రావు తెలిపారు. బ్యాంక్ చోరీకి ప్రయత్నించిన దుండగులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ రవీందర్‌రెడ్డి తెలిపారు. పలు ఆధారాల కోసం క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు.
ప్రారంభించిన ఐదు నెలలకే చోరీ
గ్రామంలో గ్రామీణ వికాస్ బ్యాంక్ శాఖను ఐదు నెలల క్రితం రాష్ట్ర మంత్రి సునీతారెడ్డి ప్రారంభించారు. పదిహేను సంవత్సరాల క్రితం గ్రామంలో ఉన్న బ్యాంక్‌లో లావాదేవీలు సక్రమంగా జరగకపోవడం, అదే సమయంలో చోరీ కూడా జరిగింది. దీంతో సంబంధిత అధికారులు బ్యాంక్‌ను నర్సాపూర్‌కు తరలించారు. అయితే గ్రామస్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మం త్రి చొరవతో తిరిగి శాఖను ఇటీవల ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బ్యాం క్ దోపిడీకి యత్నించడం గమనార్హం.
బ్యాంక్ దోపిడీకి విఫలయత్నం
Published Sun, Oct 27 2013 12:42 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement